Tuesday 18 October 2011

నీరు కారిన సకల జనుల సమ్మె

సుదీర్ఘ కాలం కొనసాగిన సకల జనుల సమ్మె సామాన్యులను అష్ట కష్టాలకు గురిచేసింది. ప్రజల వ్యతిరేక పవనాలు చూసి ఒక్కొక్కరుగా సమ్మెను వాయిదాగా ప్రకటించి విరమిస్తున్నారు. తొలుత ఆర్.టి. సి. ఉద్యోగులు , తరువాత టీచర్స్, అనంతరం సింగరేణి కార్మికులు సమ్మె విరమించారు . దీనికి జే. ఏ. సి. కూడా అనుమతి తీసుకొన్నారు . సమ్మె విరమణ కాదని వాయిదా మాత్రమె నని ఎప్పుడు కోరితే అప్పుడు సమ్మె కొనసాగిస్తామని అందరూ ఒకే రకంగా చెప్పారు. అయితే సుదీర్గ కాలం సమ్మె ఉంటుందని సిద్ధం కాలేదని తెలుస్తోంది . 10 -20  రోజులు అయితేనే ప్రభుత్వం దిగివస్తుందని , తప్పకుండ తెలంగాణా అనుకూల ప్రకటన చేస్తుందని అందరూ భావించారు . యింతే వాస్తవానికి ప్రభుత్వం సమ్మె పట్ల కటినంగా వ్యవహరించింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేశారు. అంతే కాకుండా చర్చలకు దాదాపు నెల రోజులైనా పిలువలేదు . సకల జనుల సమ్మె వాళ్ళ రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టమో అంత కన్నా సామాన్యులకు ఛాలా నష్టం జరిగింది. ఇకపై తెలంగాణా ప్రజలు సమ్మె పట్ల జాగ్రతగా ఉండవలసిన అవసరం వుంది.

2 comments:

  1. ఈ సారి సమ్మె మాట ఎత్తితే జనం చెప్పులతో కొడతారు.

    ReplyDelete
  2. మీకో విషయం తెలిసినట్టు లేదు. ఆదిలాబాద్ జిల్లాలో సమ్మె విరమించినందుకు టీచర్లని గదిలో పెట్టి తాళం వేశారు.

    ReplyDelete