Friday 30 September 2011

సోనియా చెవిలో ఆజాద్ చెప్పినదేమి ?


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల భాద్యుడు గులాబ్ నబి ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఇరు ప్రాంతాల నాయకులతో చర్చించిన తరువాత సోనియా గాంధీకి అందించిన నివేదిక ఎటూ తేల్చని ఓ ప్రహసనం అయింది . తెలంగాణా కు అనుకూలమని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని , రాయల తెలంగాణా అని ఏదో ఏదో అనుకుని ఎదురు చూసిన నివేదిక ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదని చెప్పాలి. అయితే ఇదే సమయంలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులూ ముందే ఈ నివేదిక చూసి కూడా ఏమి మాట్లాడక పోవటం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికలో సమస్యను లోతుగా, పత్రి వ్యవహారాలను చర్చిన ఆజాద్ తెలంగాణా రాష్ట్రం ఇవ్వాళా వద్దా అని తేల్చలేకపోయారు. ఏదైనా తేలిచి చెబితే ఎక్కడ శ్రీ కృష్ణ కమిటీ, చిదంబరం పై వచ్చిన విమర్శలకు భయపడి నివేదిక ఆలా వ్రాసి ఉంటారని ఆయన చెప్పతలచిన విషయాని సోనియా చెవిలో ఊది ఉంటారని అంటున్నారు . మరి కాంగ్రెస్ నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి .

అమావాస్య చంద్రుడు ...మన బాబు !!


చంద్ర బాబు నాయుడు అంటే ఒక్కప్పుడు యువకులకు స్ఫూర్తి. శ్రమ గురించి, జన్మ భూమి కి ఏదైనా చేయాలనీ చెప్పిన ఆశయాల గురించి. నీరు మీరు అని ఏమి చెప్పినా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాటించారు . ఐ. టి. విప్లవం మూల పురుషుడుగా, హైదరాబాద్ నగర అభివృధికి , 20 సంవత్సరాల విజన్ రూపశిల్పిగా పేరు గడించారు. అంతాకన్నా మహిళా సంఘాలకు దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను ప్రధమ స్తానంలో నిలుప గలిగారు . రాజకీయ నాయకుడుగా దేశంలోనే ముగ్గురు ప్రధ్రానుల (దేవేగౌడ, వాజిపాయ్, గుజ్రాల్ )నియామకం లోనూ మరియు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక కవడంలోనూ కీలక పాత్ర చంద్ర బాబుదే . అప్పుడు ఆయన ఏది పట్టినా
 బంగారమే. మారు మూల పల్లెలోని ఆడపడుచుకు , అమెరిక అద్యక్షుడు క్లింటన్ కు సుపరిచితమైన వాడిగా గుర్తింపు పొందారు. డ్రీం కాబినెట్ కు ఎంపికైన ఏకైక  భారతీయుడు . అంతేగాక మన్మోహన్ , పి.వి. నరసిహారావు మొదలు పెట్టిన ఆర్ధిక సంస్కరణలు వేగంగా అందిపుచ్చుకుని మొండిగా ముందుకు దూకుడుగా  వెళ్ళిన వాడు . ప్రభుత్వ శాఖలలో నియంత్రణ వుండాలని ప్రజల భాగస్వామ్యం  పెంచిన వాడు . అదంతా ఒకప్పటి మాట ..అప్పుడు ఆయన పున్నమి చంద్రుడు . మరి ఇప్పుడు అమావాస్య చంద్రుడు .  వరుసాగా రెండు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి , తెలంగాణా సమస్యలో ఇర్రుక్కుపోయి తలపట్టుకొని కూర్చుని వుంది పోతున్నాడు . తనకు ప్రధాన పోటీదారుడు వై. ఎస్. మరణించిన తరువాత కూడా చంద్ర బాబు పరిస్తితి మేరుగుపడినట్టు చెప్పలేకపోట్టున్నారు . చిరంజీవి ప్రజారాజ్యం వల్ల , టి. ఆర్. ఎస్. పొట్టు వల్ల గత ఎన్నికలలో ఓడిపోయినా తెలుగుదేశానికి ఇప్పుడు టి.ఆర్.ఎస్ ప్రధాన శత్రువు. జగన్ కూడా నిన్న మొన్నటి వరకు భయపెట్టినంత పనిచేశాడు. సి.బి.ఐ. కేసుల వల్ల తెలుగు దేశం ఊపిరిపీల్చుకుంది . మరి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చంద్ర బాబు అమావాస్య నుండి తిరిగి పున్నమి చంద్రుడుగా ఉద్బవిస్తారా లేదా అని వేచి చూడాలి.




నేడు సోనియా కు ఆజాద్ నివేదిక

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల భాద్యుడు ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విబజన అంశంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ఈ రోజు సాయంత్రం నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నివేదిక ఇవ్వక మునుపే ఆయన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారితోనూ విడి విడి గా రెండు దపాలు సమావేశమై విపులంగా చర్చించారు. అయితే నివేదిక ప్రస్తుతం ఉదృతంగా వున్నా తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా ఉంటుందా లేక సమైఖ్య ఆంధ్రకే మొగ్గు చూపుతార అన్నది తెలియల్సివుంది. అయితే హైదరాబాద్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆవకాశం ఎక్కువగా వుంది. రెండు రాష్ట్రాలు రెండు రాజధానులు చేస్తూ హైదరాబాద్ మాత్రం కేంద్ర నియంత్రణలోకి తీసుకొనే అవకాసం వుందని అంటున్నారు. ఇదే జరిగితే రెండు పిల్లులు కోట్లడుకుంటే కోతి లాభాపదినట్లు కేంద్ర హైదరాబాద్ వాళ్ళ లాభ పడుతుందని చెబుతున్నారు. ఆజాద్ నివేదిక ఆదరంగానే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలావుంటుందో చెప్పలేము.

Thursday 29 September 2011

మంత్రి శంకర్ రావు భర్తరప్ !


రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా వుంది సహచర మంత్రులపై  అవినీతి ఆరోపణలు చేసిన చేనేత శాఖా మంత్రి శంకర్ రావు ను పదవి నుండి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదేశించినట్టు తెలిసింది. రేపు ఉదయం లోపు శంకర్ రావు రాజీనామా సమర్పించకపోతే రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా కలసి భర్తరప్ చేయమని కోరనున్నట్టు సమాచారం. శంకర్ రావు చేసిన ఆరోపణలను సుమోట గా తీసుకున్న రాష్ట్ర హైకోర్ట్ సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మార్ , జగన్ అక్రమ కేసుల విచారణలు కూడా శంకర్ రావు హై కోర్ట్ కు వ్రాసిన లేఖల ఆధారంగా చేప్పట్టిన విషయం విదితమే. అందరికి ముచ్చెమటలు పట్టించే శంకర్ రావు ఇక ఏం చేస్తారో చూడాలి మరి .


రాజీనామా చేసిన తెలంగాణా టి.డి.పి ఎం. ఎల్. ఎ లు


తెలంగాణా ఉద్యమం రసకందాయంలో పడింది. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో తెలుగుదేశం పాత్ర లేకుండా జాయింట్ ఆక్షన్ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు . అయితే టి.ఆర్.ఎస్. తెరవెనుక ముఖ్యపాత్ర పోషిస్తోంది . గత16  రోజులుగా సాగుతున్న ఉద్యమంలో నేడు తెలుగు దేశం ఎం. ఎల్. ఎ లు తమ పదవులకు రాజీనామా చేసి టి.ఆర్ .ఎస్ ను, కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగాలని ప్రయత్నిచారు. చిత్తశుద్ది వుంటే అందరూ రాజీనామా చేయాలనీ చెప్పే టి. ఆర్.ఎస్. తెలుగు దేశం ఇచ్చిన షాక్ నుండి తేరుకోక పోగా ఎదురుదారి చేసి రాళ్ళతో దాడి చేయించడం శోచనీయం .

Wednesday 28 September 2011

రాష్ట్ర విభజనకే కేంద్ర మొగ్గు ..


రాష్ట్ర విభజన సమస్య శాశ్వతంగా పరిష్కారానికి కేంద్రం ముందుకు పోతునట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చేసి తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలుగా విభజించి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని, కొంత కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా వుంచి రెండు ప్రాంతాలకు రెండు రాజధానులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు . తెలంగాణా రాష్ట్రంలోకి రాయలసీమ నుండి అనంతపురం, కర్నూల్ జిల్లాలను కలుపాలని ఆలోచనగా వున్నట్టు కే. సి. ఆర్ కూడా ప్రకటించినారు. అయితే ఇందుకు టి. ఆర్ .ఎస్ ఒప్పుకున్తుందా అన్నది తెలియడం లేదు. హైదరాబాద్ లేకుండా తెలంగాణా రాష్ట్రము తలలేని మోడెం అవుతుందని టి. ఆర్. ఎస్ నాయకులు చాల సందర్భాలలో అన్నారు. అయితే రాయలసీమను రెండు ముక్కలు చేయడం వాళ్ళ
రాయలసీమ పరిస్తితి మరింత దారుణంగా తయారవుతుందని చెప్పవచ్చు.  మరో రెండు రోజుల్లో నివేదికను ఇవ్వన్నున ఆజాద్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం కు ఏమి నివేదిక ఇస్స్తారో చూడాలి

మౌనంగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ నేతలు

వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పై సి.బి. ఐ విచారణకు రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ కుట్ర గా విరుచుకు పడిన వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కోకరే మౌనం పాటిస్తున్నారు. అంటే గాక సి.బి. ఐ ఛార్జ్  షీట్ లో వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చడంపై ఏం.ఎల్. ఎ పదవులకు రాజీనామాలు చేసిన వారూ మిన్నకుండి పోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన తరువాత కాంగ్రెస్ నాయకులపై విమర్శలు తగ్గిచిన విషయం గమనించి రాజకీయాలలో ఏదైనా అనుకోని మార్పులు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒక వేల తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే సీమంద్రలో జగన్ అవసరం కాంగ్రెస్ కు ఉందనే అంటున్నారు . ఉభయతారకంగా ప్రస్తుతం సి.బి. ఐ కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వస్స్తున్న విషయం తెలిసిందే.  ఇది ఇలా వుండగా వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ నేతలు ఏమిచేయాలో పలు పోక మౌనం ఆశ్రయిస్తున్నారు.

Tuesday 27 September 2011

సుమోటగా సబితా పై హైకోర్ట్ విచారణ ...

 

రాష్ట్ర మంత్రుల
మధ్య పోరు





రాష్ట్ర చరిత్రలోనే ప్రధమంగా ఓ హోం మంత్రిపై హైకోర్ట్ సుమోటాగా స్వీకరించి  సి.బి.ఐ. విచారణ కు ఆదేశాలు ఇచ్చింది .సబితా ఇంద్ర రెడ్డి , రాష్ట్ర మంత్రి మోపిదేవి పై  రాష్ట్ర జౌళి శాఖ మంత్రి శంకర్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు . హోం మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని , ఆమె కుమారుడు ఏకంగా దుకాణం పెట్టాడని ఆరోపించారు. పోలీసు నియామకాలపై కూడా అవినీతి వున్నట్టు ఆరోపణలు చేశారు . ఈ ఆరోపణలు సుమోట గా కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయాలని మంగళవారం  హైకోర్ట్ ఆదేశించింది.

రాష్ట్ర మంత్రులపై అదే రాష్ట్ర ప్రభుత్వంలో వున్నా మరో మంత్రి ఆరోపణలు చేయడం దానిపై హైకోర్ట్ స్పందించడం విశేషం. శంకర్ రావు ఇంతకు మునుపు జగన్ పై హైకోర్ట్ కు లెటర్ వ్రాస్తే దాని ఆధారంగానే హైకోర్ట్ సి.బి.ఐ   వి చారణకు ఆదేశించడం తెలిసిందే . శంకర రావు అంటేనే రాజకీయ నాయకులు భయపడుతున్నారు . ఆయన ఏకంగా సి. ఎం. పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా వుండగా గతంలో అనంతపురం సూరి హత్యకేసులో నిన్డుతుడైన భానుకు సభిత పిల్లలే ఆశ్రయం ఇచ్చరాని కూడా వార్తలు వచ్చాయి . మొత్తానికి సబితా పిల్లల వల్ల కేసులో ఇరుక్కున మాట నిజమేనంటున్నారు .

 

Monday 26 September 2011

అందరికి చెబుతాడు తాను చేయడు ...

రాజీనామా పై కోందండరామ్ ద్వందనీతి

తెలంగాణా పొలిటికల్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ తెలంగాణా ఉద్యమ నాయకుడుగా తెరపైకి వచ్చి కేవలం టి. ఆర్ .ఎస్. అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు . ఏం. ఎల్. ఏలు , ఏం.పి లు , మంత్రులు తెలంగాణా కోసం రాజీనామా చేయమన్న కోందండ రామ్ తానూ మాత్రం ఇంకా ప్రొఫెసర్ గా ఉద్యోగంలో కొనసాగుతుండడం విశేషం . దేశ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపడం చూస్తే నైతికత లేదనిపిస్తోంది . ప్రభుత్వం కూడా ఏమి చేయలేక చూస్తూ వుంది. ఇప్పటికైనా కోదండ రామ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకొని తెలంగాణా కోసం పని చేయాలనీ రాజకీర వర్గాలు అంటున్నాయి.

తెలంగాణా ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏమిటి ?

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం చిత్తశుద్ధిగా ఎవ్వరూ ప్రయత్నం చెయ్యట్లేదు . దా దాపు అన్ని పార్టీలు అఖిలపక్షంలో అనుకూలంగానే మాట్లాడాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చిదంబరం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించగా రాజకీయ పార్టీల అసలు రంగు బయటపడింది. అప్పటికప్పుడు సీమాంద్ర లో పెల్లుబికిన సమైకాంధ్ర ఉద్యమం ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ జరుగలేదు. తెలంగాణా పై శ్రీ కృష్ణ కమిటీని వేసి ఆ నిరసనకు తెరదించిన వెంటనే తెలంగాణలో కూడా నిరసనలు వెలువెత్తాయి.
బి .జే. పి కేంద్రలో అధికారంలో వుండగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానాల ప్రకారం విభజన జరిగిపోయింది. అయితే ఇక్కడ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మాత్రం ముందుకు సాగడం లేదు. కారణాలు అన్వేషిస్తే మనకు కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తున్నాయి. 

తెలంగాణా ప్రత్యేకంగా కావాలని ప్రజలకు ఎప్పటినుండే  వున్నా వారు సర్దుకుపోతూ వచ్చారు. కోస్త, రాయలసీమ ప్రాంతాల వారితో ఎప్పుడూ విభేదాలు లేవు. అయితే తెలంగాణా సమస్యను ఎప్పుడైతే రాజకీయ పార్టిలు తమ అజెండాగా మార్చుకోన్నాయో అప్పటినుండి ఈ ఉద్యమం వక్ర మార్గం పట్టిందని చెప్పాలి. ఎన్నికలలో ఓట్ల కోసం తెలంగాణా కోసం మాట్లాడటం గెలిచిన తరువాత పట్టించుకున్న పాపాన పోవడం టి. ఆర్. ఎస్ తో పాటు అన్ని పార్టి లు చేశాయి. టి. ఆర్ .ఎస్ అయితే అవసరం వున్నా లేకున్నా రాజీనామాలు చేయడం , మళ్ళి గెలిచి తమ బలాన్ని చాటడం చేసింది. దానికి  సెంటిమెంట్  అనే పేరు పెట్టి పబ్బం గడుపుకుంది . ఒక సారి రాజీనామా చేసిన సీట్లలో కొన్నింట ఓడి పోయి  తన ప్రభావం కోల్పోయే దశకు చేరింది. ఇక్కడే కే. సి. ఆర్ . మళ్ళి తన బుర్ర కు పదును పెట్టి నిరాహార దేక్షకు కూర్చుని అగ్గి రాజేసాడు. దాంతో అన్ని పార్టిలు అనుకూలంగా చెప్పినా  సీమాంద్ర వ్యతిరేకత చూసి రెండు నాల్కల, రెండు కళ్ళ సిద్దాంతాలను తెరపైకి తీసుకు వచ్చి ప్రజల మధ్య పెద్ద చీలికకు కారణమవుతున్నాయి. 

తెలంగాణా ఇచ్చినా తమకు ఏమిటి లాభం అని కాంగ్రెస్, టి.డి.పి. లు ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో మారిన పరిస్తితులలో విభజన అనేది ఇంకా వైషమ్యాలను పెంచుతుందే గాని తుంచదు. పాకిస్తాన్ విడిపోతే సమస్య పరిష్కారం కాలేదు సరి కదా పెరిగింది . ఒక రాష్ట్ర విభజన జరిగినా రెండు ప్రాంతాల ఏకాభిప్రాయం తీసుకొని ఎలాంటి స్వంత పేరు, పట్టు , భేషజాలకు పోకుండా చేయవలసిన అవసరం వుంది. ముందుగా రాజకీయ పార్టి లు వారి పార్టీలో ఒక అభిప్రాయానికి కృషి చేయాలి. ఒక నిర్దిష్ట సమయంలో అటో ఇటో తెలిస్తే అందరు ప్రజలు సంతోస పడుతారు. ప్రజలు రాజకీయ పార్టీ ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారకుండా సామరశ్యంగా సమస్య పరిష్కారం చేసుకోవలసిన అవసరం వుంది.

Sunday 25 September 2011

నెలాఖరులో జగన్ అరెస్ట్ వుంటుందా ?


 
అవినీతి , అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా సి.బి.ఐ చేస్తున్న విచారణ ఒక కొలిక్కి రావడంతో పాటు, గాలి జనార్ధన్ రెడ్డి కేసులో కూడా సి.బి. ఐ కి కొంత తెరిపి వచ్చినట్టు భావిస్తున్నారు . ఈ నేలఖరులోపుగా జగన్ ఓదార్పు యాత్ర ముగింపు అయ్యాక ఈ అరెస్ట్ జరగనున్నట్టు భోగట్ట . ఏది ఏమైనా ఇటీవల జగన్ కేసు విచారణ మండగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలుగు దేశం ఈ అంశంపై నేరుగా జగన్ కాంగ్రెస్ కు సరెందర్ అయ్యాడని ఆరోపించింది . కాంగ్రెస్ వర్గాలు అయితే కాంగ్రెస్ సభలలో జగన్ అవినీతి పై ముఖ్యం గా బొత్స , కిరణ్ , చిరంజీవి టార్గెట్ చేయడం పట్ల రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది.  జగన్ ను సి. బి. ఐ అరెస్ట్ చేయడం చేయక పోవడం ఇంకో వారం రోజులలో తేలనుంది .

Friday 23 September 2011

జగన్ కేసు నీరు కారుస్తున్నారా?


జగన్ అవినీతి పై కోర్టు ఆదేశాల మేరకే విచారణ చెప్పట్టినట్టు చెబుతూ వచ్చిన సి.బి. ఐ . ప్రస్తుతం నెమ్మదిగా విచారణ సాగిస్తోంది. ఆరంభంలో ఏంటో స్పీడ్ కనబరిచినా జగన్ ఢిల్లీ పర్యటన తరువాత విచారణ పై ఒత్తిడి వచ్చినట్టు అంటున్నారు. ప్రధాని ఏమైనా హామీ ఇచ్చారేమో , జగన్ కాంగ్రెస్ పార్టీ కి లొంగి పోయదేమోనని అంటున్నారు . అదే జరిగివుంటుందని 45  రోజులలో  వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేస్తారని తెలుగు దేశం ప్రచారం చేస్తోంది . గతంలో ప్రజారాజ్యం పార్టీ గురించి ఇదే విధంగా తెలుగు దేశం చెప్పింది. అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు తెలుగు దేశం చెప్పినట్టే ప్రజారాజ్యం వీలీనం జరిగిపోయింది. జగన్ ఏర్పాటు చేస్తుకున్న  వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేస్తారని అంటున్నారు .ఏది ఏమైనా గాలి కేసు లో సి.బి. ఐ. చాలా బిజీ గా వుంది. జగన్ కేసుకు కాస్త తెరిపి నిచ్చిన సి.బి.ఐ తన పని తానూ చేస్తుందేమో చూద్దాం.

Thursday 22 September 2011

రూపాయికి కిలో బియ్యం ...మిగిలినవి మాత్రం ..?


నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎం. టి. ఆర్ ప్రకటించిన కిలో రెండు రూపాయల బియ్యం కాల క్రమంలో చంద్ర బాబు హాయంలో ధరలు పెంచి కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
2009 ఎన్నికలకు ముందుగా తిరిగి కిలో రెండు రూపాయల బియ్యం ప్రకటించి ఎన్నికలలో లబ్ది పాడాలని ప్రయత్నించి సపలం అయ్యారు. ప్రస్తుతం టీ 5 రూపాయల పైన అమ్ముతున్న తరుణంలో బియ్యం మాత్రం కిలో రూపాయికి ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాజకీయంగా తనదైన ముద్ర వుండాలని , రాజశేఖర్ రెడ్డి ని ప్రజలు మరిచి పోయే విధంగా చేయాలని ప్రయతం లా వుంది. నిరు పేదల పేరుతొ ఓట్లు కొల్లగొట్టాలని , పదవులు కాపాడుకోవాలని కాకుండా చిత్తసుద్ధి లేని పథకాలు ఎక్కువ కాలం కాల పరీక్షకు నిలబడవు కదా !

Wednesday 21 September 2011

పార్టీ మారినా జై సమైఖ్యంద్ర అంటున్న చిరు


ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తూ సామాజిక తెలంగాణా తన వాణి అని అందరిని విశేషంగా ఆకర్షించిన చిరంజీవి , చిదంబరం ప్రకటన తరువాత అప్పటి ప్రజారాజ్యం పార్టీది సమాఖ్య వాదమని, సమాఖ్య ఆంధ్ర కే మొగ్గు చూపుతున్నట్టు విస్పస్తంగా పేర్కొనడం తెలిసిందే. తెలంగాణాలో ఎంత వ్యతిరేకత వచ్చినా తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలీనం చేయడంతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అందరికి ఆసక్తి రేగింది. యింతే తిరుపతి లో ఈ రోజు జరిగిన సభలో పత్రికల వారితో మాట్లాడుతూ తానూ సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నట్టు తెలిపారు. సకల జనుల సమ్మెతో తెలంగాణా ఉద్యమం ఉదృతంగా వున్నా సమయంలో ఈ మాట చెప్పడంతో చిరుకు కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం తెలిసి వున్నట్టు అంటున్నారు.


Tuesday 20 September 2011

మరోసారి నిరాహార దేక్షకు దిగనున్న కే. సి. ఆర్ .





తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కే. సి. ఆర్ . మరో సారి నిరాహార దీక్షకు కూర్చోవాలని తలుస్తున్నారు. 2009 లో నిరహరదేక్షకు ఆయన కూర్చున్నప్పటినుండి తెలంగాణా ఉద్యమం ఉద్రుతమై కేంద్ర ప్రభుత్వం 9th డిసెంబర్ చిదంబరం చేత చేయించి తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటన చేయించి దీక్ష విరమించ చేయగలిగింది. ఆ తరువాత రోజు నుంచి సీమాంద్ర ప్రాంతంలో రాత్రికి రాత్రికి ఉవ్వేతున్న లేచిన నిరసనలకు భయపడి 23 డిసెంబర్ నాడు చిదంబరం శ్రీ కృష్ణ కంమిట్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మరో ప్రకటన చేయవలసి వచ్చింది . ఆనాటి నుండి తెలంగాణపై రాష్ట్రము మొత్తం పర్యటించిన శ్రీ కృష్ణ కమిటి చివరికి ఆరు మార్గాలను సూచించి ప్రస్తుతం వున్నా సమైకంద్రనే ఉత్తమమని నివేదిక ఇవ్వడం జరిగింది . అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ నివేదికపై ఏ నిర్ణయం ప్రకటించలేదు. తెలంగాణా పై కేంద్ర సాచివేత ధోరణి వాళ్ళ రాష్ట్రములో ఉద్యమం తారాస్తాయి కి చేరి సకల జనుల సమ్మె గా రూపుమార్చుకుంది.

ఇదిలా వుండగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వాటి విధాన నిర్ణయాని చెప్పలేకపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు రెండు ప్రాంతాలలోను ఉద్యమాలలో పాల్గొంటున్నాయి. ఈ పరిస్తితులలో కే. సి. ఆర్. నిరాహార డిక్ష ప్రారంభిస్తే  అది ఇంకా సమస్యగా మరే అవకాసం వుంది. అయితే ఈసారి నిరాహార దేక్షను అడ్డుకొని రాష్ట్రా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నించవచ్చు . ఒకసారి తొందరపడిన ప్రభుత్వం ఈసారైనా రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.


Monday 19 September 2011

రేణుక తెలంగాణా వ్యతిరేకా?


సకల జనుల సమ్మె జయప్రదం కావడం లేదని కాంగ్రెస్ నాయకురాయలైన ఖమ్మం మాజీ యం.పి . రేణుక చౌదరి  వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లలో , ముఖ్యంగా తెలంగాణా కోరుకుంటున్న వారికి మింగుడు పడలేదు. తెలుగు దేశం పార్టీ లో వున్నప్పుడు ఒకే మగాడుగా రామారావు చే గుర్తింపు పొంది అనంతరం కాంగ్రెస్ లోనూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె తెలంగాణాకు వ్యతిరేకంగా వుందని ప్రచారం జరుగుతోంది. అయితే సకల జనుల సమ్మె వాళ్ళ ప్రజలకు సమస్యలు తప్ప తెలంగాణా రాదనీ ప్రచారం మొదలైంది . ఏదిఏమైనా తన అభిప్రాయాన్ని కుండ బాధలు కొట్టినట్టు చెప్పే రేణుకలా అందరూ సొంతంగా అలోచించి మాట్లాడాలి అంతే కాని కొండదరామ్ చెప్పినట్టు ఆడితే అర్థం లేదు.  ఖమ్మం జిల్లా లో పట్టు ఉన్న నాయకురాలు ఇలా వ్యాఖ్యానించడం వెనుక అధిష్టానం చేయి ఉందేమో చూడాలి.


Sunday 18 September 2011

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా ? లేన్నట్టా ?


రాష్ట్రంలో గత కొంత కాలంగా ప్రభుత్వం వుందా లేదా అనే సందేహం కలుగుతోంది . తెలంగాణా విభజన సమస్యపై సకల జనులు చేప్పట్టిన సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ రాబడి బాగా తగ్గింది. సమ్మె సమయంలో సరైన విధంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో అధిక శాతం ఉద్యోగులు సమ్మె లో పాల్గొంటున్నారు. ఈ సమస్య వాళ్ళ సామాన్యులకు మరింత భారం అవుతోంది.  రాష్ట్రంలో రాబోయే కాలంలో ధరలు మరింత పెరుగడం తప్పని సరిగా కనిపిస్తోంది.  


Friday 16 September 2011

లక్ష్మి పార్వతి ఏ పార్టీలో వున్నట్టు ?


నందమూరి లక్ష్మి పార్వతి ప్రస్తుతం ఏ పార్టీలో వుందో ఎవరికీ అర్థం కావడం లేదు . ఆమె స్వయంగా తెలుగుదేశం పార్టీ లో ఏర్పడిన సంక్షోభం తరువాత రామారావు బతికి ఉన్నప్పుడే ఏర్పడిన ఎం. టి . ఆర్ తెలుగు దేశం పార్టీ ఏర్పడింది . మహా నాయకుడు ఎం.టి. ఆర్ మరణాంతరం అదే పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయింది . అయితే ఇటీవల కొంత కాలం రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కాంగ్రెస్ కు మద్ధుతుగా వున్నా ఆమె ఇప్పుడు జగన్ ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నారు . మరి ఆమె ఏ పార్టీ లూ వున్నారు . ఆమె స్వయంగా అధ్యక్షురాలిగా వున్నా పార్టీ ఏమైనట్టు. ? ఓ కార్యక్రమం లేకుండా పోయి అమీ ఏమి చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

అంబటి లీలలతో తలపట్టుకున్న జగన్ !

అంబటి లీలలతో తలపట్టుకున్న జగన్

ఇన్నాళ్ళు వై. ఎస్. ఆర్ . కాంగ్రెస్ పార్టీ కి అధికార ప్రతినిధిగా వున్నా అంబటి రాంబాబు రాసలీలలు వెలుగు చూడడంతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తల దించుకునే పరిస్తితి ఏర్పడింది . వెంటనే ఈ విషయమై ఎలాంటి ప్రకటనలు చేయకుండా నష్ట నివారణ పనులు చేయాలని ఎ. బి. ఎం ఛానల్ పై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది . మా దగ్గర ఆధారాలు వున్నాయని కావాలంటే నిరూపిస్తామంటుంటే సరిగ్గా సమాధానం చెప్పే వారె కరువయ్యారు . ఇంతకాలం తన వాగ్ధాటితో ఎదుటివారిని విమర్శించే అంబటి తన విషయాన్ని అంత బలంగా ఎదుర్కోలేక జగన్ కు తల నొప్పిగా మారిపోయాడు. పార్టీ లో అప్పుడే అతన్ని బయటకు పంపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు . ఈ సమస్యను జగన్ ఎ విధంగా పరిష్కరించుకుంటారో చూడాలి.
ఎదిఎమైనా పార్టీ లో మహిళల పరిస్తితి అంత బాగోలేడనే ప్రచారం ఊపందుకుంది అని చెప్పవచ్చు.


విజయసాయి రెడ్డి కి భయం ఎవరి నుండి వుంది ?

జగతి పబ్లికేషన్ వైస్ - చైర్మన్ విజయ సాయిరెడ్డి తనకు ప్రాణ హాని వుందని పోలీసులకు పిర్యాదు చేశాడు . ముఖ్యంగా తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకుల నుండి బెదిరింపులు వస్తున్నట్టు అంటున్నారు . ఇంతకీ సి.బి. ఐ ఆఫీసు కు రోజూ వెళుతున్న విచారణ పూర్తి కాలేదు. ఒక వేళ నిజంగానే ఆయన ప్రాణానికి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ లు హాని కల్పించి ఆ నెపం జగన్ పై పెడుతారంటే నమ్మగలమా ? . ఇదివరకు పరిటాల హత్య కేసులో ప్రధాన ముద్దాయి మొద్దు శీనును జైలులో చంపింది ఎవ్వరో ? నిజాలను కప్పి పుచ్చాలని ఎవ్వరో ఆయనతో ఇలా పలికించి వుంటారు . విజయ సాయి రెడ్డి ఇకనైనా నిజాలు చెప్పి సి. బి. ఐ కి సహకరించి అవినీతి అక్రమాల వివరాలు అందించ వచ్చు. అందులో భాగంగా ఆయన ప్రాణానికి హాని లేకుండా వుండాలని ఎత్తుగడ కావ్వొచ్చు. మొత్తానికి రోజూ సి.బి. ఐ ఆఫీసు మెట్లు ఎక్కుతున్న విజయ సాయి రెడ్డి పై కేసు వివరాలు ఆధారపడి వుందని చెప్పా వచ్చు.

Thursday 15 September 2011

అడ్డంగా దొరికిన అంబటి రాసలీల


వై. ఎస్. ఆర్ . పార్టీ లో కీలక భాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబటి రాసలీల భాగోతాన్ని ఎ. బి. ఎన్. , ఆంధ్ర జ్యోతి ఛానల్ అడ్డంగా దొరకపుచ్చుకొని ఎండగట్టింది.  రాజకీయాలలో ఉంటూ పబ్లిక్ లైఫ్ లో వున్నా వాళ్ళు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయాలను కంపు చేస్తున్నారు . ఎవరు దొరికితే వారిపై రెచ్చిపోయే అంబటి రాంబాబు మహిళలను లైంగికంగా వేధించడం క్షమించరాని నేరం . గవర్నర్ గా తివారి వెలగబెట్టిన రాసలీలలను బయటపెట్టి సాహసం చేసిన ఎ. బి. ఎన్ ఈ సారి అంబటి రాంబాబు రాసలీలను బయటి ప్రపంచానికి తెలిపి భలే మంచి పనిచేసింది. మరి జగన్ అంబటి రాంబాబు ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో ..కట్టు కథలల్లి కాంగ్రెస్  , తెలుగు దేశం కుట్రలో ఓ భాగం అంటారో చూడాలి మరి . కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో ఇలాంటి నాయకులకు చోటులేకుండా ఆ దేవుడు చూడాలి .

జగన్ కు గాలి అవినీతి సెగ ...

మూలుతున్న నక్కపై తాటిపండు పడినట్లుంది జగన్ పరిస్తితి . సన్నిహితుడైన గాలిని సి .బి .ఐ అరెస్ట్ చేసిన తరువాత జగన్ మాట తీరులో కొట్టొచ్చిన మార్పు చూసి సొంత పార్టీ  వాళ్ళే నమ్మలేక పోయారు. గాలి సమర్దిచలేక , అనినీతి పై మాట్లాడ లేక జగన్ సతమతమావుతున్నాడు.  అవినీతి గురించి జగన్ కేసు సి.బి.ఐ విచారణ మొదలైన తరువాత జరిగిన అనివార్య పరిస్తితులు జగన్ కు ప్రతికూలంగా మారినాయని చెప్పవచ్చు.  అన్న ఆజారే నిరాహార దీక్ష , హైకోర్ట్ , సుప్రీం కోర్టులలో చుక్కెదురు ఆయనను ఇబ్బందుల పాలు చేసినాయి. రాష్ట్రంలో అయితే ఈ అవకాశాన్ని చంద్ర బాబు ఉపయోగించుకొని కొన్ని జిల్లాలు తిరిగి అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి హడావుడి చేశారు . సి.బి. ఐ తనను అరెస్ట్ చేస్తారనే పుక్కార్లు వున్నా నిబ్బరంగా వున్నా జగన్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ తో ఇక తన వంతెనేమో అన్నంత భయపడి పోయిన్నట్టు అయింది . విలేకరులతో ఎన్నడూ లేనంత అసహనం , విసుగు కనిపించింది . ఢిల్లీ టూర్ కూడా ఆశించిన పలితాలు అందివ్వలేక పోవడంతో జగన్ నిరాశకు గుర్రైనట్టు తెలుస్తోంది . ఏది ఏమైనా ఈ నెల చివర్లో జగన్ అరెస్ట్ తప్పేటట్టు లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Wednesday 14 September 2011

తిరుపతి కి చిరు ఏమి చేశారు ..?


తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని అంగరంగ వైభవంగా ప్రారంభిచిన చిరు అక్కడి  ప్రజల ద్వారా శాసన సభ్యుడుగా ఎన్నికైనా ఇంతవరకు తిరుపతి చేసింది ఏమి లేదని స్థానికులు వాపోతున్నారు . తిరుపతి ఆద్యాత్మిక నగరం అయితే తిరుపతి సమస్యలపై కనీసం ద్రుష్టి పెట్టలేని చిరంజీవిని చూసి జనం ఎం ల్ ఏ గా మర్చిపోయారని ప్రతిపక్షాలు అంటున్నాయి . ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసి తానూ మాత్రం పదవుల కోసం , పార్టీ అండతో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు . ఇదే విధంగా అయితే వచ్చే ఎన్నికలలో తిరుపతి నుండి చిరు ఎన్నిక కావడం డౌటే మరి.

సకల జనుల సమ్మె వల్ల తెలంగాణా వస్తుందా ?

తెలంగాణా కోసం జే ఎ సి పిలుపు మేరకు సకల జనుల సమ్మె ప్రారంభమైనది. ఈ సమ్మె వల్ల ప్రభుత్వానికి వున్నా నష్టం కన్నా పౌరులకే ఎక్కువ నష్టం జరుగుతుంది . సమ్మెలు ప్రజా జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే పర్వాలేదు . రోజూ కూలీలు, కూరగాయలు, పండ్లు అమ్మే వారి పరిస్తితి ఏంటి ? జనం కోసమని చెప్పి నాయకులు పిలుపులు ఇస్తున్నారు. నిజంగా వారిలో చిట్టా సుద్ధి వుంటే ఉద్యమం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా జరపాలి . ఈ సారి సమ్మెలో ఉద్యోగులు పాల్గొనడం వల్ల కొత్త సాంప్రదాయానికి తెరలేచింది . రేపు తెలంగాణా వచ్చినా ఉద్యోగులను నియంత్రినిచాగాలరా అన్నది సందేహమే .
బడా బాబులు వారి వారి పనులు చేస్తుకున్తున్నారు .. వారి కంపెనీలు , ఫ్యాక్టరీలు పనిచేస్తుంటాయి. సామాన్య ప్రజలకే నష్టం జరుగుతుందని అంటున్నారు .

Tuesday 13 September 2011

భలే బాలయ్య .......!

రాజకీయాలలోకి రావలనుకున్తున్నట్టు , వచ్చే ఎన్నికలలో ఎం. ల్. ఎ స్థానానికి పోటీ చేస్తునట్టు బాలయ్య ప్రకటించడం తెలిసిందే. ఈ ప్రకటన వ్యూహత్వకమే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తెలుగు దేశం కాడర్ లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా చెప్పినట్టు తెలుస్తోంది. బాలయ్య ప్రకటన తరువాత వెంటనే వివిధ జిల్లాల కార్యకర్తలు స్వాగతం పలకడం  , స్వయానా చంద్రబాబు బాల కృష్ణ వస్తే తగిన విధంగా గౌరవిస్తామని అనడంతో ఎన్.టి. ఆర్ కుటుంబం పార్టీ తో ఉందనే సందేశం పంపడంతో పాటు హరికృష్ణ కు , జూనియర్ ఎన్.టి. ఆర్  కు చెక్ చెప్పే విధంగా వుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ  స్వయానా వియ్యంకుడు కావడంతో చంద్ర బాబు కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు .

ఇక అవినీతి వ్యతిరేక యాత్రలు

అవినీతికి వ్యతిరేకంగా పోరాడి జాతిని మేల్కొలిపిన అన్న ఆజారే అవినీతి వ్యతిరేక యాత్రలు చేయబోతున్నారు. భారత ప్రజలను కులం, మతం, పార్టీ ప్రాతిపదికన కాకుండా ఒక బృహతరమైన విధంగా అయన అవినీతిపై ఒక్క తాటిపై నడిపారు . కొంత వరకు కేంద్రం మెడలు వంచి విజయం సాధించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్న హజారే చేప్పట్టనున్న యాత్ర నిజంగా అవినీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగేత్తిస్తున్నాయి.  బి.జే. పీ . నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ కూడా యాత్రలు చెప్పతబోతునట్టు ప్రకటించారు.ఆయన యాత్రను ఓబులాపురం నుండి మొదలు పెడితే బాగుంటుందని కాంగ్రెస్ నాయకుడుగా చిరంజీవి సలహా ఇచ్చారు . సినీమాలో టాగోర్ పాత్రలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఈయన అవినీతి పై ఒక కార్యక్రమం తీసుకొని వుంటే బాగుండేది . చంద్ర బాబు ఆంధ్ర ఆజారే లెవెల్లో అప్పుడే యాత్రలు చేసి యూత్ దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. ఏది ఏమైనా అవినీతిపై మాట్లాడలేని పరిస్తితిలో అటు కాంగ్రెస్, ఇటు జగన్ వర్గాలు వుండడం విశేషం.
 
 

సందిట్లో సడేమిగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?

రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు తెలంగాణా , జగన్ అవినీతి సమస్యలతో ముడిపడి వుంది. ఎవ్వరికే ఏమి జరుగాబోతుందో అర్థం కావడం లేదు. ఇదిఇలా వుండగా ఇదే సమయంలో సందిట్లో సడేమియగా ముఖ్య మంత్రి తన సొంత టీంను మంత్రి వర్గం లోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేయాలని అనుకుంటున్నట్టు భోగట్ట..

జగన్ గ్రూప నుండి జారుకుంటున్నజయసుధ!


సికిందరాబాద్ కాంగ్రెస్ శాశనసభ్యురాలుగా ఎన్నికయిన సిని నటి జయసుధ జగన్ గ్రూప్ తో జతకట్టిన విషయం తెలిసిందే. ఆమె తన పదవికి తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా ఆమె చేసిన రాజీనామాను స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే వై ఎస్ పేరు సి.బి. ఐ  ప్రాధమిక నేర పత్రంలో ప్రస్తావించినందుకు జగన్ గ్రూప్ లోని అందరూ ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసిన తెలంగాణాకు చెందినా కొండ సురేఖ , సత్యవతి, జయసుధ లు చేయలేదు. ఇదివరకే రాజీనామా చేసినందున మళ్ళీ అవసరం లేదన్నారు. అయితే కొండ సురేఖ, సత్యవతి మళ్ళీ రాజీనామాకు సిద్ధమంటున్న జయసుధ వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది . ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలను తోసిపుచ్చలేము.

Monday 12 September 2011

తెలంగాణా సమస్య తీరుతుందా ?

తెలంగాణా విభజన చేయాలని ఆ ప్రాంతం వారు చేస్తున్న డిమాండ్ తీవ్రరూపం దాల్చనుంది. కొంత కాలంగా కాస్త తగ్గినట్టు కనిపించినా సకల జనుల సమ్మె తో తిరిగి రాష్ట్రంలో పరిస్తితులు జటిలం కానున్నాయి. మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గులాం నబి ఆజాద్ ఇరు ప్రాంతాల నాయకులతో చర్చిస్తున్నారు . అయితే సమస్య పరిష్కార మార్గం దొరకడం లేదు. సీమంద్ర నేతలు మాత్రం ఇంకెక్కడి తెలంగాణా అది కోల్డ్ స్టోరే కు వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణా కోసం పోరు సలుపుతున్న వారిలోనే వివిధ రకాలుగా వున్నారు . టి. ఆర్ .ఎస్. తెలంగాణా పై తనకే పేటెంట్ హక్కు వున్నట్టు పెద్దన్న పాత్ర పోషిస్తోంది . గద్దర్ ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విమర్శిస్తోంది . కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు . తెలుగుదేశం ఫోరం పై  ఆధారపడి ముందుము పోతోంది . కలసి కట్టుగా లేకపోవడం తెలంగాణా నాయకులలో పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.  ఎట్టకేలకు తెలంగాణా పై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతేనే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావు .

గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న సి .యం .కిరణ్

మెల్ల మెల్లగా ముఖ్యమంత్రి పదవిలో కిరణ్ కుమార్ రెడ్డి కుదురుకున్నట్టే . వృధ్యాప్యం నెపంతో రోశయ్య ను తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. తెలంగాణాలో చదువుకున్న ఈయన సీమాంద్ర నుండి (చిత్తూర్ ) యం .ఎల్ .ఏ గా గెలుపొందారు. వీరి తండ్రి స్వర్గీయ నల్లారి అమరనాథ రెడ్డి అప్పట్లో మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధి కుటుంబానికి విధేయులుగా పేరుగడించారు. అవ్వన్నీ కిరణ్ కు కలసి వచ్చాయి. మంత్రి పదవి కోరుకున్నా
దక్కని కిరణ్ కు ఏకంగా ముఖ్యమంత్రి పదవి వరించింది .ముఖ్యమంత్రి పదవి చేప్పట్టిన తరువాత రాష్ట్ర పర్తిస్తితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. సి బి ఐ  కేసులలో జగన్ ఇరుక్కోవడం , చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వీలీనం అవ్వడం, డి ఎస్ స్తానంలో బొత్సా పి సి సి చీఫ్ గా ఎన్నికకావడంతో ఆయనకు కలసి వస్తోంది . ఎన్నికల వరకు ఆయన స్తానానికి డోకా లేన్నట్టే. అయితే వచ్చే ఎన్నికలలో ఆయనకు పోటీదారులుగా చిరు , బొత్సా ఉన్నట్టే.  తెలంగాణా సమస్య  పరిష్కారం సామరశ్యంగా పరిష్కారం అవ్వడం తో పాటు జగన్ ను
దీటుగా ఎదుర్కోవడం పై ఆయన భవిష్యత్తు ఆధారపడి వుందని చెప్పా వచ్చు. దీంతో పాటు ప్రజలకు దగ్గర కావడానికి ఆయన పలు పథకాలు ప్రవేశ పెడుతున్నారు. యువ కిరణాలు పేరుతొ ఒకే రోజు ఒక లక్ష ఉద్యోగాల పంపిణీకి సిద్ధమవుతున్నారు.  రాష్ట్ర స్తాయిలో మహిళా బ్యాంకు ఏర్పాటు అవబొతోంది .దీనిని బట్టి ఆయన యువత , మహిళా విభాగాలలో పేరు కోసం ప్రయత్నిస్తున్నాటు తెలుస్తోంది. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు సపలీకృతం అవుతారో వేచిచూద్దాం .


Sunday 11 September 2011

కూలుతున్న గాలి మేడలు ...

కటిక పేదరికంలో పుట్టి  గనులు తవ్వి కోట్లు కూడబెట్టి జైలు పాలైన జనార్ధనా ! నీ ముందే నీ గాలి మేడలు కూలుతుంటే  నీ ముందే నీ ఇష్టారాజ్యం చేజారి పోతుంటే  అక్రమంగా సంపాదిస్తుంటే ఆహా ఓహో అన్న వారే చీత్కారిస్తునారు ...భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు  నీకు బంగారు సింహాసనాలు అవసరమా ? అవసరానికి మించి ఏ మున్న అది నీది ఎప్పటికి కాదు ,సంతోషంతో వచ్చిన అక్రమ సంపదా దుక్కాన్నేమిగిలించింది .. ఇప్పటికైనా నీ సంపద ప్రభుత్వానికి ఇచ్చేసి  నీ బతుకు కొరకు మాత్రమె మంచి దారిలో సంపాదించుకో
జాన కడుపు కోసమెందుకు అడ్డ దారులు !

రోజా అడుగు పెడితే అరిస్టమేనా ?


  రోజా ఏ ముహూర్తాన రాజకీయ రంగంలో అడుగు పెట్టిందో ఏమో కాని ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీకి , నాయకులకు అరిష్టం అంటున్నారు . సినిమా రంగంలోంచి నేరుగా తెలుగు దేశం పార్టీలోకి చేరడంతోనే ఆ పార్టీకి వున్నా అధికారం కాస్త చేజారిందని గుర్తుకు తెస్తున్నారు. ఎన్నికలలో తెలుగు దేశం తరపున పోటీ చేసి ఓడిపోయి తెలుగు దేశం పార్టీని వదలి రాజశేఖర్ రెడ్డి ఆకర్ష్ కు కాంగ్రెస్ పార్టీ లో చేరింది . కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినా  రోజా చేరిన వెంటనే  వైఎస్ మరణించడం తో రోజాకు రాజకీయాలలో ఐరన్ లెగ్ పేరు పెట్టేశారు . కాంగ్రెస్ వదలి జగన్ వెంట రాగానే ముఖ్యమంత్రి పదవి రాకపోవడం తో  పాటు జగన్ వివిధ సి బి ఐ కేసులలో ఇరుక్కొని పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రోజా ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాల పై దృష్టి పెడుతోంది . టి వి ప్రోగ్రాం యాంకర్ గా మారిపోతోంది . ఏదో ఉన్నానంటే వున్నానని రాజకీయాలలో ఉంటోంది . ఈ ఐరన్ లెగ్ భామ ప్రభావం జగన్  ను ఏ గతి పట్టిస్తుందో చూద్దాం .

Thursday 8 September 2011

అండ దొరకని జగన్


సి బి ఐ దాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏమిచేయాలో పాలుపోని జగన్ ఢిల్లీ లోని పెద్దల గడపల ముంగిట వారి ఒదార్పునకు నోచుకోలేకపోయాడు . కాంగ్రెస్ నాపై కక్ష సాధిస్తోందని విమర్శించి , కేంద్రంలో వారి ఆధ్వర్యంలోని యు పి ఎ తో పొత్తుకు సిద్ధం అనడం అనుభవలేమిని సూచిస్తోంది. కాస్త కాలంలో పార్లమెంట్లో మద్దతుగా మాట్లాడిన బి జే పి తో కలవను గాక కలవనని అనడంతో సుష్మ అపాయింట్ మెంట్  ఇవ్వక షాక్ ఇచ్చింది . చంద్రబాబుతో వున్నా మూడో ఫ్రంట్ వాళ్ళు ముఖాలే చాటేశారు . లాలు ఊరటగా మాట్లాడిన తానె సి బి ఐ కేసులలో ఇరుక్కొని వున్నాడు.  అన్నిదారులు మూసుకు పోయిన పరిస్తితులలో దేవుడి పైననే భారం వేసి అరెస్ట్ కు సిద్ధం కావడమే మిగిలింది .

Wednesday 7 September 2011

దేశం కు నామం పెట్టిన నాగం


పార్టీ లో వుంటూనే అధినేతను ఇబ్బందికి గురిచేసే ఎత్తుగడలో భాగంగానే నాగం ఇంతకాలం రెబెల్ గా గుర్తింపు పొంది పోరాటం చేస్తూ వచ్చారు. తెలంగాణా కోసమే పోరాడినట్టు అనిపించినా అంత సొంత అజెండా ప్రకారం వున్నా పార్టీనే విమర్శిస్తూ , అదే సమయంలో కాంగ్రెస్ , టి ఆర్ ఎస్ ల కు మింగుడుపడని ఈ గడుసు పిండం జగన్ వర్గంతో అజ్ఞాతంగా  పనిచేస్తున్నట్టు తెలుగు దేశం ఆరోపిస్తోంది . ఏదిఏమైనా స్పీకెర్  అనర్హత వేటు వేయకముందే  నాగం రాజీనామా చేశారు . నాగం గ్రూప రాజీనామాతో తెలుగు దేశం ఊపిరి పీల్చుకొంది . కంటిలో నలుసుగా మారిన నాగం భవిష్యతు మాత్రం అంత బాగుంటుదని చెప్పలేము. నెంబర్ 2  గా వుండి , మంత్రి పదవులు ఇచ్చిన పార్టీకే ఎదురు తిరిగిన వాళ్ళు  సొంత పార్టీ  పెట్టిన విజయం సాధించడం సందేహమే కదా ..!

ఇక జయప్రద ఏం చేస్తుందో ..?

  మర్ సింగ్ ను నమ్ముకుని సమాజ్ వాది పార్టీ నుండి ఆయనతో పాటు బయటికి వచ్చిన జయప్రదకు ఏం  చేయాలో పాలుపోవడం లేదు. ఒక్కప్పుడు చంద్రబాబు కు దగ్గరై ఒక వెలుగు వెలిగిన ఈ తార ఆయనకే కుచ్చు టోపీ పెట్టి ములాయం పంచన చేరింది.  అమర్ సింగ్ తో ఈమెకు వున్నా ప్రత్యేక బంధంతో అక్కడ కూడా రాణించింది . అమర్ సింగ్ ములాయంకు దూరమై బయటకు రావడంతో ఈమెకూ బయటకు రాణి పరిస్తితి ఏర్పడింది . అమర్ సింగ్ కొత్త పార్టీ పెడితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చక్రం తిప్ప వచ్చని భావించింది . తలరాత బాగోలేక అమర్ జైలు పలు అయ్యాడు . ఏమిచేయాలో ఆమెకు అంతుపట్టడం లేదు. ఇటీవల తిరుమల వెళ్లి అమర్ సింగ్ తో పాటు శ్రీవారి ని దర్శించుకున్న స్వామి కరుణ పొందలేక పోయారు . ఇక ఏమి చేయాలో మనమే సలహా ఇద్దామా ! 
  

Tuesday 6 September 2011

ఎవరూ సంతోషంగా లేరు ..


సాధారణంగా చూస్తే అధికార పక్షం బలంగా లేక పొతే ప్రతిపక్షం బలంగా వున్నట్టు మనం అనుకోవచ్చు. మన రాష్ట్రంలో చూస్తే పరిస్తితి అందుకు భిన్నంగా వుంది. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి , జగన్ పార్టీ నుండి విడిపోయి బలహీనంగా వుంది. మరో ప్రక్క ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో కలిపినా తరువాత చిరంజీవి ప్రధాన శక్తీ గా ఎదగాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు . అందులో బాగంగానే ప్రత్యేక ఆఫీసు , టీవీ ఛానల్ ప్రారంభం చేసే ప్రయత్నాలలో వున్నారు. కోస్త ఆంధ్ర లో బలమైన సామాజిక వర్గం కలిగిన బొత్స సరే సరే .. పార్టీ లో  తనకంటూ ఓ  గుర్తింపు , పట్టు కోసం ప్రయత్నం చేస్తూ వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కి సి యం అయిన ఆనందం కన్నా సమస్యలే ఎక్కువ. అదే సమయంలో తెలుగు దేశం బలంగా వుంది అని చెప్పడానికి వీలులేని పరిస్తితి
తెలంగాణలో ఆ పార్టీ కేడర్ బాగున్నా అనుకూలంగా , ప్రతికూలంగా మాట్లాడలేక రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తోంది . అక్కడ టి ఆర్ ఎస్ తో పొసగడం లేదు . అదే సమయంలో సీమ , ఆంధ్ర ప్రాంతాలలో జగన్ ప్రభావం అంతో ఇంతో వుంది. వెరసి తెలుగు దేశం బలంగా వుందని చెప్పలేని స్తితి నెలకొనివుంది. 
కడప ఉప ఎన్నికలలో ప్రభావం చూపిన జగన్ ప్రభుత్వాని పడగోట్టాలనుకొని బంగపడ్డారు. సి బి ఐ కేసులలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయనకు  అవినీతి పెద్ద ప్రతిబంధకం అవుతోంది . టి ఆర్ ఎస్ పరిస్తితి కూడా అంటే తెలంగాణా వస్తుంది  అంటూ ఉద్యమాలతోనే కాలం వెల్లబుచ్చుతోంది. ఎవరూ సంతోషంగా లేని రాష్ట్ర రాజకీయం రాన్నున్న రోజులలో మరింత ఆసక్తి కరంగా మారనుందని చెప్పవచ్చు.


మిత్ర భేదం

 రాజశేఖర్ రెడ్డి వున్నపుడు గనులు కొల్లగొట్టిన ఘనుల దొంగ ఎట్టకేలకు సి బి ఐ చేతిలో అరెస్ట్ అయ్యాడు. జగన్ కష్టాల్లో వున్నపుడు నా తమ్ముడు అన్న గాలి జనార్ధన్ రెడ్డిని నాకెవరో తెలియదని జగన్ అంటున్నాడు. కూరిమి గల దినాలలో నేరములు నిక్కములై తోచును. గాలిని వేనుకేస్తుకు రాలేక , అతనిని విమర్సించలేక జగన్ తికమక పడుతున్నాడు . ఎంత మిత్రుడైనా , ఎంత కావలసిన వాడిన సరే జగన్ స్వార్ధం చూపుతున్నాడు . ఇందండి మాట తిప్పని మడమ తిప్పని వాడి మాట తీరు .