రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల భాద్యుడు గులాబ్ నబి ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఇరు ప్రాంతాల నాయకులతో చర్చించిన తరువాత సోనియా గాంధీకి అందించిన నివేదిక ఎటూ తేల్చని ఓ ప్రహసనం అయింది . తెలంగాణా కు అనుకూలమని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని , రాయల తెలంగాణా అని ఏదో ఏదో అనుకుని ఎదురు చూసిన నివేదిక ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదని చెప్పాలి. అయితే ఇదే సమయంలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులూ ముందే ఈ నివేదిక చూసి కూడా ఏమి మాట్లాడక పోవటం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికలో సమస్యను లోతుగా, పత్రి వ్యవహారాలను చర్చిన ఆజాద్ తెలంగాణా రాష్ట్రం ఇవ్వాళా వద్దా అని తేల్చలేకపోయారు. ఏదైనా తేలిచి చెబితే ఎక్కడ శ్రీ కృష్ణ కమిటీ, చిదంబరం పై వచ్చిన విమర్శలకు భయపడి నివేదిక ఆలా వ్రాసి ఉంటారని ఆయన చెప్పతలచిన విషయాని సోనియా చెవిలో ఊది ఉంటారని అంటున్నారు . మరి కాంగ్రెస్ నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి .
Friday, 30 September 2011
అమావాస్య చంద్రుడు ...మన బాబు !!
చంద్ర బాబు నాయుడు అంటే ఒక్కప్పుడు యువకులకు స్ఫూర్తి. శ్రమ గురించి, జన్మ భూమి కి ఏదైనా చేయాలనీ చెప్పిన ఆశయాల గురించి. నీరు మీరు అని ఏమి చెప్పినా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాటించారు . ఐ. టి. విప్లవం మూల పురుషుడుగా, హైదరాబాద్ నగర అభివృధికి , 20 సంవత్సరాల విజన్ రూపశిల్పిగా పేరు గడించారు. అంతాకన్నా మహిళా సంఘాలకు దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను ప్రధమ స్తానంలో నిలుప గలిగారు . రాజకీయ నాయకుడుగా దేశంలోనే ముగ్గురు ప్రధ్రానుల (దేవేగౌడ, వాజిపాయ్, గుజ్రాల్ )నియామకం లోనూ మరియు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక కవడంలోనూ కీలక పాత్ర చంద్ర బాబుదే . అప్పుడు ఆయన ఏది పట్టినా
బంగారమే. మారు మూల పల్లెలోని ఆడపడుచుకు , అమెరిక అద్యక్షుడు క్లింటన్ కు సుపరిచితమైన వాడిగా గుర్తింపు పొందారు. డ్రీం కాబినెట్ కు ఎంపికైన ఏకైక భారతీయుడు . అంతేగాక మన్మోహన్ , పి.వి. నరసిహారావు మొదలు పెట్టిన ఆర్ధిక సంస్కరణలు వేగంగా అందిపుచ్చుకుని మొండిగా ముందుకు దూకుడుగా వెళ్ళిన వాడు . ప్రభుత్వ శాఖలలో నియంత్రణ వుండాలని ప్రజల భాగస్వామ్యం పెంచిన వాడు . అదంతా ఒకప్పటి మాట ..అప్పుడు ఆయన పున్నమి చంద్రుడు . మరి ఇప్పుడు అమావాస్య చంద్రుడు . వరుసాగా రెండు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి , తెలంగాణా సమస్యలో ఇర్రుక్కుపోయి తలపట్టుకొని కూర్చుని వుంది పోతున్నాడు . తనకు ప్రధాన పోటీదారుడు వై. ఎస్. మరణించిన తరువాత కూడా చంద్ర బాబు పరిస్తితి మేరుగుపడినట్టు చెప్పలేకపోట్టున్నారు . చిరంజీవి ప్రజారాజ్యం వల్ల , టి. ఆర్. ఎస్. పొట్టు వల్ల గత ఎన్నికలలో ఓడిపోయినా తెలుగుదేశానికి ఇప్పుడు టి.ఆర్.ఎస్ ప్రధాన శత్రువు. జగన్ కూడా నిన్న మొన్నటి వరకు భయపెట్టినంత పనిచేశాడు. సి.బి.ఐ. కేసుల వల్ల తెలుగు దేశం ఊపిరిపీల్చుకుంది . మరి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చంద్ర బాబు అమావాస్య నుండి తిరిగి పున్నమి చంద్రుడుగా ఉద్బవిస్తారా లేదా అని వేచి చూడాలి.
నేడు సోనియా కు ఆజాద్ నివేదిక
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల భాద్యుడు ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విబజన అంశంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ఈ రోజు సాయంత్రం నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నివేదిక ఇవ్వక మునుపే ఆయన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారితోనూ విడి విడి గా రెండు దపాలు సమావేశమై విపులంగా చర్చించారు. అయితే నివేదిక ప్రస్తుతం ఉదృతంగా వున్నా తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా ఉంటుందా లేక సమైఖ్య ఆంధ్రకే మొగ్గు చూపుతార అన్నది తెలియల్సివుంది. అయితే హైదరాబాద్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆవకాశం ఎక్కువగా వుంది. రెండు రాష్ట్రాలు రెండు రాజధానులు చేస్తూ హైదరాబాద్ మాత్రం కేంద్ర నియంత్రణలోకి తీసుకొనే అవకాసం వుందని అంటున్నారు. ఇదే జరిగితే రెండు పిల్లులు కోట్లడుకుంటే కోతి లాభాపదినట్లు కేంద్ర హైదరాబాద్ వాళ్ళ లాభ పడుతుందని చెబుతున్నారు. ఆజాద్ నివేదిక ఆదరంగానే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలావుంటుందో చెప్పలేము.
Thursday, 29 September 2011
మంత్రి శంకర్ రావు భర్తరప్ !
రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా వుంది సహచర మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసిన చేనేత శాఖా మంత్రి శంకర్ రావు ను పదవి నుండి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదేశించినట్టు తెలిసింది. రేపు ఉదయం లోపు శంకర్ రావు రాజీనామా సమర్పించకపోతే రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా కలసి భర్తరప్ చేయమని కోరనున్నట్టు సమాచారం. శంకర్ రావు చేసిన ఆరోపణలను సుమోట గా తీసుకున్న రాష్ట్ర హైకోర్ట్ సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మార్ , జగన్ అక్రమ కేసుల విచారణలు కూడా శంకర్ రావు హై కోర్ట్ కు వ్రాసిన లేఖల ఆధారంగా చేప్పట్టిన విషయం విదితమే. అందరికి ముచ్చెమటలు పట్టించే శంకర్ రావు ఇక ఏం చేస్తారో చూడాలి మరి .
రాజీనామా చేసిన తెలంగాణా టి.డి.పి ఎం. ఎల్. ఎ లు
తెలంగాణా ఉద్యమం రసకందాయంలో పడింది. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో తెలుగుదేశం పాత్ర లేకుండా జాయింట్ ఆక్షన్ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు . అయితే టి.ఆర్.ఎస్. తెరవెనుక ముఖ్యపాత్ర పోషిస్తోంది . గత16 రోజులుగా సాగుతున్న ఉద్యమంలో నేడు తెలుగు దేశం ఎం. ఎల్. ఎ లు తమ పదవులకు రాజీనామా చేసి టి.ఆర్ .ఎస్ ను, కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగాలని ప్రయత్నిచారు. చిత్తశుద్ది వుంటే అందరూ రాజీనామా చేయాలనీ చెప్పే టి. ఆర్.ఎస్. తెలుగు దేశం ఇచ్చిన షాక్ నుండి తేరుకోక పోగా ఎదురుదారి చేసి రాళ్ళతో దాడి చేయించడం శోచనీయం .
Wednesday, 28 September 2011
రాష్ట్ర విభజనకే కేంద్ర మొగ్గు ..
రాష్ట్ర విభజన సమస్య శాశ్వతంగా పరిష్కారానికి కేంద్రం ముందుకు పోతునట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చేసి తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలుగా విభజించి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని, కొంత కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా వుంచి రెండు ప్రాంతాలకు రెండు రాజధానులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు . తెలంగాణా రాష్ట్రంలోకి రాయలసీమ నుండి అనంతపురం, కర్నూల్ జిల్లాలను కలుపాలని ఆలోచనగా వున్నట్టు కే. సి. ఆర్ కూడా ప్రకటించినారు. అయితే ఇందుకు టి. ఆర్ .ఎస్ ఒప్పుకున్తుందా అన్నది తెలియడం లేదు. హైదరాబాద్ లేకుండా తెలంగాణా రాష్ట్రము తలలేని మోడెం అవుతుందని టి. ఆర్. ఎస్ నాయకులు చాల సందర్భాలలో అన్నారు. అయితే రాయలసీమను రెండు ముక్కలు చేయడం వాళ్ళ
రాయలసీమ పరిస్తితి మరింత దారుణంగా తయారవుతుందని చెప్పవచ్చు. మరో రెండు రోజుల్లో నివేదికను ఇవ్వన్నున ఆజాద్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం కు ఏమి నివేదిక ఇస్స్తారో చూడాలి
మౌనంగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ నేతలు
వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పై సి.బి. ఐ విచారణకు రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ కుట్ర గా విరుచుకు పడిన వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కోకరే మౌనం పాటిస్తున్నారు. అంటే గాక సి.బి. ఐ ఛార్జ్ షీట్ లో వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చడంపై ఏం.ఎల్. ఎ పదవులకు రాజీనామాలు చేసిన వారూ మిన్నకుండి పోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన తరువాత కాంగ్రెస్ నాయకులపై విమర్శలు తగ్గిచిన విషయం గమనించి రాజకీయాలలో ఏదైనా అనుకోని మార్పులు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒక వేల తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే సీమంద్రలో జగన్ అవసరం కాంగ్రెస్ కు ఉందనే అంటున్నారు . ఉభయతారకంగా ప్రస్తుతం సి.బి. ఐ కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వస్స్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా వుండగా వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ నేతలు ఏమిచేయాలో పలు పోక మౌనం ఆశ్రయిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)



