Tuesday 28 July 2015


రాజధాని నిర్మాణం బాబు స్వంత వ్యవహారమా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తరువాత రాజధాని లేకుండా పోయింది. హైదరాబాదు పై సర్వహక్కులు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు వచ్చే తరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయామనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి శాసనసభ ఎన్నికలలో గెలిపించారు. చంద్రబాబుకు వున్న విజన్ దీనికి తోడయ్యంది. రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం. కృష్ణా, గుంటూరు జిల్లాలు కలసి వుండడం, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం కావడంతో పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంతాలు కంచుకోటగా వుండడం కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి. అయితే రాజధానికి అమరావతి పేరు పెట్టడం కూడా అందరూ మెచ్చారు. అయితే రాజధానిభూమి పూజకు అందరినీ కలుపుకుపోలేదనే విమర్శలు వున్నాయి. రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షం నేత జగన్ ను కూడా కలుపుకొని, ప్రతిపక్షాలతో కూడా సలహా కమిటీ ఏర్పాటు చేసి ఇది పార్టీ వ్యవహారం కాదని ప్రజలందరికోసం అందరం కలసి పనిచేస్తున్నామనే భావన కల్పించాలి. సింగపూర్ వారి రాజధాని ప్రణాళిక కూడా అందరూ మెచ్చారు. అయితే ఇంత పెద్ద ఆశలు రేపిన తరువాత రాజధాని నిర్మాణం ఆశల మేరకు పూర్తి అవ్వడం కూడా ముఖ్యమే.

No comments:

Post a Comment