Wednesday 21 September 2011

పార్టీ మారినా జై సమైఖ్యంద్ర అంటున్న చిరు


ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తూ సామాజిక తెలంగాణా తన వాణి అని అందరిని విశేషంగా ఆకర్షించిన చిరంజీవి , చిదంబరం ప్రకటన తరువాత అప్పటి ప్రజారాజ్యం పార్టీది సమాఖ్య వాదమని, సమాఖ్య ఆంధ్ర కే మొగ్గు చూపుతున్నట్టు విస్పస్తంగా పేర్కొనడం తెలిసిందే. తెలంగాణాలో ఎంత వ్యతిరేకత వచ్చినా తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలీనం చేయడంతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అందరికి ఆసక్తి రేగింది. యింతే తిరుపతి లో ఈ రోజు జరిగిన సభలో పత్రికల వారితో మాట్లాడుతూ తానూ సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నట్టు తెలిపారు. సకల జనుల సమ్మెతో తెలంగాణా ఉద్యమం ఉదృతంగా వున్నా సమయంలో ఈ మాట చెప్పడంతో చిరుకు కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం తెలిసి వున్నట్టు అంటున్నారు.


14 comments:

  1. మంచిదే కదా

    ReplyDelete
  2. ఒకప్పుడు తెలంగాణా నిజంగా రాదనుకుని తెలంగాణాకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన చిరంజీవి ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నాడంటే అతని నాలుక స్థిరంగా లేనట్టే కదా. నేను కోస్తా ఆంధ్రలో ఉంటున్నా మొదటి నుంచి తెలంగాణాకే అనుకూలం. సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం హైదరాబాద్ కోసమే జరుగుతోంది కానీ కోస్తా ఆంధ్రలోని ప్రజా బాహుళ్య ప్రయోజనాల కోసం కాదనేది నాకు ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. కేవలం హైదరాబాద్ మీద వ్యామోహానికి సమైక్యవాదం అని ఏవో పేర్లు పెట్టుకోవడం మోసమే అవుతుంది కానీ ఇంకొకటి కాదు.

    ReplyDelete
  3. నీతో చిరూకు పోలికేమిటి ప్రవీణ్, చిరూకు ఈమధ్యే మతి తప్పింది. నీది మొదటి నుంచి ... స్థిరంగా వుంది, నేను గుర్తించాను.

    ఫోటోలో వుంది గుర్రమేనా?! బాగావుంది, నీ టోపీ కూడా మస్తుంది. ఎక్కడ తీయించావు? మద్రాస్ బీచీలో 20రూపాయలిచ్చి మా కుర్రాడికీ తీయించాను, మావాడు కూడా నీలాంటి టోపీ, గన్నూ కావాలని మారాం చేశాడు, దానికో పాతిక. మొత్తం 50 అయ్యింది.

    ReplyDelete
  4. ముస్లింలు ఉండే మా పక్క వీధిలో ఒంటెలు కూడా ఉన్నాయి, కావాలా? రమదాన్ మాసంలో మాంసం కొయ్యడానికి రాజస్థాన్ నుంచి తీసుకొస్తారు. నీకు కావాలంటే ఒక ఒంటె పంపిస్తాను.

    ReplyDelete
  5. అన్నాయ్,
    గుర్రమొక్కటే ఎక్కావ్ అనుకొన్నా, ఒంటెలు కూడా ఎక్కుతున్నావా :)

    ఎందయ్యా SNKR మా అన్నాయిది ఒంటెల లెవెల్ అయితే, గుర్రాలు ఎక్కిస్తున్నావ్?

    సరే కాని అన్నాయ్, హైదరాబాద్ మీద వ్యామోహం తో సమైక్య వాదం అంకొందాం, మరి ఆ వ్యామోహమే లేకపోతే తెలబానులు హైదరాబాద్ కాకుండా మిగతా తెలబాన్ దేశాన్ని ఏ వరంగల్లో రాజధానిగా అడగవచ్చు కందా? కాబట్టి అన్నాయి, అందరి వ్యామోహాలు అక్కడే!!!!

    టాపిక్కు సంబంధిని అడిగినోటికి సమాధానం ఇచ్చే పని మనకు అలవాటు లేదని తెలిసీ అడుగుతున్నానులే, ఏమనుకోమాక :)

    ఇంతకీ ఒంటెలు ఎలా ఉన్నాయ్యి? పైన తలపాగా, కత్తి, డాలు కూడా పట్టుకొని ఎక్కు అన్నాయి, అసలే నీది - - - - చాలా స్థిరమైంది అని SNKR కూడా చెబుతున్నాడు.

    ReplyDelete
  6. Already I said, I won't object if some one nominates Warangal or Hanmakonda as capital of Telangana. But if any one nominates Kakinada or Rajamundry as capital of United Andhra, the samaikyandhra JAC will severe his neck with dagger. Because, the only thing they want is Hyderabad.

    ReplyDelete
  7. డేలస్‌లో గాడిదలు ఉంటాయా? ఉంటే గాడిద మెడలో "Viva United Andhra" అని బోర్డ్ పెట్టి వీధుల్లో తిప్పు.

    ReplyDelete
  8. సరే అన్న్నాయ్, వరంగల్లో, హన్మకొండో తెలబాన్ రాజ్యానికి రాజధాని గా, ఏ రాజ్మండ్రో, ఒంగోలో ఇంకో ప్రాంతానికి రాజధానిగా, హైదరాబాద్ ఉమ్మడి ప్రాంతం గా ఉంటే మీ దొర ఒప్పుకొంటాడా? పోనీ తెలబానులు ఒప్పుకొంటారా? అలా ఒప్పుకొనేటట్లయితే, ఇంక గొడవ ఏముంది, శ్రీక్రిష్ణ కమిటీ చెప్పిన అయిదో ముక్క (ఆరో ముక్క కుదరదు అంటే) దాదాపు అదేగా, మరెందుకు "నీ లాంటి తెలంగాణా వాదులు" ఒప్పుకోవటం లేదు ఆ ముక్కకు? అన్నాయ్ నా దృష్టిలో తెలంగాణా వాదులు/నువ్వు ఒకటే అన్నాయ్!!

    అన్నాయ్ టాపిక్కు మీద మాట్లాడించి నీకు అలవాటు లేని పనిచేసానని కొంచం బాధ పడుతున్నట్లున్నావు, మోకాలికి అమృతాంజనం వ్రాసుకొని పడుకో అన్నాయ్, రాసుకొనే ముందు ఓ చిన్న ముక్క చీకాకులం లాగా డాలాస్ లో గాడిదలు తెల్ల కాలర్ మని చెప్పుకొని తిరగవన్నాయ్!! అది నీకు తెలిసిన విషయమే అనుకో, సైకాలజీ చదువుకొన్నాడివి ఎక్కడ ఏ ఏ జంతువులు ఉంటాయో తెలియదా ఏమిటి :))

    ReplyDelete
  9. నేను చెప్పింది తిరిగి చదువు. ప్రత్యేక కోస్తా ఆంధ్రకి కాదు, సమైక్యాంధ్రకి కాకినాడనో, రాజమండ్రినో రాజధాని చేస్తామంటే సమైక్యాంధ్ర జె‌ఎ‌సివాళ్ళు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టకుండా ఉంటారా?

    ReplyDelete
  10. అన్నాయ్,
    సమైక్యాంద్రా గా ఉంటే ఇంకో సెపరేటు రాజధాని ఎందుకన్నాయ్?
    సరే ఉండాలి సెక్యూరిటీ రీత్యానో, ఇంకో కారణంగానో అంటే సమైక్యాంద్ర అంటున్న వారికి ఎవరకీ అభ్యంతరం ఉండదు ఆ క్రొథ రాజధాని ఎదో కాస్త సెంటర్ గా ఉంటే (ఏ అనంతపురమో, విశాకో కాకుండా), ఎందుకంటే హైదరాబాద్ ఆదాయాన్ని, అభివృద్దిని ఎవరూ కోల్పోవక్కరలేదు కాబట్టి (అది ఉమ్మడి గానే ఉంటుంది కాబట్టి).

    కాకపోతే చీకాకులాన్ని రాజధాని గా చేద్దామంటే కాస్త బ్లాగులతో టచ్ ఉన్నవాళ్లు భయపడవచ్చు అనుకో :))

    ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఉందా తెలంగాణా వాదానికి అసలు సిసలయిన ప్రతినిధిగా నీ దగ్గర? హైదరాబాద్ ను ఉమ్మడి గానే ఉంచి తెలంగాణా తీసుకోవటానికి?
    ఇప్పటికయినా ఒప్పుకొంటావా ఎవరి వ్యామోహమయినా అక్కడే నని?

    సరే కాని, తెలగాణా వాది గా సకల జనుల సమ్మె లో భాగం గా చీకాకులం లో మన కొట్టు కట్టేసావా లేదా?

    ReplyDelete
  11. APGVB ప్రధాన కార్యాలయం వరంగల్‌లోనే ఉంది అన్నాయ్. ఎందుకంటే వరంగల్ ఆంధ్ర ప్రదేశ్‌కి సెంటర్. సచివాలయాన్ని కూడా వరంగల్‌కో, హనుమకొండకో మార్చమంటే మన సమైక్యవాదులు ఒప్పుకుంటారా?

    ReplyDelete
  12. క్రిష్ణ,
    టోపీపెట్టుకుని, గుర్రమెక్కిన విధం చూస్తే అంతర్గతంగా తొక్కిపెట్టబడిన 'ఫ్యూడల్' మనస్తత్వం బుసలు కొడుతూ చూచాయిగా బయట పడటానికి ప్రయత్నిస్తున్నట్టు లేదూ? :P
    అర్థం చేసికోరూ... అంతేనండి బాబూ అంతే! 'మనది' కాకుంటే ... (తాటిపట్టకు ... తుచ్! కాదు) అంతా సామ్యవాదమే!

    ReplyDelete
  13. @snkr,
    దేకే ముడ్డి మనది కాకపోతే ......, నిజమే కదా :))

    అయినా ఒంటెలు మీద మోజు పడింది మా అన్నాయే లెండి, నేను కాదు.

    పెవీణా,

    ముందేమో "సమైక్యాంధ్రకి కాకినాడనో, రాజమండ్రినో రాజధాని చేస్తామంటే సమైక్యాంధ్ర జె‌ఎ‌సివాళ్ళు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టకుండా ఉంటారా?", అని అడిగావ్, ఇప్పుడేమో సచివాలయాన్ని వరంగల్ కు మారిస్తే ఊరుకొంటారా, అని అడుగుతున్నావ్? ఏమిటి సంగతి? అసలు అలా మార్చటానికి గతి తప్పిన మార్కు, లెనిన్ ఉద్యమకారులు ఒప్పుకొంటారా? దీని తరువాత ప్రశ్న సచివాలయాన్ని, అడువలలోకి మారుస్తే ఒప్పుకొంటారా అని అడుగుతావా?

    ఇంతకీ కరడు కట్టిన తెలంగాణావాదివి నీ సమ్మె ఎప్పుడన్నాయ్?

    ReplyDelete
  14. సమైక్యాంధ్రకి కాకినాడనో, రాజమండ్రినో రాజధాని చేస్తామంటే సమైక్యాంధ్ర జె‌ఎ‌సివాళ్ళు వాళ్ళ మెడ మీద నిజంగా కత్తి పెడతారు నాయనా. ఎందుకంటే వాళ్ళకి కావలసినది హైదరాబాద్ ఒక్కటే కదా.

    ReplyDelete