Monday 12 September 2011

తెలంగాణా సమస్య తీరుతుందా ?

తెలంగాణా విభజన చేయాలని ఆ ప్రాంతం వారు చేస్తున్న డిమాండ్ తీవ్రరూపం దాల్చనుంది. కొంత కాలంగా కాస్త తగ్గినట్టు కనిపించినా సకల జనుల సమ్మె తో తిరిగి రాష్ట్రంలో పరిస్తితులు జటిలం కానున్నాయి. మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గులాం నబి ఆజాద్ ఇరు ప్రాంతాల నాయకులతో చర్చిస్తున్నారు . అయితే సమస్య పరిష్కార మార్గం దొరకడం లేదు. సీమంద్ర నేతలు మాత్రం ఇంకెక్కడి తెలంగాణా అది కోల్డ్ స్టోరే కు వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణా కోసం పోరు సలుపుతున్న వారిలోనే వివిధ రకాలుగా వున్నారు . టి. ఆర్ .ఎస్. తెలంగాణా పై తనకే పేటెంట్ హక్కు వున్నట్టు పెద్దన్న పాత్ర పోషిస్తోంది . గద్దర్ ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విమర్శిస్తోంది . కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు . తెలుగుదేశం ఫోరం పై  ఆధారపడి ముందుము పోతోంది . కలసి కట్టుగా లేకపోవడం తెలంగాణా నాయకులలో పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.  ఎట్టకేలకు తెలంగాణా పై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతేనే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావు .

2 comments:

  1. తీవ్ర రూపం దాలిస్తే, పోలీసుచర్యతోనే పరిష్కారం సత్వరంగా అందుతుంది.

    ReplyDelete
  2. పోలీస్ చర్యతో పరిష్కారమవుతుందనుకుంటే 2009 డిసెంబర్‌లో ఆ పని ఎందుకు చెయ్యలేదు? అలాగే సమైక్యవాదులపై పోలీస్ చర్య ఎందుకు తీసుకోలేదు? సమైక్యవాద నాయకులని కావాలని అరెస్ట్ చెయ్యలేదు, పైగా కోస్తా ఆంధ్రలో ప్రత్యేక ఆంధ్ర ర్యాలీలు చెయ్యడానికి ప్రయత్నించినవాళ్ళని ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేశారు.

    ReplyDelete