Thursday 29 September 2011

మంత్రి శంకర్ రావు భర్తరప్ !


రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా వుంది సహచర మంత్రులపై  అవినీతి ఆరోపణలు చేసిన చేనేత శాఖా మంత్రి శంకర్ రావు ను పదవి నుండి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదేశించినట్టు తెలిసింది. రేపు ఉదయం లోపు శంకర్ రావు రాజీనామా సమర్పించకపోతే రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా కలసి భర్తరప్ చేయమని కోరనున్నట్టు సమాచారం. శంకర్ రావు చేసిన ఆరోపణలను సుమోట గా తీసుకున్న రాష్ట్ర హైకోర్ట్ సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మార్ , జగన్ అక్రమ కేసుల విచారణలు కూడా శంకర్ రావు హై కోర్ట్ కు వ్రాసిన లేఖల ఆధారంగా చేప్పట్టిన విషయం విదితమే. అందరికి ముచ్చెమటలు పట్టించే శంకర్ రావు ఇక ఏం చేస్తారో చూడాలి మరి .


2 comments:

  1. సుమోటో మీద తెలంగానకు మద్దతుగా పదవీత్యాగం చేసిన శంకర్రావ్ జిందాబాద్! జై తెలంగాన! ఇక ఉద్దెమంలో చేరుడే, సెగ తిహార్ని తాకాల, గదే ఢిల్లీని.

    ఆంధ్రోళ్ళు మన శంకర్రావుని పీకేస్తున్నరు, చలో అసెంబ్లీ ముట్టడి. :D

    ReplyDelete