Wednesday 28 September 2011

రాష్ట్ర విభజనకే కేంద్ర మొగ్గు ..


రాష్ట్ర విభజన సమస్య శాశ్వతంగా పరిష్కారానికి కేంద్రం ముందుకు పోతునట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చేసి తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలుగా విభజించి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని, కొంత కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా వుంచి రెండు ప్రాంతాలకు రెండు రాజధానులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు . తెలంగాణా రాష్ట్రంలోకి రాయలసీమ నుండి అనంతపురం, కర్నూల్ జిల్లాలను కలుపాలని ఆలోచనగా వున్నట్టు కే. సి. ఆర్ కూడా ప్రకటించినారు. అయితే ఇందుకు టి. ఆర్ .ఎస్ ఒప్పుకున్తుందా అన్నది తెలియడం లేదు. హైదరాబాద్ లేకుండా తెలంగాణా రాష్ట్రము తలలేని మోడెం అవుతుందని టి. ఆర్. ఎస్ నాయకులు చాల సందర్భాలలో అన్నారు. అయితే రాయలసీమను రెండు ముక్కలు చేయడం వాళ్ళ
రాయలసీమ పరిస్తితి మరింత దారుణంగా తయారవుతుందని చెప్పవచ్చు.  మరో రెండు రోజుల్లో నివేదికను ఇవ్వన్నున ఆజాద్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం కు ఏమి నివేదిక ఇస్స్తారో చూడాలి

1 comment:

  1. అదేగానీ జరిగితే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లవుతుంది. హైదరాబాదు తెలుగు వాళ్ళకేవరికీ కాకుండ పోతుంది. తెలుగు వాళ్ళ లాండ్ మార్కుగా వున్న ఈ నగరం ఉర్దు వాళ్ళకి హింది వాళ్ళకి కేంద్రపాలితమవుతుంది. కొట్టుకు చస్తే ఎమవుతుందో తెలుగు వాళ్ళకి తెలిసి వస్తుంది. మళ్ళీ ఏ అరవ, కన్నడ,ఉర్దు,హింది వాళ్ళ కాళ్ళ దగ్గరే బ్రతకాల్సిన ఖర్మ పడుతుంది.

    ReplyDelete