Tuesday 6 September 2011

ఎవరూ సంతోషంగా లేరు ..


సాధారణంగా చూస్తే అధికార పక్షం బలంగా లేక పొతే ప్రతిపక్షం బలంగా వున్నట్టు మనం అనుకోవచ్చు. మన రాష్ట్రంలో చూస్తే పరిస్తితి అందుకు భిన్నంగా వుంది. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి , జగన్ పార్టీ నుండి విడిపోయి బలహీనంగా వుంది. మరో ప్రక్క ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో కలిపినా తరువాత చిరంజీవి ప్రధాన శక్తీ గా ఎదగాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు . అందులో బాగంగానే ప్రత్యేక ఆఫీసు , టీవీ ఛానల్ ప్రారంభం చేసే ప్రయత్నాలలో వున్నారు. కోస్త ఆంధ్ర లో బలమైన సామాజిక వర్గం కలిగిన బొత్స సరే సరే .. పార్టీ లో  తనకంటూ ఓ  గుర్తింపు , పట్టు కోసం ప్రయత్నం చేస్తూ వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కి సి యం అయిన ఆనందం కన్నా సమస్యలే ఎక్కువ. అదే సమయంలో తెలుగు దేశం బలంగా వుంది అని చెప్పడానికి వీలులేని పరిస్తితి
తెలంగాణలో ఆ పార్టీ కేడర్ బాగున్నా అనుకూలంగా , ప్రతికూలంగా మాట్లాడలేక రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తోంది . అక్కడ టి ఆర్ ఎస్ తో పొసగడం లేదు . అదే సమయంలో సీమ , ఆంధ్ర ప్రాంతాలలో జగన్ ప్రభావం అంతో ఇంతో వుంది. వెరసి తెలుగు దేశం బలంగా వుందని చెప్పలేని స్తితి నెలకొనివుంది. 
కడప ఉప ఎన్నికలలో ప్రభావం చూపిన జగన్ ప్రభుత్వాని పడగోట్టాలనుకొని బంగపడ్డారు. సి బి ఐ కేసులలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయనకు  అవినీతి పెద్ద ప్రతిబంధకం అవుతోంది . టి ఆర్ ఎస్ పరిస్తితి కూడా అంటే తెలంగాణా వస్తుంది  అంటూ ఉద్యమాలతోనే కాలం వెల్లబుచ్చుతోంది. ఎవరూ సంతోషంగా లేని రాష్ట్ర రాజకీయం రాన్నున్న రోజులలో మరింత ఆసక్తి కరంగా మారనుందని చెప్పవచ్చు.


No comments:

Post a Comment