Monday 31 October 2011

జగన్ కు లాభం చేకూర్చే దిశలో టి.ఆర్.ఎస్

 
జగన్ వేసుకున్న ప్లాన్ లో టి.ఆర్.ఎస్. పావుగా ఉపయోగపడుతోందని అంటున్నారు. ముందుగా సమాఖ్య ఆంధ్ర కు మద్దతు తెలిపిన జగన్ ప్రస్తుతం తెలంగాణా పై ఏమి మాట్లాడడం లేదు. మౌనం పాటిస్తున్నారు. జగన్ కాంగ్రెస్ , తెలుగు దేశం పార్టీ లను ఒంటరిగా ఏమిచేయలేక పోయారు. పైగా చంద్ర బాబు , కిరణ్ కుమ్ముక్కు అయ్యారని పలు సందర్భాలాలో అన్నారు. సి.బి. ఐ. కేసుల చిక్కుల్లో వున్నా జగన్ ప్రస్తుతం కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా ఏమి పెద్దగా మాట్లాడడం లేదు. కేసు కూడా నేమ్మదిన్చిందని అంటున్నారు . అయితే జగన్ తాను చేయ వలసిన పనిని తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ప్రణాలికలు రూపొందించి నట్టు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ముందుగా నాగం జనార్ధన్ రెడ్డి బృందం తెలుగు దేశం పార్టీ లో లేవనెత్తిన తిరుగుబాటు . ప్రస్తురం జూపల్లి, రాజయ్య తదితరులు కూడా జగన్ అంధ దండలతోనే టి.ఆర్.ఎస్. తీర్థం పుచ్చుకోన్నారని అంటున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి  కూడా ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు అంటున్నారు. ఎదిఎమైనా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేసిన సత్పలితాలు రాలేదు. టి.ఆర్. ఎస్.  తో పొట్టు పెట్టుకొని వచ్చే ఎన్నికలలో పోటీ కూడా చేయవచ్చని అంటున్నారు. అయితే కాంగ్రెస్ తెలంగాణా పై తీసుకొనే నిర్ణయం పైననే జగన్ నిర్ణయం ఆధార పదివుంటుందని తెలుస్తోంది. తెలంగాణలో జగన్ కు చెప్పుకోదగ్గ స్తాయిలో ప్రజా ప్రతినిధుల మద్దతు లేదు . ఈ కారణంగా ఈ ఎత్తులు వేస్తున్నట్టు అంటున్నారు. టి.ఆర్.ఎస్ కూడా జగన్ తెలంగాణా కు మద్దతు ఇవ్వగలిగితే కలిసి పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తోందని సమాచారం.  కాంగ్రెస్, తెలుగుదేశం లు ఈ విషయంలో జాగ్రతగా లేకపోతె అపాయమే మరి.
--

Wednesday 26 October 2011

చంద్రబాబు పాదయాత్ర




రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితిని చక్కదిద్దడానికి  చంద్రబాబు నాయుడు  శ్రీకారం చుట్టారు. పార్టీ పతిష్టపరచడంలో భాగంగా ఆయన రైతుల కరువు సమస్యలపై పాదయాత్ర చేయనున్నారు. తొలుతగా పార్టీకి పట్టువున్న అనంతపురం జిల్లా నుండి మొదలు పెట్టి రోజుకు 15 కిలోమీటర్లు నడిచే విధంగా ఆతరువాత రోజు మరో జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ప్రణాళిక రూపొందిచారు. తెలంగాణలో చంద్ర బాబు యాత్రలు చేసి ఛాలా కాలం అయ్యింది . తన ఇమేజ్ తో పాటు తెలుగుదేశం పార్టీ కి పూర్వవైభవం తేవాలని సీనియర్ నాయకుల సలహా మేరకు పాదయాత్రకు ప్రణాళిక రూపొందిచినాట్టు చెబుతున్నారు. టి. ఆర్.ఎస్. పై మునుపటి నమ్మకం జనంలో పోలవరం టెండర్ల గొడవ వల్ల తగ్గిందని అంచనా వేస్తున్నారు. మరి పూర్వ వైబవం దక్కుతుందో లేదో కాని టి.ఆర్.ఎస్ తో మాత్రం వీధి పోరాటాలు తప్పేతట్టులేదని పరిశీలకులు అంచనా వేస్తునారు.

Monday 24 October 2011

కిరణ్ కు కలసి వస్తోన్న కాలం ..



ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో నిలదొక్కుకుంటున్నారని చెప్పవచ్చు. రోశయ్య స్థానంలో ఆయన పదవిలోకి వచ్చినప్పుడు అంతగా ఎవరూ ఆయనను ఆ పదవిలో ఆయన కుదురుకుంటాడని చెప్పలేని పరిస్తితి అయితే కాలం ఆయనకు కలసి వస్తోంది. ఒక్కొక్క సమస్య చిక్కు ముడిలా వున్నా ఓపికతో ఆయన ఆ ముడులను విప్పుతూ ఢిల్లీ పెద్దల దృష్టిలో మార్కులు కొట్టేస్తున్నారు. ఆయన సి. ఎం ఐన తరువాత తోలి సమస్య జగన్ మోహన్ రెడ్డి నుండి పోటీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ పార్టీలో చాల బలంగా కనిపించారు తన దయ దాక్ష్యనం వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో ఆధికారంలో వుందని ప్రకటించారు కూడా. కాని కాలం జరిగిన కొలది ఆయన కాంగ్రెస్ నుండి వైదొలగి కొత్త పార్టీ పెట్టారు . కాంగ్రెస్ ఎం. ఎల్ ఎ లను ఎక్కువ మందిని తన వైపు ఆకర్షించి ప్రభుత్వాని కూలగోదతారని భావించారు . అయితే అలా జరుగలేదు సరికాద జగన్ పై హై కోర్ట్ ఆదేశాల మేరకు  సి.బి. ఐ కేసులు నమోదు చేస్తి విచారణ ప్రారంభించింది. ఇప్పుడు జగన్ తనను తానూ కాపాడుకునే పరిస్తిలో వున్నారు.

మంత్రి వర్గ విస్తరణ, శాఖల కేటాయింపులపై ఎన్నడూ లేనంత అసంతృప్తి పెల్లుబికింది. అధిష్టానం అండదండలతో ఆ గండం గట్టేక్కగాలిగారు.

అలాగే తొమ్మిది ఏండ్లు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పని చేసిన చంద్ర బాబు నుండి సమస్యలు ఎదురైనాయి. ఆయన రైతుల కోసం చెప్పటిన నిరాహార దీక్ష సంచలనం అయింది . అయితే ఓపికతో కిరణ్ ఆ సమస్యను ఎదుర్కొని ఎలాంటి ఇబ్బంది పడలేదు. అలాగే తెలుగు దేశం పార్టీ స్పీకర్ ఎన్నికకు పట్టుపడితే తెలివిగా తనకు కావలసిన వ్యక్తిని ఎంపిక చేసుకొని పై చేయి సాధించారు .

ఇకపోతే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా వుండిన చిరంజీవి సహాయం తీసుకొని ప్రభుత్వం నిలబెట్టుకొని ఆయనను , ఆయన పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకున్నారు . చిరంజీవి నుండి ప్రస్తుతం పోటీ లేదు. ఆయనకు ఏ పదవి దక్కలేదు సరి కదా ఆయన కోరుకున్న108  నిర్వహణకు కిరణ్ అంగీకరించలేదు. చిరంజీవి నుండి వచ్చే ఎన్నికల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు.

రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడిగా ఎన్నికైన బొత్స ఆరంబంలో సభలు సమావేశాలు పెట్టి కిరణ్ ను డామినేట్ చేయడానికి ప్రయత్నించారు . అయితే ఆయన వేగానికి తెలంగాణా రూపంలో బ్రేక్ పడింది . ఆయన పాత్ర పార్టీ వరకే పరిమితం అయింది.  అయితే బొత్స ఇంకా పట్టు వదలకుండా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు.

రోశయ్యను ముప్పు తిప్పలు పెట్టిన తెలంగాణా సమస్య కిరణ్ కుమార్ రెడ్డి కి కూడా తల నొప్పులు తీసుకు వచ్చింది . సకల జనుల సమ్మె పేరుతొ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె పాటించారు. సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పతి ఆగిపోయి రాష్టంలో కరెంట్ కస్టాలు మొదలు అయ్యాయి. అలాగే ఆర్.టి. సి. సమ్మె తో ప్రయాణికులు ఇబ్బంది పడ్డాడు . దాదాపు నెలరోజులుగా సాగుతున్న సమ్మె ఒక్కొక్క సమ్మె విరమణ చేయించడంలో సఫలీక్రుతుడైనట్టే . తెలంగాణా వాదులు చేప్పట్టిన రైల్ రోకోను సమర్ధవంతంగా ఎదుర్కొని సమ్మె ఉదృతంగా ఉన్నప్పుడే రాష్ట్ర పరిస్తితులకు, సామాన్యుల కష్టాలకు కే.సి.ఆర్., కోందండరామ్ కారణమని చెప్పా గలిగారు . 

నిన్నటికి నిన్న ఎం. ల్.సి. పోస్ట్ కు డి.ఎస్. ను ఎంపిక చేసి ఢిల్లీ లో తన పలుకుబడి చాటుకున్నారు. బొత్స చేసిన సిపార్సులు బుట్ట దాఖలు అయ్యాయి.  ఏది ఏమైనా కిరణ్ కు కాలం కలసి వచ్చింది.. ఇప్పుడు ఆయన మెల్లగా మంత్రి వర్గం మళ్ళి విస్తరించే అవకాశం వుంది

Wednesday 19 October 2011

చంద్ర బాబు అవినీతి పై విజయమ్మ కోర్టులో కేసు ..





వై. ఎస్. జగన్ పై సి.బి.ఐ. విచారణ ఇంకా పూర్తికాలేదు . ఇప్పటికే కాంగ్రెస్ తో జగన్ మిలాఖత్ అయ్యారని అందుకే ప్రధాన మంత్రిని కలిసిన తరువాత సి.బి. ఐ. కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వై. ఎస్. ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి  భార్య విజయమ్మ చంద్ర బాబు ఆధికారంలో వుండగా అవినీతికి పాల్పడ్డారని హై కోర్ట్ లో పిల్ వేసారు .దాదాపు 2500 పేజీలతో ఓ చిట్టా కూడా అందించారు. రాజకీయాలు అంటే ఏంటో మనకు ఈ పాటికే అర్థం అయివుండాలి. జగన్ పై కేసుల చంద్ర బాబు పై విచారణకు కోర్టు ఆదేశాలు ఇస్తే జగన్ పై పడ్డ మచ్చను జనం మర్చి పోతారని ఎత్తుగడగా ఈ పని చేసారు . వై . ఎస్. రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో కేసులు వేసివిరమించుకున్న విషయం విదితమే. ఇంతకూ చంద్ర బాబు విచారణకు అంగీకరిస్తారా లేకుంటే సుప్రీం కోర్ట్ కు వెళ్లి మళ్ళి స్టే తెచ్చుకుంటారో వేచి చూడాలి.





Tuesday 18 October 2011

నీరు కారిన సకల జనుల సమ్మె

సుదీర్ఘ కాలం కొనసాగిన సకల జనుల సమ్మె సామాన్యులను అష్ట కష్టాలకు గురిచేసింది. ప్రజల వ్యతిరేక పవనాలు చూసి ఒక్కొక్కరుగా సమ్మెను వాయిదాగా ప్రకటించి విరమిస్తున్నారు. తొలుత ఆర్.టి. సి. ఉద్యోగులు , తరువాత టీచర్స్, అనంతరం సింగరేణి కార్మికులు సమ్మె విరమించారు . దీనికి జే. ఏ. సి. కూడా అనుమతి తీసుకొన్నారు . సమ్మె విరమణ కాదని వాయిదా మాత్రమె నని ఎప్పుడు కోరితే అప్పుడు సమ్మె కొనసాగిస్తామని అందరూ ఒకే రకంగా చెప్పారు. అయితే సుదీర్గ కాలం సమ్మె ఉంటుందని సిద్ధం కాలేదని తెలుస్తోంది . 10 -20  రోజులు అయితేనే ప్రభుత్వం దిగివస్తుందని , తప్పకుండ తెలంగాణా అనుకూల ప్రకటన చేస్తుందని అందరూ భావించారు . యింతే వాస్తవానికి ప్రభుత్వం సమ్మె పట్ల కటినంగా వ్యవహరించింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేశారు. అంతే కాకుండా చర్చలకు దాదాపు నెల రోజులైనా పిలువలేదు . సకల జనుల సమ్మె వాళ్ళ రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టమో అంత కన్నా సామాన్యులకు ఛాలా నష్టం జరిగింది. ఇకపై తెలంగాణా ప్రజలు సమ్మె పట్ల జాగ్రతగా ఉండవలసిన అవసరం వుంది.

Monday 17 October 2011

ఇమేజ్ పెంచుకున్న కిరణ్


సకల జనుల సమ్మె తెలంగాణా కు ఏమి పలితం ఇచ్చిందో తెలియదు కాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఇమేజ్ ను పెంచుకున్నారని చెప్పా వచ్చు. స్వంత ప్రతి వారికే కొరుకుడుపడని తత్వం, మాటలో మెత్తంగా ఉంటూ చేత్తల్లో దృడంగా వుండడం అందరూ మెచ్చుకుంటున్నారు. రైల్ రోకోను విజయవంతంగా ఎదుర్కొని స్వంత పార్టీ వారిని కూడా అరెస్ట్ చేయించడం సాధారణ విషయం కాదు. మొత్తం పోలీసు శాఖను తన అదుపులోకి తెచ్చుకొని ఎలాంటి సవాల్లనయిన ఎదుర్కుంటున్నారు . గవర్నర్, ముఖ్యమంత్రి ఒక టీం గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు హై కమాండ్ సలహాలు తీసుకుంటున్నారు . అయితే కాంగ్రెస్ పార్టీ లో ఇంకా కిరణ్ కు పట్టు దొరకలేదనే చెప్పాలి. ఏది ఏమైనా సమ్మె సాగతీత వాళ్ళ జే. ఏ. సి,. కి ఏమి చేయాలో తెలియడం లేదు. సమ్మె కొనసాగిస్తే ప్రజల వ్యతిరేకత వస్తుందేమో నని , సమ్మె కొనసాగించక పొతే ప్రభుత్వం ఇంకా కటిన చర్యలు తీసుకున్తుందేమో నని ఆలోచిస్తున్నారు.  ఆర్.టి. వి. సమ్మె విరమణ వాళ్ళ ఊపిరి తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగులు, సింగరేణి కార్మీకుల నుండి విరమణ కోరుకుంటున్నారు . కాంగ్రెస్ ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ప్రజల దృష్టిలో విల్లన్లుగా మారినట్టే,. తెలుగుదేశం మాత్రం తాము ఉన్నామని రాజీనామాలు చేసారు అయితే వారికి ఎవరి మద్దతు ఉండడంలేదు.
మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డిని పరిస్తితులు బలంగా తయారు చేస్తున్నాయని చెప్పా వచ్చు.

Friday 14 October 2011

రసకందాయం లో రైలురోకో

తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా జే.ఎ. సి. ఆధ్వర్యంలో చేపట్టిన రైలురోకో అటు ప్రభుత్వానికి , ఇటు ఉద్యమ కారులకు ప్రతిష్టగా మారింది. రెండు ప్రక్కల ఊహాత్మక కార్యక్రమం అమలు చేయుటకు పూనుకున్నారు. ఇప్పటికే తెలంగాణా అంతట ముఖ్యమైన ఉద్యమ కార్యకర్తలను పోలీసు లు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పట్టాలపైకి వస్తున్నా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. రైల్వే చట్టాలపై ఇప్పటికే ప్రాచారం కల్పించి ఆ ప్రకారం అరెస్ట్లు చేస్తున్నారు. ప్రత్యెక పోలీసు దళాలను రప్పిస్తున్నారు. హెలి కప్టర్ సహాయంతో రైల్వే ట్రాక్ లపై భద్రత చర్యలు చెప్పుతారు . డి.జి.పి దినేష్ రెడ్డి చెప్పడుతున్న చర్యలపై అప్పుడే టి. ఆర్. ఎస్. ,జే.ఎ. సి. నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య బాధంగా తమ నిరసన తెలుపుతున్నామని , అణిచివేసేందుకు ప్రయత్నించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో రైలు రోకో కు జనం పట్టాలపైకి వస్తున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసులు బుక్ చేస్తున్నారు. రైలు రోకో తో జాతీయ స్థాయిలో తెలంగాణా సమస్యను తెలుపాలనుకున్న జే.ఎ. సి.  ఈ పోరాటాని ప్రతిస్తాగా తెస్తుకొని పనిచేస్తోంది. అయితే సామాన్య పరాజ కష్టాల పట్ల ఎవరు పట్టించుకోవడం లేదు.  

Thursday 13 October 2011

సంపాదన కోల్పోతున్న సామాన్యులు !


తెలంగాణాలో ఉదృతంగా జరుగుతున్నా సకల జనుల సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించి చేస్తున్న సమ్మె వల్ల సామాన్యుల పరిస్తితి అడ కత్తెరలో పోక చెక్కలా తయారయింది . రెక్కాడితే కాని డొక్కాడని బడుగు వర్గాలు ఈ సమ్మె పట్ల తమ ఆర్థిక పరిస్తితి దెబ్బ తిందని , తమను ఆదుకోవాలని అంటున్నారు. బహిరంగంగా మాట్లాడాలని వున్నా వారిని వేధింపుల బయం వెంటాడుతోంది. ఇప్పటికే ఖమ్మం లో సామాన్యస్తితిలో ఆర్.టి. సి. బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణా కావాలనుకునే కోట్లాది మందిలో తాము ఒకరమని  తమ సమ్మె వల్ల రోజూ రాబడి పోతోందని, కుటుంబ పోషణ  మరింత భారమిందని అంటున్నారు .. ఎదిఎమైనా సుధీర్గ సమ్మె వల్ల కేంద్రంలో కదలిక వచ్చింది. అయితే  ఎ నిర్ణయం వెలువడుతుందో తెలియదు .. ఈ సమయంలో సమ్మె విరమిస్తే అసలుకే ఎసరు వస్తుందని కొన్ని రోజులలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోక 
తప్పదని ఉద్యమ నాయకులు అంటున్నారు.  అయితే సమ్మె కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలని అనుకున్నా మాట్లాడలేని స్తితి నెలకొంది .  

ఉద్యమం నెల బాలుడు ...!

తెలంగాణా ఉద్యమం నేటికి నెల రోజులుగా సకల జనుల సమ్మెలో ఉదృతంగా వుంది. అన్ని రంగాల ప్రజలు స్వచండంగా పాల్గొంటున్నారు . ఈ సకల జనుల సమ్మెతో కేంద్రానికి సెగ తగిలింది. ఈ నెల రోజులుగా ఆర్.టి. సి. బస్సులు ఆగిపోయాయి. ఆర్.టి. సి. యూనియన్లో చీలిక వచ్చి కొన్ని ప్రాంతాలలో బస్సులు రోడ్డు పదికి వచ్చిన జే.ఎ. సి కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రైల్ రోకో తోలిదపా విజయవంతంగా జరిగింది. రెండో దపా రైల్ రోకో కు సన్నధం అవుతున్నారు. ఈ నెల రోజులలో తెలంగాణా తెలుగు దేశం శాసన సభ్యులు రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ ఎం.పీ లు ప్రభుతవానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారితో కాంగ్రెస్ హైకమాండ్ పలు దపాలు చర్చించినా తెలంగాణా పై ఇంతవరకు తన నిర్ణయాని తేల్చి చెప్పలేక పోతున్నారు. అయితే ఈ సకల జనుల సమ్మె వాళ్ళ సామాన్య ప్రజలు త్రీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడ తలవంచకుండా కటినంగా వ్యవహరిస్తోంది. అయితే ఎక్కువ కాలం ఉద్యమం కొనసాగితే ఇప్పటికే కరెంట్ కొరత వాళ్ళ రైతులు నష్ట పోతున్నారు . విద్యార్తులు చదువులు కోల్పోతున్నారు. కేంద్రం వెంటనే ఏదో ఒకటి తేల్చి చెప్పి సమస్యను పరిస్కరించావలసి వుంది. 

కె.సి.ఆర్ కు మందకృష్ణ వార్నింగ్

 సకల జనుల సమ్మెలో తెలంగాణా కు వ్యతిరేకంగా వున్నా కాంగ్రెస్ వారిపై కె. సి. ఆర్ . అనుచితంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.  కాంగ్రెస్ నాయకులు బూట్ పోలిష్ గాళ్ళు అన్న కె.సి.ఆర్ మాటలు దుమారం లేపుతున్నాయి. కె.సి.ఆర్ లోని దొర పెత్తనానికి ఇదో ఉదాహరణ అని మాదిగల కుల వృతిని అవమానిచేట్టట్టుగా వుందని ఆయన శరీరానికి చెప్పులతోనే పోలిష్ వేస్తామని మాదిగా దండోరా రాష్ట్ర అద్యక్షుడు మంద కృష్ణ మాదిగా హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్ర సాధనకు కె.సి.ఆర్ కు చిత్తశుద్ధి లేదని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తోలి ముఖ్యమంత్రి దళితుడే అంటున్న కె. సి. ఆర్. తన పార్టీ అధ్యక్షుడుగా 10 జిల్లాలలో ఒక జిల్లాలో కూడా నియమించలేదని, 




బహిరంగా సభలలో దళితులను కనీసం తన ప్రకన్న కూర్చోబెట్టుకోరని మంద కృష్ణ అన్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచి పిల్లల చదువులు కాపాడాలని లేకుంటే తమ మాదిగా దండోరా తరపున వేలమంది నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. 

Wednesday 12 October 2011

తెలంగాణలో పిల్లల చదువుల పట్ల ఆందోళన


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేప్పట్టిన సకల జనుల సమ్మె జనుల పాలిత శాపం గా మారుతోంది. ముఖ్యంగా విద్యార్థుల చదువులకు ఆటకం కలుగుతోందని తల్లితండ్రులు వాపోతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి విద్య సంవత్సరం నష్టం జరుగుతుందని బయపడుతున్నారు. సమ్మె నుండి ఆర్.టి. సి , విద్య సంస్తలకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు .
ఇప్పటికే చాల మంది తమ పిల్లలను విజయవాడలో చేర్చినట్టు తెలుస్తోంది .  ఖమ్మంలో అయితే మన్యం రాష్ట్ర సాధన సమితి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె ఆపాలని భారీగా ర్యాలి నిర్వహించారు.

తెలంగాణా సమస్యతో కోర్ కమిటి తికమక


తెలంగాణా రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం చేయాలని ప్రయత్నిస్తున్న కోర్ కమిటికి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోవడంలేదు . కాంగ్రెస్ ముఖ్య నాయకులతో  సంప్రదింపులు పూర్తి చేసిన తరువాత సమస్య పరిష్కారం అంత సులభం కాదని కోర్ కమిటి తలపట్టుకోవలసి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మూడు ప్రాంతాల ప్రజల మనోబావాలను గుర్తెరిగి, హైదరాబాద్ లో బలంగా వున్న ఎం.ఐ .ఎం (ముస్లిం ) వారి అభిప్రాయాన్ని తీసుకొని , సమస్యను జాతీయ స్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గం చూపవలసిన అవసరం వుంది . అయితే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులే పైకి భయపడి తెలంగాణా అంటున్నా, తెలంగాణా ఇస్తే టీ . ఆర్ .ఎస్ ను అడ్డుకోలేమని , వారు బి.జే.పి లో కలిసే అవకాశముందని అంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే టీ . ఆర్ .ఎస్ వీలీన ప్రతిపాదన ముందుకు వచ్చింది . అయితే ఈ సమయంలో పార్టీని వీలీనం చేస్తే దెబ్బ తినే అవకాసం వుందని టీ . ఆర్ .ఎస్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మమతా బెనర్జీ కూడా అడ్డుపుల్ల వేసిందని , ఒక వేల తెలంగాణా ఇస్తే పచ్చిమ బెంగాల్లో ప్రత్రేక రాష్ట్ర ఉద్యమం మళ్ళీ రాజుకుంటుందని ఆమె భయం. కేంద్ర ప్రభుత్వ మనుగడకు ఆమె సహాయం తప్పనిసరి . ఇన్నింటి నడుమ కేంద్ర కోర్ కమిటి నిర్ణయం తీసుకోలేక తిక మక పడుతోంది. తెలంగాణా రాష్ట్రము ఇస్తామంటే ఇప్పుడు తెలంగాణలో వున్న పరిస్తితే సీమాంద్రలో వస్తుందని అంచనా వేస్తోంది. తెలంగాణా సమస్య వెంటనే తీరేది కాదని అర్ధం అవుతోంది . హడావుడి నిర్ణయాల వాళ్ళ రాష్ట్రం ఇప్పటికే రావణ కాష్టం అయింది . సమ్మె విరమించి శాంతియుత బాటలో నిరసనలు చేయవలసిన అవసరం ఏర్పడింది . లేదంటే ఉద్యమం పట్ల తెలంగాణా లో వున్న సానుభూతి  వ్యతిరేకంగా మారే ప్రమాదం వుందని అంటున్నారు .





Friday 7 October 2011

నేడో రేపో తెలంగాణా పై స్పష్టమైన ప్రకటన ?


రాష్ట్రంలో సకల జనుల సమ్మెతో స్తంబించిన పాలనతో కేంద్రం ఆలోచనలో పడింది. తెలంగాణా పై ఇంతవరకు తేల్చని కేంద్రం నేడో రేపో ఓ స్పష్టమైన ప్రకటన చెయ్యొచ్చని తెలుస్తోంది. ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించడానికి ఢిల్లీ కి సి. ఏం. కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, పి.సి.సి. చీఫ్ బొత్స ఇప్పటికే పిలిపించారు. శుక్రవారం ప్రణబ్ తో 20 నిమిషాలపాటు సోనియా తెలంగాణా విషయం చర్చినట్టు ఆ తరువాత మినీ కోర్ టీం 40 నిమిషాలపాటు తెలంగాణా సమస్యపై చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా కు అనుకూలంగా ప్రకటన వెలువడితే సీమంద్రలో పెల్లుబికే నిరసనలు ఎలా అదుపు చేయాలో ఆలోచిస్తున్నారు. ఒక వేల తెలంగాణాకు వ్యతిరేకంగా ప్రకటిస్తే ఇప్పటికే సమ్మె లతో అట్టుడుకుతున్న తెలంగాణా మరింత ఆందోళనలకు గురవుతుంది. ఏది ఏమైనా రెండు ప్రాంతాలు ఆమోదించే నిర్ణయం రావాలని ఆశిద్దాం .

Wednesday 5 October 2011

తెలంగాణాకు ఎం.ఐ. ఎం. మోకాలడ్డు !


హైదరబాద్ పాతబస్తీలో బలమైన రాజకీయ పార్టీగా వున్నా ఎం.ఐ. ఎం. తెలంగాణాకు మోకలడ్డుతోంది. తమ పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం నిర్ణయాలపై ఆధారపడమని, తము ప్రస్తుతం రాష్ట్రం వున్నా స్తితినే కోరుకుంటున్నామని , ఒక వేల తప్పనిసరి పరిస్తితులలో తెలంగాణా ఇవ్వదలిస్తే రాయలసీమ తెలంగాణలో కలుపాలని, హైదరాబాద్ రాజధానిగా వుండాలని కోరుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒవైసీ తెలిపారు. ఈ విషయం ఇదివరకే శ్రీకృష్ణ కమిటీ కు నివేదించామని అన్నారు. దీన్ని బట్టి చూస్తీ ఆ పార్టీ సమఖ్యంద్ర కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు . దీంతో తెలంగాణా సమస్య పరిష్కారం మరింత గందరగోళంలో పడినట్టేనని అంటున్నారు .

కష్టాల్ల సుడిగుండంలో రాష్ట్ర ప్రగతి


ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంటేనే దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు, అభివృధికి నమూనాగా చెప్పుకునే వారు .. ఇక్కడా అమలయిన పథకాలు, పలితాల బట్టి ఆయా రాష్ట్రాలలో అమలు చేసే వారు . ఇప్పుడు పూర్తిగా తిరోగమనం వైపు నడుస్తోంది. బలమైన నాయకత్వలేమి, తెలంగాణా సమస్య, కేంద్రంలో రాష్ట్ర ప్రగతి పట్ల చిత్తసుద్ధిలేని ప్రభుత్వరం వెరసి రాష్ట్రంలో గందరగోళ పరిస్తితులు నెలకొని వున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ అవకాశవాద రాజకీయాలతో కాలం గడుపుతున్నాయి. టి.ఆర్.ఎస్ వైఖరిని తాపు పట్టలేము ఎందుకంటే ఆపార్టీ పుట్టిందే తెలంగాణా రాష్ట్ర సాధనకోసం. మిగిలిన పార్టీలు ఎందుకు టి.ఆర్. ఎస్ వెనుక , జాయింట్ ఆక్షన్ కమిటీ వెనుకు నడుస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తామూ పోరాదామని చెప్పుకోవడానికే అనిపిస్తుంది. ఒక సి.పి.ఏం . మినహాహిస్తే అన్నీ ప్రాంతాల కనుగుణంగా ఊహత్మకంగా నడుస్తున్నాయి. చిదంబరం డిసెంబర్  9 ప్రకటన  తొందరపాటు చర్య. సోనియా బర్త్ డే కానుకగా తెలంగాణా ఇద్దామనుకుని భంగపడ్డారు. పోనీ
 ఆ అభిప్రాయానికి నిలబడకుండా మళ్ళీ అభిప్రాయాన్ని మార్చుకొని చర్చలు అంటున్నారు. ఈ రెండు ఏళ్ళు రాష్ట్రంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, రెండుప్రాంతాల వారి మధ్య చిచుకు కారణం రాజకీయ పార్టీలే . సకజ జనుల సమ్మె వాళ్ళ రాష్ట్రం మరింత కష్టాల్లో వుంది. పండుగ లేదు. ప్రయాణం లేదు. సామన్యుని నోటికాడ కూడు తీసేస్తున్నారు. వెంటనే పరభుత్వం స్పందించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలి. జరిగిన నష్టం పూడ్చుకోవడానికి ప్రపంచ బ్యాంకు నుండి మరో 2000 కోట్లు అప్పు తెస్తున్నారు. రాష్ట్రం ప్రగతి గాడిలో పాడాలని ,ఈ దసరా అందరికి మంచి గుణాన్ని ఇవ్వాలని కోరుకుందాం.

Tuesday 4 October 2011

కాంగ్రెస్ లో టి. ఆర్ . ఎస్ విలీనం !




కాంగ్రెస్ పార్టీ లో టి. ఆర్. ఎస్ వీలీనం ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వచ్చింది . న్యూ ఢిల్లీ లో మకాం వేసి వున్నా టి. ఆర్.ఎస్ ఆధినేత కే. సి. ఆర్ తో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. ఒక వేల తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అక్కడ కాంగ్రెస్ మనుగడ ప్రస్నార్థకం అవుతుంది. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన టి. ఆర్.ఎస్ ను వీలీనం చేసుకుంటే తెలంగాణా ఏర్పడినా కాంగ్రెస్ ఎలాంటి డోఖా ఉండదని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తె తెలుగుదేశం ఆరోపిచినట్టు టి. ఆర్. ఎస్ ఇంతకాలం తెలుగుదేశం పై ఉద్దేస పూర్వకంగానే దాడి చేస్తునట్టు అర్ధమవుతోంది. పాదరసం లా ఎప్పటికికప్పుడు మారిపోతుందే కే.సి. ఆర్ ను నమ్మడం అంటే కాంగ్రెస్ పూర్తిగా నట్టేట్లో మునిగినట్టీ అంటున్నారు. ఎలాగో ఒక లాగా తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే తమ ఉనికి పోకూడదని కాంగ్రెస్ తెలంగాణా నాయకులు మల్ల గుల్లలు పడుతున్నారు .

Sunday 2 October 2011

క్రొత్త పథకాల పిచ్చిలో కిరణ్ !



ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం క్రొత్త పథకాల పిచ్చిలో వున్న్తట్టు వున్నారు . దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ని మరిపించాలని, పరిపాలనలో తనదైన ముద్ర వేయాలని తహ తహలాడుతున్నట్టు కనబడుతోంది. అనుచరుల అండ లేకుండా కేవలం ఆదిస్థానం అండ దండలతో ముఖ్యమంత్రి పదవి అనుకోకుండా వరించింది.  పార్టీలూ కూడా సరైన విధంగా సహకారం లేదు. అది కాకుండా ఒక ప్రక్క బొత్స , రెండో ప్రక్క చిరు పక్కలో బల్లెలా వున్నారు . ప్రస్తుతం రాష్ట్రా రాజకీయాలలో శూన్య యుగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా సమస్యతో నిర్వీర్యం అయిపోతోంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా తెలియడం లేదు. ఈ విషయాన్ని పక్క దారి పట్టించి తనకు పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చే విధంగా పతకాలు రూపొందించి వాటిని శరంపరలుగా జనంలోకి వదులుతున్నారు . మహిళలను దృష్టిలో పెట్టుకొని మొన్న స్త్రీ శక్తి పేరిట రాష్ట్ర స్తాయి బ్యాంకు కు
శ్రీ కారం చుట్టారు . యువజనులను దృష్టిలో పెట్టుకొని 15  లక్షల ఉద్యోగాలు ఇంస్తున్నట్టు అందులో డిసెంబర్ లోనే ఒకే రోజు ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తునట్టు ప్రకటించారు కూడా. అంతలోనే కిలో రూపాయి బియ్యం ప్రకటించి గాంధీ జయంతి సందర్బంగా సంతకాలు చేసి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్సారు . ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణా పథకాని ప్రకటించారు . ఇన్ని పతకాలు ప్రకటిస్తూ వుంటే కాంగ్రెస్ పార్టీ వారీ నోర్లు వేల్లబెడుతున్నారు . సాటి మంత్రుల కూ పరకించిన అనంతరమే తెలుస్తోంది . మరి ఈ పతకాలు కిరణ్ కుమార్ ఆశిస్తున్నాటు మంచి పలితాలు ఇస్తాయా లేక మరిన్ని సమస్యలు తీసుకు వస్తాయా వేచి చూడాలి .