Wednesday 12 October 2011

తెలంగాణా సమస్యతో కోర్ కమిటి తికమక


తెలంగాణా రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం చేయాలని ప్రయత్నిస్తున్న కోర్ కమిటికి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోవడంలేదు . కాంగ్రెస్ ముఖ్య నాయకులతో  సంప్రదింపులు పూర్తి చేసిన తరువాత సమస్య పరిష్కారం అంత సులభం కాదని కోర్ కమిటి తలపట్టుకోవలసి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మూడు ప్రాంతాల ప్రజల మనోబావాలను గుర్తెరిగి, హైదరాబాద్ లో బలంగా వున్న ఎం.ఐ .ఎం (ముస్లిం ) వారి అభిప్రాయాన్ని తీసుకొని , సమస్యను జాతీయ స్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గం చూపవలసిన అవసరం వుంది . అయితే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులే పైకి భయపడి తెలంగాణా అంటున్నా, తెలంగాణా ఇస్తే టీ . ఆర్ .ఎస్ ను అడ్డుకోలేమని , వారు బి.జే.పి లో కలిసే అవకాశముందని అంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే టీ . ఆర్ .ఎస్ వీలీన ప్రతిపాదన ముందుకు వచ్చింది . అయితే ఈ సమయంలో పార్టీని వీలీనం చేస్తే దెబ్బ తినే అవకాసం వుందని టీ . ఆర్ .ఎస్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మమతా బెనర్జీ కూడా అడ్డుపుల్ల వేసిందని , ఒక వేల తెలంగాణా ఇస్తే పచ్చిమ బెంగాల్లో ప్రత్రేక రాష్ట్ర ఉద్యమం మళ్ళీ రాజుకుంటుందని ఆమె భయం. కేంద్ర ప్రభుత్వ మనుగడకు ఆమె సహాయం తప్పనిసరి . ఇన్నింటి నడుమ కేంద్ర కోర్ కమిటి నిర్ణయం తీసుకోలేక తిక మక పడుతోంది. తెలంగాణా రాష్ట్రము ఇస్తామంటే ఇప్పుడు తెలంగాణలో వున్న పరిస్తితే సీమాంద్రలో వస్తుందని అంచనా వేస్తోంది. తెలంగాణా సమస్య వెంటనే తీరేది కాదని అర్ధం అవుతోంది . హడావుడి నిర్ణయాల వాళ్ళ రాష్ట్రం ఇప్పటికే రావణ కాష్టం అయింది . సమ్మె విరమించి శాంతియుత బాటలో నిరసనలు చేయవలసిన అవసరం ఏర్పడింది . లేదంటే ఉద్యమం పట్ల తెలంగాణా లో వున్న సానుభూతి  వ్యతిరేకంగా మారే ప్రమాదం వుందని అంటున్నారు .





No comments:

Post a Comment