Monday 26 September 2011

తెలంగాణా ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏమిటి ?

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం చిత్తశుద్ధిగా ఎవ్వరూ ప్రయత్నం చెయ్యట్లేదు . దా దాపు అన్ని పార్టీలు అఖిలపక్షంలో అనుకూలంగానే మాట్లాడాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చిదంబరం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించగా రాజకీయ పార్టీల అసలు రంగు బయటపడింది. అప్పటికప్పుడు సీమాంద్ర లో పెల్లుబికిన సమైకాంధ్ర ఉద్యమం ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ జరుగలేదు. తెలంగాణా పై శ్రీ కృష్ణ కమిటీని వేసి ఆ నిరసనకు తెరదించిన వెంటనే తెలంగాణలో కూడా నిరసనలు వెలువెత్తాయి.
బి .జే. పి కేంద్రలో అధికారంలో వుండగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానాల ప్రకారం విభజన జరిగిపోయింది. అయితే ఇక్కడ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మాత్రం ముందుకు సాగడం లేదు. కారణాలు అన్వేషిస్తే మనకు కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తున్నాయి. 

తెలంగాణా ప్రత్యేకంగా కావాలని ప్రజలకు ఎప్పటినుండే  వున్నా వారు సర్దుకుపోతూ వచ్చారు. కోస్త, రాయలసీమ ప్రాంతాల వారితో ఎప్పుడూ విభేదాలు లేవు. అయితే తెలంగాణా సమస్యను ఎప్పుడైతే రాజకీయ పార్టిలు తమ అజెండాగా మార్చుకోన్నాయో అప్పటినుండి ఈ ఉద్యమం వక్ర మార్గం పట్టిందని చెప్పాలి. ఎన్నికలలో ఓట్ల కోసం తెలంగాణా కోసం మాట్లాడటం గెలిచిన తరువాత పట్టించుకున్న పాపాన పోవడం టి. ఆర్. ఎస్ తో పాటు అన్ని పార్టి లు చేశాయి. టి. ఆర్ .ఎస్ అయితే అవసరం వున్నా లేకున్నా రాజీనామాలు చేయడం , మళ్ళి గెలిచి తమ బలాన్ని చాటడం చేసింది. దానికి  సెంటిమెంట్  అనే పేరు పెట్టి పబ్బం గడుపుకుంది . ఒక సారి రాజీనామా చేసిన సీట్లలో కొన్నింట ఓడి పోయి  తన ప్రభావం కోల్పోయే దశకు చేరింది. ఇక్కడే కే. సి. ఆర్ . మళ్ళి తన బుర్ర కు పదును పెట్టి నిరాహార దేక్షకు కూర్చుని అగ్గి రాజేసాడు. దాంతో అన్ని పార్టిలు అనుకూలంగా చెప్పినా  సీమాంద్ర వ్యతిరేకత చూసి రెండు నాల్కల, రెండు కళ్ళ సిద్దాంతాలను తెరపైకి తీసుకు వచ్చి ప్రజల మధ్య పెద్ద చీలికకు కారణమవుతున్నాయి. 

తెలంగాణా ఇచ్చినా తమకు ఏమిటి లాభం అని కాంగ్రెస్, టి.డి.పి. లు ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో మారిన పరిస్తితులలో విభజన అనేది ఇంకా వైషమ్యాలను పెంచుతుందే గాని తుంచదు. పాకిస్తాన్ విడిపోతే సమస్య పరిష్కారం కాలేదు సరి కదా పెరిగింది . ఒక రాష్ట్ర విభజన జరిగినా రెండు ప్రాంతాల ఏకాభిప్రాయం తీసుకొని ఎలాంటి స్వంత పేరు, పట్టు , భేషజాలకు పోకుండా చేయవలసిన అవసరం వుంది. ముందుగా రాజకీయ పార్టి లు వారి పార్టీలో ఒక అభిప్రాయానికి కృషి చేయాలి. ఒక నిర్దిష్ట సమయంలో అటో ఇటో తెలిస్తే అందరు ప్రజలు సంతోస పడుతారు. ప్రజలు రాజకీయ పార్టీ ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారకుండా సామరశ్యంగా సమస్య పరిష్కారం చేసుకోవలసిన అవసరం వుంది.

No comments:

Post a Comment