Friday, 11 November 2011

కాంగ్రెస్ గూటిలోనే జయసుధ ..జగన్ జలక్ ఇవ్వనున్న సహజనటి







వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభిచిన సిని నటి జయసుధ ఇప్పుడు నిజజీవితంలో నటించలేక పోతున్నారు. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆమె జగన్ వైపు నిలిచారు. జగన్ పెట్టిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ గా కొనసాగలేక తెలంగాణా ఉద్యమం పేరుతొ రాజీనామా చేసారు , జగన్ అవినీతి కేసుల్లో వై. ఎస్. ఆర్ పేరు చేర్చినందుకు నిరసన తెలిపారు కూడా. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో జగన్ చుట్టూ సి. బి. ఐ. కేసుల ఉచ్చు బిగిస్తుండడంతో ఏమి చేయాలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. రంగా రెడ్డి  జిల్లాలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేసారు. వై. ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ పథకం తనను ఎంతగా ఆకర్శించిందో అంతగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం ఆకర్షించిందని రచ్చబండ బహిరంగ సభలో పొగిడారు. చూస్తుంటే జగన్ కు జయసుధ జలక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల సమాచారం .

Thursday, 10 November 2011

ఎట్టకేలకు తెలంగాణాలో విజయవంతంగా చంద్ర బాబు పాదయాత్ర


రైతులకోసం చంద్ర బాబు చేపట్టిన పాదయాత్ర ఎట్టకేలకు తెలంగాణలో కూడా విజయవంతం అవుతోంది. ఇప్పటికే ఆయన రాయలసీమలోని అనంతపురం , కర్నూలు, కడప జిల్లాలు , ప్రకాశం జిల్లాలోనూ విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేసుకొని తెలంగాణలో అడుగుపెట్టారు. రైతులు కష్టాల్లో వున్నా ఈ సమయంలో చేపట్టిన పాదయాత్ర చంద్ర బాబుకు కలసి వస్తోంది. ఖమ్మం , నల్గొండ జిల్లాలో జరిగిన పాదయాత్రలో పార్టి కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొన్నారని, రైతులు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని పార్టి వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఇంతవరకు బాబు సభలకు అడ్డుపడే టి. ఆర్. ఎస్. ఈ సారి ఎందుకో అడ్డుపడడం లేదు.  ఇటీవల తెలంగాణా ఉద్యమ సెగలు బాబును ఉక్కిరిబిక్కిరి చేసాయి. అయినా ఆయన రెండుకళ్ళ సిద్ధాంతాన్ని టి.ఆర్.ఎస్ తో పాటు కాంగ్రెస్ వాళ్ళు తూర్పారబట్టారు. అయితే ఈ పర్యటనతో ప్రజలతో మమేకం కావడం , రైతులకు దగ్గర కావడంతో పాటు తెలంగాణలో కూడా తమ పార్టి కు పట్టు వుందని తెలుగుదేశం కేడెర్ నిరూపించుకున్నట్టే.

Monday, 7 November 2011

తుస్సుమన్న జగన్ ఎత్తుగడ !

గాలి జనార్ధన్ రెడ్డి కేసులో తనను విచారిస్తారని జగన్ ఏనాడు ఊహించలేదు . ఉన్నట్టుండి సి. బి. ఐ. నుండి పిలుపు రావడంతో తన పైన ఎక్కడ గాలి అవినీతి మారక పడుతుందేమో నని ఆయన తెలివిగా సి.బి.ఐ. ఆఫీసు నుండి బయటకు రాగానే చంద్ర బాబు పై విరుచుకు పడ్డారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి చంద్ర బాబు తను ముఖ్య మంత్రిగా వున్నప్పుర్డు 2002 లోనే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని దీంట్లో తన తండ్రి పాత్ర లేదని , తనను సి.బి. ఐ. సాక్షిగానే పిలిచిందని , ఏ కేసులో చంద్రబాబు ను ఎందుకు విచారించరని   సి.బి.ఐ ని ప్రశ్నించినట్టు తెలిపారు. దీంతో జగన్ ను సి.బి. ఐ విచారించిన వార్తల కన్నా చంద్ర బాబు ఇచ్చిన జి. ఓ పై ఆయనను ఎందుకు విచారించకూడదో  అన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత  పెరిగింది.
అయితే రాజకీయాలలో అన్ని రకాలు చూసిన చంద్ర బాబు తాము ఇదివరకే విడుదల చేసిన మైనింగ్ మాపియా బుక్ లోని కాపీ నే ఫొటోస్టాట్ తీసి మాపైననే ఆరోపణలు చేయడం దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు వుందని అన్నారు. పైగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి కోర్ట్ ఆదేశాల మేరకు జి.ఓ ఇచ్చామని  జి.ఓ ఇచ్చినప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆ కంపెనీలో లేరని
సాక్ష్యాలతో బయట పేట్టే సరికి జగన్ చేసిన ఆరోపణలు తుస్సుమన్నాయి. ఒక విషయం పై ఆరోపణ చేస్తున్నప్పుడు అన్ని చూసుకొని ఆరోపణ చేయాలి. విషయం పై అవగాహన వుండాలని జగన్ ఇక నైన నేర్చుకుంటాడని ఆశిద్దాం .

Thursday, 3 November 2011

పదవిపై చిగురిస్తున్న చిరంజీవి ఆశలు ...






ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసిన తరువాత  రాష్ట్ర స్థాయి ముఖ్య నేతగా గుర్తింపు సంపాదించుకుంటున్న తిరుపతి ఎం. ఎల్ . ఎ . చిరంజీవి కి పదవి లబిస్తుందనే ఆశలు మళ్లీ చిగురించాయి. తెలంగాణా సమస్య తగ్గు ముఖం పట్టడం, జగన్ కేసులలో ఉక్కిరి బిక్కిరి కావడంతో .. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన మాటను ఆదిస్థానం నిలబెట్టుకుంటుందని ఆయన విధేయత ప్రకటిస్తున్నారు . చిరంజీవికి జన బలం వుందని నమ్ముతున్న కాంగ్రెస్ ఆదిస్థానం ఆయనకు మంచి పదవినే ఇవ్వనున్నట్టు తెలిసిది. అయితే చిరంజీవిని నమ్ముకొని కాంగ్రెస్ లో చేరిన వారికి మొండి చెయ్యే అని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టి పేరుతొ మార్పు ప్రజలకు అందలేదు కాని చిరంజీవికి మాత్రం ఉపయోగ పడుతోంది. రాష్ట్ర మంత్రిగా ఇచ్చిన చేస్తానని కూడా చిరంజీవి అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి లక్ష్యం చేరుకోవాలంటే రాష్ట్రంలో ఏదో ఒక పదవి అన్దాలిసిన అవసరం వుందని ఆయన అభిమానులు అంటున్నారు.

రైతు పోరుబాట గా చంద్రబాబు పాదయాత్ర




 
ఎక్కడ పోగొట్టుకున్నామో .. అక్కడే వెతకాలని సామెత . చంద్ర బాబు అదే చేస్తునారు. తెలుగు దేశం అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు బుధవారం అనంత పురం జిల్లా నుండి రైతు పోరుబాట పేరుతొ పాద యాత్ర మొదలు పెట్టారు.  దూరమైనా రైతులకు దగ్గరవుతూ పార్టి ప్రతిస్తా కోసం చేప్పటిన ఈ పాదయాత్ర  అప్పుడే అధికారపక్షం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి . రైతుకు గిట్టు బాటు ధర తో పాటు వివిధ అంశాలపై గతంలోనే చంద్ర బాబు నిరాహార దీక్ష చేప్పట్టిన విషయం విదితమే. అయితే ఇటీవల వర్షాలు కురవక కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ వర్షంతో పంటలు పడి కొన్ని ప్రాంతాలలో రైతులు రాష్ట్ర వ్యాపితంగా నష్టపోయారు. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టి కి మొదటి నుండి అండగా వున్న అనంతపురం ను ఎంపిక చేసుకోవడం విశేషం . అనంతపురం  దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుపొందింది. ఈ పాద యాత్రలో భాగంగా చంద్ర బాబు రోజుకి 15 కి.మీ దూరం నడుస్తునారు. ఈ విధంగా 20 రోజుల పాటు జరిగే సుదీర్గ యాత్ర రైతులలో ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంచవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

గాలి కేసులో జగన్ ను విచారించనున్న సి. బి.ఐ

అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన గాలి జనార్ధన రెడ్డి కేసు విచారణలో భాగంగా వై.ఎస్. ఆర్ పార్టి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని సి.బి. ఐ. విచారించనుంది. రెడ్ గోల్డ్, ఆర్.ఆర్. గ్లోబల్ సంస్థల పెట్టుబడులు సాక్షిలో వున్నాయని , గాలి అక్రమ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయా లేవా అని విచారించనున్నట్టు తెలిసింది. జగన్ ను ఈ నెల 4 వ తేది హైదరాబాద్ లోని కోటి సి.బి.ఐ. అపిస్ కు రావాలని ఆదేశాలు ఇచ్చింది.  అయితే రాజకీయ వర్గాల అభిప్రాయం మేరకు జగన్ ను గాలి కేసులో విచారణ నిమిత్తం సి.బి.ఐ తన ముందుకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే అక్రమ ఆస్తులు కలిగి వున్నా కేసులో విచారణ ఎదుర్కొటున్న జగన్ కు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. జగన్ కేసులో విచారణ మందకొడిగా సాగుతోందని , జగన్ కాంగ్రెస్ తో కుమ్ముక్కు అయ్యారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సి.బి. ఐ. గట్టి నిర్ణయం తీసుకొండానే చెప్పాలి .

Tuesday, 1 November 2011

కోమటిరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష

 
తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామాచేసి పోరాడుతున్న కాంగ్రెస్ నల్గొండ నాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణా వచ్చే వరకు తన దీక్ష ఆగదని మరో సారి అన్నారు.  తెలంగాణా కు చెందినా వివిధ పార్టీల నాయకులు సంఘీభావం  తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా దీక్ష చెప్పట్టడం విశేషం . రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స చివరి నిమిషం వరకు నిరాహార దీక్షను వాయిదా వేసుకోమని కోరినా కోమటిరెడ్డి వినలేదని తెలిసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా ఉద్యమాన్ని ప్రతిష్ట పరిచి తెలంగాణా సాధనకోసం ఆయన పూనుకున్నట్టు అంటున్నారు. అయితే జగన్ వై. ఎస్. ఆర్. పార్టీ సహాయ సహకారాలతోనే కోమటి రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీ కి బేస్ కోసం ఇప్పటినుండి కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వున్నాయి. ఆయన నిరాహార డిక్ష ఎలాంటి పలితాలు ఇస్తుందో వేచి చూడాలి