Monday, 4 June 2012
సి.బి.ఐ కి కొరకరాని కొయ్యగా జగన్
Saturday, 2 June 2012
రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు
రాష్ట్ర్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీద ఉంది. ఎదుటి వారిపై బురద జెల్లడానికి ఉన్న అన్నింటిని అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికల ప్రచారం మొదలవడంతోనే వై.యస్.ఆర్ పార్టీ అధ్యక్షుడిని అవినీతి, అక్రమాస్తుల కేసుల విచారణ నిమిత్తం సి.బి.ఐ అరెస్టు చేయడంతో మొత్తం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి గందరగోళంగా తయారయిందని చెప్పవచ్చు. అంతకు మునుపు జగన్ ను రాజకీయంగా అణగద్రొక్కుతున్నార్న దానికి అనుకూలంగా ఉన్న ప్రజానీకం జగన్ అరెస్టుతో ఓటర్ల మనోగతం మారిపోయినట్టు కనబడుతోంది. ముఖ్యంగా హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత సి.బి.ఐ అరెస్టు చేయడం సక్రమమేనని హైకోర్టు తీర్పు నివ్వడంతోను మరియు గాలి జనార్థన్ రెడ్డి కేసులో న్యాయమూర్తి బెయిల్ కోసం లంచం తీసుకున్న సంఘటనను సి.బి.ఐ బట్టబయలు చేయడంతోను జనం అభిప్రాయంలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక జగన్ స్థానంలో ప్రచారానికి దిగిన విజయమ్మ, షర్మిల లు ప్రచారంలో రాజశేఖర్ రెడ్డి చావును కూడా రాజకీయానికి వాడుకోవడంతో సానుభూతి స్థానంలో మరింత వ్యతిరేకత పొడసూపినదని సమాచారం. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అయోమయంలో పడిపోయింది. వలసలలు వస్తారనుకున్న యం.ఎల్.ఏ లు కూడా పునరాలోచలో పడ్డారు. తెలుగుదేశం నూజీవీడు యం.ఎల్.ఏ రామ కోటయ్య తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నానీ తో పాటు మరో 5-10 మంది వస్తారనుకున్నా వారేమీ వలసలు వచ్చేట్టు లేదు. ఇంతకు మునుపు కన్నా ఆ పార్టీ నాయకుడు జగన్ పై అవినీతి ఆరోపణలు సునామీలా చుట్టు ముడుతున్నాయి. ఈ లోపుగా కాంగ్రెస్ చాపక్రింద నీరు లా కేడర్ ను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ, 1 లోకసభ స్థానాలలో ఇంతకు మునుపు అన్నీ తామే గెలుస్తామని చెపుతూ వచ్చిన వై.యస్.ఆర్ పార్టీ ఇప్పుడు అంత నమ్మకంతో లేదు. ప్రస్తుతం ఆ పార్టీ పూర్తిగా సానుభూతి పవనాలపైననే ఆశలు పెట్టుకోనున్నది. తెలంగాణాలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక అసెంబ్లీ స్థానం పరకాలలో అయితే కొండాసురేఖ గెలుపు పై ఎవరూ నమ్మకంతో లేరు. అక్కడ టి.యస్.ఆర్., బి.జె.పిలు పోటా పోటీగా గెలుపు బాటలో ఉన్నాయి. ఇక చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతిలో అయితే అప్పుడే కాంగ్రెస్ ఆభ్య్రర్థి తన ఓటమి ఖాయ మన్నట్టు, తనకు పార్ఠీ వారే వెన్నుపోటు పొడుస్తున్నట్టు విలేకరులతో వాపోయారు. అక్కడ గతంలో కరుణాకర రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గతంలో చిరంజీవి పై ఓడిపోయారు. ఇప్పుడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పై పోటీలో ఉన్నా ఆయనపై ఆరోపణలు ఆయనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. అక్కడ టి.డి.పి అభ్యర్థి చదలవాడకు గెలుపు అవకాశం రోజు రోజుకు పెరుగుతోంది. అదేవిధంగా మిగిలిన నియోజక వర్గాలలో కూడా సమీకరణలు మారుతున్నాయి. ఈ లెక్కలన 18 స్థానాలకు గాను వై.యస్.ఆర్ పార్టీ 7-9 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ చెరి సగం పంచుకుంటాయి. ఈ ఉప ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిచినా వై.యస్.ఆర్ పార్టీ ప్రస్తుతం తన ప్రక్కన ఉన్న కొంత మంది. యం.ఎల్.ఏల ను కోల్పోకతప్పదు. ఒక వేళ అన్ని సీట్లు గెలువగలిగితే కాంగ్రెస్ నుండి వలసలు మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది.
సి.బి.ఐ కస్టడీకి జగన్
తనను అరెస్టు చేయడం, మరియు తనపై అక్రమ కేసులు పెట్టడాన్ని కొట్టివేయాలని జగన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు శనివారం కొట్టివేసింది. అంతే గాక సి.బి.ఐ చర్యను సమర్థిస్తూ అరెస్టు సక్రమమేనని, మరిన్ని విషయాలు విచారించడానికి గాను జగన్ ను సి.బి.ఐ కస్టడీకి అప్పజెప్పింది. జగన్ ఈ కేసు నిమిత్తం ఢిల్లీ నుండి పెద్ద పేరున్న లాయర్లను పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. 37 అంశాలకు సంబంధించి, విదేశీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలనే సి.బి.ఐ వినతిని మనిస్తూ 5 రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పును వెలువరించింది. ఎన్నికలలో తాను ప్రచారం చేసుకోవాలని జగన్ పెట్టుకున్న పిటీషన్లతో పాటు అన్ని పిటీషన్లను కొట్టివేస్తూ తీర్పున వెలువరించింది. అయితే చాలామంది కె.ఏ. పాల్ కు ఎన్నికల దృష్ట్యా బెయిల్ దొరికినట్టు దొరుకుతుందేమోనని ఆశించారు. అయితే ఈ కేసును ఆ కేసుతో పోల్చి చూడలేమని, నేరం తీవ్రంగా ఉన్న దృష్ట్యా , నిందితుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా జగన్ ను బెయిల్ ను నిరాకరిస్తూ సి.బి.ఐ కస్టడీకి అప్పజెప్పింది. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో గుబులు అలుముకున్నట్టే. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీకి హైకోర్టు తీర్పు చెంప పెట్టులా భావిస్తున్నారు.
Friday, 1 June 2012
ఉప ఎన్నికల లోపుగా మచ్చపడ్డ మంత్రుల అరెస్టు ?
వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర్ర ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో విడుదలయిన 26 జి.వోలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులను దశలవారీగా సి.బి.ఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వాక్ పిక్ కుంభకోణంలోమోపిదేవి వెంకటరమణ అరెస్టయిన విషయం విదితమే. అదేవిధంగా అప్పుడు మంత్రులుగా పనిచేసిన గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు లతో సహా మరో ఇద్దరు మంత్రులను అరెస్టు చేసే అవకాశం ఉందని మీడియా కోడై కూస్తోంది. వీరు అరెస్టును తప్పించుకునేందుకు గాను ముఖ్య మంత్రి స్థాయిలో ప్ర.యత్నం చేసి వీలుకాక కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికలలో జగన్ అరెస్టు వల్ల సానుభూతి రాకుండా ఉండడం కోసం వారిని ఉప ఎన్నికలలలోపుగా అరెస్టు చేసేందుకు తద్వారా జగన్ పై సానుభూతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుండడం విశేషం. ఏది ఏమైనా రాజశేఖర్ రెడ్డి చేయించిన అవినీతి మరింత మందిని బలితీసుకునే అవకాశం ఉందని చెప్పకతప్పదు.
న్యాయమూర్తి కే సోకిన అవినీతి గాలి
తలుచుకుంటేనే కంపరం పుట్టేవిధంగా సి.బి.ఐ న్యాయమూర్తిగా ఉన్న పట్టాభిరామ్ డబ్బులు తీసుకుని గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం అనేది అవినీతి విషపు నాగు వేళ్ళూనుకున్న విషయాన్ని నిర్ధారిస్తోంది. గనులు తవ్వుకుని కోట్లు గడించిన అహంకారంతో న్యాయవ్యవస్థనే కబళించపూనడం నిజంగా దురదృష్టకరం. మెలుకువగా ఉన్న సి.బి.ఐ ఎంతో చాకచక్యంగా ఈ కేసును పరిశోధన చేసి హైకోర్టు ద్వారా పూర్తి విచారణకు అనుమతి పొందడం మెచ్చదగిన విషయం. ఈ విషయంలో న్యాయ మంత్రి ఏరాసు ప్రతాప్ పేరు వినపడుతుండడంతో అవినీతికి , రాజకీయానికి ఉన్న లంకె చెప్పకనే చెబుతున్నది. వ్యవస్థలను నాశనం చేసే తాము కోట్లు గడించేందుకు ఎంతకైనా దిగజారే ఈ నాయకులను ఉరితీసినా పాపం లేదు. వీరి ఆస్తులను ఉన్న ఫలంగా జప్తుచేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పని చేయడానికి భయపడాల్సిన అవసరం ఉంది. ఇవ్వన్ని చూస్తుంటే పాపం గాలి జనార్థన్ తమ్ముడు మన జగన్ బెయిల్ పై పెట్టుకున్న ఆశలు అడుగంటి పోయినట్టు కనిపిస్తోంది.
కాంగ్రెస్ లో వలసల కార్చిచ్చు
ఏ
మూహుర్తాన రాజశేఖర్ రెడ్డి మృతి చెందారో ఏమో కాని అప్పటినుండి కొత్తగా ఏర్పడిన
కాంగ్రెస్ ప్రభుత్వాలకు జగన్ వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ముఖ్యంగా
ముఖ్య మంత్రులకు రోశయ్య అయితేనేం , కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేం జగన్ దెబ్బకు
విలవిలలాడి పోయారనే చెప్పాలి. ఇప్పుడయితే కాంగ్రెస్ విమర్శల వేడి పెంచింది కాని
మొదట్లో విమర్శించలేరు అలా అని మౌనంగా ఉండలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
అయితే రాను రాను జగన్ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యు
స్వంత కుంపటి పెట్టుకున్నాక సి.బి.ఐ కేసుల వలలో ఇరుక్కుపోయారు. ఇలా జగన్ తన
ఓదార్పు యాత్ర నుండి ఇప్పటి సి.బి.ఐ అరెస్టు వరకు ప్రతి క్షణంలోనూ కాంగ్రెస్ అనే
మహా పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు. రోశయ్య సి.యం అయిన కొత్తలో కొండా సురేఖ
మంత్రిగా ఆయన మంత్రి వర్గంలో మంత్రిగా ఉండేవారు . ఆమె ద్వారా సి.యం. రోశయ్యను
విమర్శలు చేయుస్తూ చివరికి రాజీనామా చేయుంచారు. ఆ తరువాత ఓదార్పు యాత్రలో
పాల్గొననీయకుండా యం.యల్.ఏ లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసినప్పుడు తన వర్గం
వారితో బల ప్రదర్శన చేయించి కాంగ్రెస్ లో కలవరానికి కారణమయ్యారు. చివరికి తనకు
తానుగా పార్టీ ఏర్పాటు చేసుకున్నాక కూడా తన వర్గం వారిని అక్కడే ఉంచి సి.బి.ఐ చార్జీషీటులో వై.యస్.ఆర్ పేరు చేర్చినందుకు
గాను 17 మంది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించి ఉప ఎన్నికలకు
కారణమయ్యారు. ఇప్పుడు సి.బి.ఐ అరెస్టు సందర్భంలోనూ నానీ తదితరులు కాంగ్రెస్ నుండి
వచ్చేలా ప్రణాళిక రూపొందించి కాంగ్రెస్ ను ఇబ్బందులలోకి నెట్టారు. తన పై సెంటిమెంటు రావడం కోసం రకరకాలుగా
ప్రయత్నిస్తున్న జగన్ జైలు నుంచే కాంగ్రెస్ నుండి మరిన్ని వలసలు రావడాన్ని
ప్రోత్సహిస్తున్నట్టు భోగట్టా.
వందల
సంవత్సరాల పార్టీకి ముచ్చేమటలు పోయిస్తున్న జగన్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా
శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నది.
Thursday, 31 May 2012
సానుభూతి ఓట్లు పడుతాయా...........?
అక్రమ
ఆస్తుల సంపాదనపై వై.యస్.ఆర్ . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు పాలు
కావడాన్ని కూడా ఆ పార్టీ తన గెలుపుకు అస్త్రంగా ఉపయోగించుకోవాలని
ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా పార్టీ గౌరవ
అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మీని, చెల్లెలు షర్మిలను ప్రచారానికి పంపడం కూడా
హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదనిపిస్తుంది. ఎందుకంటే గత ఆరు నెలలుగా జగన్
అరెస్టు అవుతాడని అందరూ ఊహించినదే. అయితే
ఎప్పుడు అన్న విషయం మాత్రం అంచనా వేయలేకపోయారు. ముందు ఉపఎన్నికలు పెట్టుకొని
అరెస్టు చేసే ధైర్యం చేయరేమోనని అంతా
అనుకున్నారు. అంతే గాక వై.యస్.ఆర్ పార్టీ వారు ఇచ్చిన స్టేట్
మెంట్లు కూడా భయపెట్టేటట్టు చేసింది. జనంలో తిరుగుబాటు వస్తుందని, జగన్ పై ఒక చేయి
వేస్తే లక్షల చేతులు లేస్తాయని ప్రగల్బాలు పలికారు. తీరా అరెస్టయ్యాక జనంలో
ఆశించినంత మేర స్పందనలేదు. అవినీతిని ప్రోత్సహించకుండా మద్ధతు ఇవ్వకుండా జనం మంచి
పనే చేశారనిపిస్తోంది. చివరికి జగన్ ఇంటిలోని వారే తప్పనిసరి పరిస్థితిలో జనంలో
సెంటిమెంట్ పండించేందుకు ఆయన తల్లి స్వయంగా ధర్నాకు దిగారు. జనంలో స్పందన లేకపోగా
జగన్ చేసిన పనికి వారి ఇంటిలో వారు కూడా వత్తాసు పలుకుతున్నారనే భావన
పెరిగిపోతోంది.
ఇప్పుడు
ప్రచారానికి కూడా తల్లి విజయమ్మ, చెల్లి
షర్మిల దిగారు. జనం బాగానే వచ్చినా అవినీతికి అనుకూలంగా ఓటువేస్తారా లేదా వేచి
చూడాలి. సెంటిమెంట్ ఉండి ఉంటే సామాన్యుడు ఇంత వరకూ వేచి ఉండే వాడు కాదు. మన ఆంధ్ర
ప్రదేశ్ లో 1984 లో యన్.టిఆర్ ను పదవీనుంచి గవర్నరు భర్తరప్ చేసినప్పుడు జనం ఆయనకు
పలికిన మద్ధతు వల్లే నెల తిరగకుండానే తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు. అదే యన్.టి.
రామారావు లక్ష్మీ పార్వతి కారణంగా చంద్రబాబు తిరుగుబాటు చేసి పదవినుంచి తొలగిస్తే
అదే విధంగా పోరాటం చేస్తే జనంలో స్పందన కరువైంది. అదే విధంగా ఇప్పుడు
రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానం జగన్
అరెస్టు వల్ల అవినీతి మచ్చ అంటడంతో తగ్గుముఖం పడుతోంది. ఉప ఎన్నికలలో జగన్ పార్టీకి ముందు ఊహించిన
దానికన్నా సీట్లు తగ్గుతాయని మాత్రం అందరూ అంటున్న మాటే. చూద్దా జనం తీర్పు ఎలా
ఇస్తారో...
Subscribe to:
Posts (Atom)

