Monday 12 September 2011

గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న సి .యం .కిరణ్

మెల్ల మెల్లగా ముఖ్యమంత్రి పదవిలో కిరణ్ కుమార్ రెడ్డి కుదురుకున్నట్టే . వృధ్యాప్యం నెపంతో రోశయ్య ను తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. తెలంగాణాలో చదువుకున్న ఈయన సీమాంద్ర నుండి (చిత్తూర్ ) యం .ఎల్ .ఏ గా గెలుపొందారు. వీరి తండ్రి స్వర్గీయ నల్లారి అమరనాథ రెడ్డి అప్పట్లో మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధి కుటుంబానికి విధేయులుగా పేరుగడించారు. అవ్వన్నీ కిరణ్ కు కలసి వచ్చాయి. మంత్రి పదవి కోరుకున్నా
దక్కని కిరణ్ కు ఏకంగా ముఖ్యమంత్రి పదవి వరించింది .ముఖ్యమంత్రి పదవి చేప్పట్టిన తరువాత రాష్ట్ర పర్తిస్తితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. సి బి ఐ  కేసులలో జగన్ ఇరుక్కోవడం , చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వీలీనం అవ్వడం, డి ఎస్ స్తానంలో బొత్సా పి సి సి చీఫ్ గా ఎన్నికకావడంతో ఆయనకు కలసి వస్తోంది . ఎన్నికల వరకు ఆయన స్తానానికి డోకా లేన్నట్టే. అయితే వచ్చే ఎన్నికలలో ఆయనకు పోటీదారులుగా చిరు , బొత్సా ఉన్నట్టే.  తెలంగాణా సమస్య  పరిష్కారం సామరశ్యంగా పరిష్కారం అవ్వడం తో పాటు జగన్ ను
దీటుగా ఎదుర్కోవడం పై ఆయన భవిష్యత్తు ఆధారపడి వుందని చెప్పా వచ్చు. దీంతో పాటు ప్రజలకు దగ్గర కావడానికి ఆయన పలు పథకాలు ప్రవేశ పెడుతున్నారు. యువ కిరణాలు పేరుతొ ఒకే రోజు ఒక లక్ష ఉద్యోగాల పంపిణీకి సిద్ధమవుతున్నారు.  రాష్ట్ర స్తాయిలో మహిళా బ్యాంకు ఏర్పాటు అవబొతోంది .దీనిని బట్టి ఆయన యువత , మహిళా విభాగాలలో పేరు కోసం ప్రయత్నిస్తున్నాటు తెలుస్తోంది. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు సపలీకృతం అవుతారో వేచిచూద్దాం .


No comments:

Post a Comment