Friday 25 November 2011

అవిశ్వాస తీర్మానాన్ని ఆత్మ విశ్వాసంతోఎదుర్కోనున్న కిరణ్

 
 
 
 
 
కిరణ్ కుమార్ ప్రభుత్వం పై  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలుగుదేశం ప్రకటించినా కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఇదివరకు వున్నటు వంటి భయాలు ఏమిలేవనే చెప్పాలి. ఏడాది పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం మొదట్లో పురిటి కష్టాలు పది క్రమేపి నిలదొక్కుకున్నది.  ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలుగు దేశం చేస్తున్న మరో తప్పిదమే అవుతుంది. కిరణ్ ముఖ్య మంత్రిగా పదవి చేప్పటినప్పుడు తీవ్రంగా ఉందనుకున్న తెలంగాణా ఉద్యమం సకల జనుల సమ్మె తరువాత మునుపటి జోరు తగ్గిందనే చెప్పాలి . అలాగే ప్రభుత్వాని పడగోడుతామని తొడగోట్టిన జగన్ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఆత్మరక్షణలో పడిపోయారు. జగన్ ప్రక్క వెళ్ళిన ఎం. ఎల్ . ఏలు  ఊగిసలాటలో వున్నారు . వారు కాంగ్రెస్ కె మద్దతు ఇచ్చే అవకాసం  వుంది. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ప్రభుత్వం పడిపోవడం మాట అటుంచి కిరణ్ సర్కార్ పూర్తి స్థాయి ప్రభుత్వంగా మారి ఆయనను బలపదేటట్టు చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరో ప్రక్క చంద్ర బాబు పై సి.బి. ఐ. విచారణ కూడా జరగబోతోంది. కిరణ్ కు కాలం కలసి వస్తోంది. ప్రజలలో మెల్లగా సి. ఎం. గా అంగీకరించే పరిస్తితి  ఏర్పదబోతోండానే చెప్పవచ్చు.

Wednesday 23 November 2011

చంద్ర బాబు బృందానికి ఊరట ..


వై. ఎస్ . విజయమ్మ వేసిన పిటిషన్ పై సి. బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఆదేశించే ముందు సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని, తమ వాదనలు వినలేదని సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన చంద్ర బాబు బృందానికి ఊరట లబించింది. 15 రోజుల లోపు హై కోర్ట్ లో తమ వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కేసు పూర్వ పరాలు హై కోర్ట్ పరిధిలో ఉన్నందున అక్కడే వాదనలు వినిపించుకోవాలని స్పష్టం చేసింది. విచారణ పై స్టే ఇవ్వక పోయినా తమ వాదనలు వినిపించేందుకు కోర్ట్ సమ్మతించడం వల్ల చంద్ర బాబు బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సరికే ఈ.డి చంద్ర బాబు కు కేసు విచారణకు సంభందించి వివరాలు అందజేయాలని నోటీసు కూడా అందచేసింది. రేపో మాపో సి.బి.ఐ విచారణకు రంగం సిద్ధం చేసుకొని వుంది.

Friday 18 November 2011

వై. ఎస్. ఆర్ పార్టి ముఖ్య మంత్రి అభ్యర్థి విజయమ్మ ?


జగన్ సి. బి. ఐ  కేసులలో ఇరుక్కోవడంతో వై. ఎస్. ఆర్ పార్టి ముఖ్య మంత్రి అభ్యర్థిగా విజయమ్మ ను ప్రతిపాదించాలని ఆలోచిస్తున్నారు. విజయమ్మ కు వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కలసి వస్తుందని అలాగే క్లీన్ ఇమేజ్ దోహదపడుతుందని, మహిళా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎం.ఎల్.ఎ గా ఎన్నికయినా ఒక్క సందర్బంలోనూ మాట్లాడని విజయమ్మ పార్టీని ఎలా నడుపుతుందో చూడాలి

నాయకుడిగా జగన్ విపలం : దివాకర్ రెడ్డి




వై.ఎస్. ఆర్ పార్టి నాయకుడు జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఆయన నాయకుడిగా విఫలం చెందారని కాంగ్రెస్ నాయకుడు దివాకర్ రెడ్డి అంటున్నారు. వై. ఎస్ ఆర్ కుమారుడిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను అభిమానించినా జగన్ తన తప్పిదాలతోనే జగన్ పరిస్థితి ఎలా తయారయిందని , కాంగ్రెస్ ఆదిస్థానం అంటే ఏమిటో జగన్ కు తెలిసి వచ్చిందని దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ వైపు వెళ్ళిన ఎం. ఎల్. ఎ లు అందరు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని ధీమా వ్యక్తం చేసారు.

Thursday 17 November 2011

త్వరలో చిరంజీవి కి కేంద్ర కేబినేట్ పదవి !


మార్పు కోసం ప్రజా రాజ్యం పార్టి స్థాపించి ఎన్నికలలో ముఖ్య మంత్రిగా ఎన్నికవ్వాలన్న బలమైన కోరికతో దిగి
18 సీట్లతో సరిపెట్టుకొన్న చిరంజీవి ఎట్టకేలకు కేంద్ర మంత్రి కాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజారిటీ తో వుంది. జగన్ దెబ్బకు బయపడిన ఆదిస్థానం చిరంజీవిని దగ్గరకు తీసుకుంది. చిరంజీవి మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాకుండా నిలబడిందనే చెప్పవచ్చు. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వీలీనం అయినప్పటికీ చిరంజీవి వర్గానికి తగిన ప్రాధ్యానత లబించలేదు. ఎట్టకేలకు సోనియా పిలిచి పదవి హామీ ఇవ్వడంతో చిరంజీవి చాల హ్యాపీ గా వున్నారు.

సుప్రీం కోర్ట్ స్టే కు చంద్ర బాబు యత్నం





తెలుగు దేశం అధినేత సి.బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల స్టే కోసం సుప్రీం కోర్ట్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వున్నా పరిస్తితులలో విచారణ జరిగితే కాంగ్రెస్ తమను బంతాట ఆదుకుంటుందని తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. స్టే కోసం చంద్ర బాబు తనంతట తానూ ప్రయత్నిచడం లేదనే విధమైన భావన ఏర్పరచి , పార్టి నిర్ణయం మేరకే స్టే వెళుతున్నట్టు ప్రకటించబోతున్నారు. సుప్రీం కోర్ట్ లో చుక్క ఎదురైనా , స్టే వచ్చిన ఇప్పుడున్న పరిస్తితికి మించి దిగాజారక పోవచ్చు. ఒక వేళ సి. బి. ఐ. విచారణ జరిగితే చిన్న లోపాలు, తప్పులున్నా అవి పెద్దవి కావొచ్చని అప్పుడు పార్టి మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చని అంటున్నారు. చంద్ర బాబు సచ్చీలుడుగా భయటపడితే ఆ పార్టి పై వేరొకరు బురద జల్లేది వుండదు. ఇలా జరిగితే వచ్చే ఎన్నికలలో విజయం నల్లేరు పై నడక అవుతుంది . తద్విర్డుంగా జరిగితే మొదటికే మోసమని పార్టి వర్గాలు అంచాన వేస్తున్నాయి.  చంద్ర బాబు తో పాటు విచారణ ఎదుర్కోనున్న రామోజీ రావు , మురళి మోహన్ తదితరులు కూడా స్టే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తెలిసి తెలిసి పులి నోట్లో తల పెట్టడానికి చంద్ర బాబు తెగించక పోవచ్చు.





Wednesday 16 November 2011

చంద్ర బాబు పై సి.బి.ఐ కేసుతో జగన్ కు కష్టకాలం ...



వై. ఎస్. ఆర్ పార్టి తరపున విజయమ్మ చంద్ర బాబు అక్రమ ఆస్తుల విషయమై వేసిన పిటిషన్ పై సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం విదితమే . అయితే ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కాంగ్రెస్ ఇక జగన్ పై అరెస్ట్ వేటు వేయనుంది. ఇన్నాళ్ళు జగన్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు అనే సెంటిమెంట్ ఎక్కడ వ్యతిరేకంగా పనిచేస్తే జగన్ కు ప్లుస్ అవుతుందని భావించిన కాంగ్రెస్ సి.బి.ఐ ద్వారా ఇక జగన్ అరెస్ట్ కు సిద్ధం అవుతున్నట్టు భావిస్తున్నారు . ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జగన్ అరెస్ట్ కాగానే, చంద్ర బాబు పై విచారణ వేగం పెంచి కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడతో పాటు వచ్చే ఎన్నికలలో లబ్ది పాడాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చంద్ర బాబు లాంటి నాయకుడిపైననే విచారణ జరుగుతుందంటే .. జగన్ విషయం కూడా తమకు ఎలాంటి సెంటిమెంట్ వర్క్ కాదని కాంగ్రెస్ నమ్ముతోంది. ఒక వేళ జగన్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశం మ్యాచ్ పిక్సింగ్ జరిగింది  అనుకుంటే చంద్ర బాబు నిర్దోషిగా బయట పడుతాడు. జగన్ గాలి జానార్ధాన్ రెడ్డి లా జైలు పాలు అవుతాడని కొన్ని వర్గాలు అంటున్నాయి. రాబోయే మూడు నెలలలోనే చంద్ర బాబు భవిష్యత్తు తేలనుంది. అయితే చంద్ర బాబు సుప్రేం కోర్ట్ నుండి స్టే తెచ్చుకొనే అవకాశాలు వున్నాయి. ఏది జరిగినా , ఎటు నుండి వెళ్లినా తన వైపు వున్నా ఎం. ఎల్. ఏ లు కూడా కాంగేస్స్ లో చేరిపోతే జగన్ ఒంటరిగా మిగలడం , జైలు పాలు కావడం తప్పదేమో.. కాంగ్రెస్ పాచికలు ఎప్పుడూ అంతగా ఎవ్వరికీ అర్థం కావు.

Tuesday 15 November 2011

రాటుదేలిన రాజకీయ చాణిక్యం

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలలో వూహ్య, ప్రతి వూహ్యలతో రాజకీయం రాటుదేలిపోయింది. స్వపక్షంలో ఉంటూ విమర్శలు చేయడం .. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడడం అనే కొంత కోణాలు ఎన్నడూ లేనిది చూస్తున్నాము. స్థూలంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం కు ముందు ,ఆ తరువాత రెండు రకాలుగా విభాజిచుకుని పరిశీలించవలసి వుంది. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కాంగ్రెస్ పార్టి బలం అసెంబ్లీ లో తగ్గిన ఏ మాత్రం నిర్ణయాల స్పీడు తగ్గలేదు. రాజశేఖర్ రెడ్డి ఒనె మాన్ షో తో అంత ప్రశాంతత కనిపించింది. గుప్తంగా దాగున్న తెలంగాణా సమస్య వుండినా ఆయన తగిన రీతిలో వాటిని కంట్రోల్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంగా వుండిన తెలుగుదేశం వై. ఎస్. ఆర్ పై పోరును చేస్తూ కాలం గడుపుతూ వచ్చేది. టి.ఆర్. ఎస్. ఉప ఎన్నికలలలో పోటీ చేసి వున్నా సీట్లు కూడా పోగొట్టుకున్న పరిస్తితి వుండేది. ఎప్పుడైతే వై. ఎస్. ఆర్  మృతి చెందారో అంత వరకు తొక్కిపట్టిన సమస్యలు తెరపైకి వచ్చి వీర విజ్రుమ్బాన చేస్తున్నాయి. అందులో నాయకత్వ సమస్య .. కాంగ్రెస్ పార్టి ముఖ్యమంత్రిగా ఇక అయిపోవచ్చు అని కలలు కన్నా జగన్ కు ఎం. ఎల్. ఏ. ల బలం వున్నా ఆదిస్థానం మొండిచేయి చూపి రోశయ్య ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో పార్టీలో ఇమడలేక ఓదార్పు యాత్ర పేరుతొ తన ఉనికిని చాటుతూ జగన్ జనంలో తిరుగుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా మారాడు. అయినా కాంగ్రెస్ ఎతులకు పై ఎతులు వేసి జగన్ తనంతట తానే పార్టీని వదిలిపెట్టేలా చేసింది. దీంతో జగన్ కొత్తగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు తన చెప్పు చేతలలో నడిపిన కుటుంబం నుండి పార్టి ని కాపాడుకోవలసిన స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి ముందుకు వెళుతోంది. ఏ నేపథ్యంలో అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టి ని ఏర్పాటు చేసారో అది మరిచి కాంగ్రెస్ పత్రిలో కలిసి పోయి జగన్ నుండి కాంగ్రెస్ కు రక్షణ కల్పిస్తున్నారు. దీంట్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు వున్నా రాజకీయ భవిస్యత్తు కోసం ప్రానాలికలు వేసుకొంటున్నారు. అలాగే పి.సి.సి.చీప్ గా   ఎంపికైన బొత్స  ఒక దశలో ముఖ్య మంత్రి కిరణ్ ను కాదని ముందుకు పోవాలని ప్రయన్తించారు .  ఈ మధ్యలో ప్రతిపక్షంగా కీలకపాత్ర పోషించాలిసిన తెలుగుదేశం వెంటనే ఎన్నికలు వస్తే కష్టమని ప్రభుత్వాన్ని కాపాడుతోందని విమర్శలు మూటగట్టుకోన్నదని  చెప్పవచ్చు . చంద్ర బాబు నాయిడు రతుల కోసం నిరాహార దీక్ష , రైతు పోరుబాట  ఆయనకు కలసి వచ్చింది . అయితే జగన్  సి.బి. ఐ కేసులలో ఇర్రుక్కోవడం తెలుగుదేసంకు లాబించిన అంశంగా అనుకొనే అంతలోనే చంద్ర బాబు పై హై కోర్ట్ విచారణకు సి.బి. ఐ విచారణకు ఆదేశించడం తో ఈ పార్టి పరిస్తితి మొదటికి వచ్చింది . 
 
ఇక రెండో అశం తెలంగాణా కూడా కొలికి వచ్చినట్టే వచ్చి వెనక్కు పోతోంది. కే.సి.ఆర్ దీక్షతో దిగి వచ్చిన కేంద్ర తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నాటు ప్రకటించింది. యింతే సీమంద్రలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తన నిర్ణయం మార్చుకొని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది . ఆ కమిటీ నివేదిక సమైకంద్ర కు అనుకూలంగా రావడంతో మళ్ళే తెలంగాణా లో సకల జనుల సమ్మె జరిగి దాదాపు ప్రజా జీవితం స్తంబించేలా ఉద్యమాలు జరిగాయి. అయితే ఉన్నట్టుండి చప్పున చల్లారి పోయింది. దీనికి పోలవరం టెండర్లకు లింక్ వుందని తెలుగుదేశం ఆరోపించింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేక కింద పైనా పడుతూ వుంటే  ప్రధాని మన్మోహన్ తెలంగాణా ప్రస్తుత పరిస్తితులలో ఇవ్వడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టారు.
 
ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టి పెంచి పోషిస్తోంది. భవిషత్తులో ఏమి జరుగుతోంది అని చెప్పలేకపోట్టునాము . అయితే ఈ రెండు సమస్యలే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పవచ్చు .

ఎం. పి. ల రాజీనామలూ తిరస్కరణ


తెలంగాణా ఉద్యమంలో భాగంగా రాజీనామా సమర్పించిన రాష్ట్ర ఎం. పి. ల రాజీనామాలు తిరస్కరిస్తూ లోకసభ స్పీకర్ మీరా కుమారి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, టి. డి. పి. , తెలంగాణా రాష్ట్ర సమితి కి చెందిన ఎం.పి.లు మూకుమ్మడిగా సమర్పించిన రాజీనామాలు భావోద్రేకంతో చేసినందున తిరస్కరిస్తున్నట్టు తెలిపారు . ఈ నిర్ణయం వెలువడక ముందే తమ రాజీనామాలు ఆమోదించనందున తాము రాబోయే పార్లమెంట్ సమావేశాలకు హాజరై తెలంగాణా పై పోరాటం చేయనున్నట్టు టి. ఆర్. ఎస్ చెప్పడం కొసమెరుపు.  రాష్ట్ర రాజకీయాలలో రాజీనామాలు చేయడం అవి ఆమోదం పొందకపోవడం ఇటీవల సర్వ సాధారణ విషయం అయిపొయింది.  

Monday 14 November 2011

చంద్ర బాబు కు అనుకోని ఎదురు దెబ్బ

 
 
 
తెలుగు దేశం పార్టి చంద్ర బాబు నాయిడుకు సి.బి. ఐ విచారణను ఎదురుకోవడం అనుకోని ఎదురు దెబ్బ. వై. ఎస్. విజయమ్మ కోర్ట్ కు వెళితే కోర్ట్ సి.బి. ఐ విచారణకు అదేశాలిస్తుందని అనుకున్నట్లు లేదు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు, రామోజీ రావు ఈ కేసులో విచారణను ఎదుర్కోవడం అంటే కత్తి మీద సామే. ఏ చిన్న తప్పు దొరికినా రాజకీయంగా పెద్ద నష్టమే జరుగుతుంది. గతంలో వై. ఎస్. ఆర్ తన పై ఛాలా విచారణలు జరిపించినారని , ఏ ఆరోపణలు నిరూపించలేక పోయారని , వాటినే తిరిగి కోర్టులో పిటీషన్ వేయడం వల్ల పెద్దగ నష్టం లేదని . తమ నేత నిజాయితీ పరుడుగా బయటపడి ఇంకా బలం పున్జుకున్తారని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. అయితే ఇంతకు మునుపు విచారణకు ఇప్పటి విచారణకు తేడా కచ్చితంగా వుంటుంది. సి.బి. ఐ ఇప్పుడు ఎంతటి నాయకుడైనా దూకుడుగా దూసుకుపోతోంది. చంద్ర బాబు మరో పరీక్ష ఎదుర్కొ పోతున్నారు.

జగన్ గూటి నుండి జారి పోనున్న ఎం. ఎల్.ఏ లు

 
కాంగ్రెస్ పార్టి నుండి జగన్ వేరుపడి కొత్తగా ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి తో జత కట్టి తిరుగుతున్న కాంగ్రెస్ ఎం.ఎల్. ఏ లు ఒక్కక్కరే తిరిగి స్వంత గూటికి చేరుకోవడానికి సమయం కోసం వేచి వున్నారు. జగన్ ఓదార్పు యాత్రల్లో పాల్గొని అధిష్టానం వద్దన్నా వీర విదేయత చూపిన వీరంతా మారిన రాజకీయ పరిస్తితులలో వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు సి.బి. ఐ. ఎఫ్. ఐ. ఆర్ లో చేర్చడం పై కినుక వహించి జగన్ ఆదేశాల మేరకు తమ ఎం. ఎల్. ఏ ల పదవులకు అలాగే కాంగ్రెస్ పార్టి సబ్యాత్వానికి రాజీనామాలు చేశారు . అయితే జగన్ పై సి. బి. ఐ  విచారణలో కొత్త విషయాలు బయటపడడం , గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడి పరిస్తితి చూసి జగన్ జైలుకు వెళితే వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి భావిస్యతు తో పాటు తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని బావిస్తున్నారు. రాజీనామాలను విచారించడానికి స్పీకర్ పిలిస్తే వీరంతా రాజీనామాలను వెనక్కు తీసుకొనే అవకాసం కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్తితులలలో రాజీనామాలు ఆమోదింప చేసుకొని ఎన్నికలలో నిలబడటం అంత మంచి నిర్ణయం కాదని అనుకుంటున్నట్టు భోగట్ట.  జగన్ ఎం. ఎల్. ఏ లలో 90 శాతం జారిపోనున్నట్టు తెలుస్తోంది.

చంద్ర బాబు పై సి.బి. ఐ ప్రాథమిక విచారణకు హైకోర్ట్ ఆదేశాలు



తెలుగుదేశం పార్టి అధ్యక్ష్యుడు నారా చంద్రబాబు నాయుడు  తో సహా మరో 13 మంది ఆస్తులపై  ప్రాథమిక విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్ట్ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటీషన్ ను విచారించిన ధర్మాసనం మూడు నెలలలోపు ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించడం జరిగింది. ఇదివరకే జగన్ పై జరుగుతున్నా విచారణపై  అక్కసుతోనే వై.ఎస్.ఆర్ పార్టి వారు పిటీషన్ వేశారని తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తో పాటు సిని నటుడు మురళి మోహన్, సుజన చౌదరి, నామ నాగేశ్వర రావు  మరియు నారా చంద్ర బాబు కుటుంబ సభ్యులు ఈ కేసును ఎదుర్కోవలసి వుంటుంది. ఇప్పుడు చంద్రబాబు స్టే తెచ్చుకున్న చెడ్డ పేరు వస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టి వారు సి. బి. ఐ. విచారణను స్వాగాతిస్తున్నట్టే మాట్లాడుతున్నారు. చంద్ర బాబు ఏదైనా అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలితే పూర్తి స్థాయి విచారణకు హై కోర్ట్ ఆదేశించే అవకాశం వుంది. అదే జరిగితే ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్న కేసుల గొడవ చంద్ర బాబుకు తప్పవు. ప్రాథమిక విచారణలో నిర్దోషిగా తేలితే అదొక సర్టిఫికేట్ లా ఉపయోగపడి ఆయనకు రాజకీయంగా లాబించవచ్చు. సందిట్లో  సదేమియాగా కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.

Friday 11 November 2011

కాంగ్రెస్ గూటిలోనే జయసుధ ..జగన్ జలక్ ఇవ్వనున్న సహజనటి







వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభిచిన సిని నటి జయసుధ ఇప్పుడు నిజజీవితంలో నటించలేక పోతున్నారు. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆమె జగన్ వైపు నిలిచారు. జగన్ పెట్టిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ గా కొనసాగలేక తెలంగాణా ఉద్యమం పేరుతొ రాజీనామా చేసారు , జగన్ అవినీతి కేసుల్లో వై. ఎస్. ఆర్ పేరు చేర్చినందుకు నిరసన తెలిపారు కూడా. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో జగన్ చుట్టూ సి. బి. ఐ. కేసుల ఉచ్చు బిగిస్తుండడంతో ఏమి చేయాలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. రంగా రెడ్డి  జిల్లాలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేసారు. వై. ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ పథకం తనను ఎంతగా ఆకర్శించిందో అంతగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం ఆకర్షించిందని రచ్చబండ బహిరంగ సభలో పొగిడారు. చూస్తుంటే జగన్ కు జయసుధ జలక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల సమాచారం .

Thursday 10 November 2011

ఎట్టకేలకు తెలంగాణాలో విజయవంతంగా చంద్ర బాబు పాదయాత్ర


రైతులకోసం చంద్ర బాబు చేపట్టిన పాదయాత్ర ఎట్టకేలకు తెలంగాణలో కూడా విజయవంతం అవుతోంది. ఇప్పటికే ఆయన రాయలసీమలోని అనంతపురం , కర్నూలు, కడప జిల్లాలు , ప్రకాశం జిల్లాలోనూ విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేసుకొని తెలంగాణలో అడుగుపెట్టారు. రైతులు కష్టాల్లో వున్నా ఈ సమయంలో చేపట్టిన పాదయాత్ర చంద్ర బాబుకు కలసి వస్తోంది. ఖమ్మం , నల్గొండ జిల్లాలో జరిగిన పాదయాత్రలో పార్టి కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొన్నారని, రైతులు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని పార్టి వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఇంతవరకు బాబు సభలకు అడ్డుపడే టి. ఆర్. ఎస్. ఈ సారి ఎందుకో అడ్డుపడడం లేదు.  ఇటీవల తెలంగాణా ఉద్యమ సెగలు బాబును ఉక్కిరిబిక్కిరి చేసాయి. అయినా ఆయన రెండుకళ్ళ సిద్ధాంతాన్ని టి.ఆర్.ఎస్ తో పాటు కాంగ్రెస్ వాళ్ళు తూర్పారబట్టారు. అయితే ఈ పర్యటనతో ప్రజలతో మమేకం కావడం , రైతులకు దగ్గర కావడంతో పాటు తెలంగాణలో కూడా తమ పార్టి కు పట్టు వుందని తెలుగుదేశం కేడెర్ నిరూపించుకున్నట్టే.

Monday 7 November 2011

తుస్సుమన్న జగన్ ఎత్తుగడ !

గాలి జనార్ధన్ రెడ్డి కేసులో తనను విచారిస్తారని జగన్ ఏనాడు ఊహించలేదు . ఉన్నట్టుండి సి. బి. ఐ. నుండి పిలుపు రావడంతో తన పైన ఎక్కడ గాలి అవినీతి మారక పడుతుందేమో నని ఆయన తెలివిగా సి.బి.ఐ. ఆఫీసు నుండి బయటకు రాగానే చంద్ర బాబు పై విరుచుకు పడ్డారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి చంద్ర బాబు తను ముఖ్య మంత్రిగా వున్నప్పుర్డు 2002 లోనే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని దీంట్లో తన తండ్రి పాత్ర లేదని , తనను సి.బి. ఐ. సాక్షిగానే పిలిచిందని , ఏ కేసులో చంద్రబాబు ను ఎందుకు విచారించరని   సి.బి.ఐ ని ప్రశ్నించినట్టు తెలిపారు. దీంతో జగన్ ను సి.బి. ఐ విచారించిన వార్తల కన్నా చంద్ర బాబు ఇచ్చిన జి. ఓ పై ఆయనను ఎందుకు విచారించకూడదో  అన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత  పెరిగింది.
అయితే రాజకీయాలలో అన్ని రకాలు చూసిన చంద్ర బాబు తాము ఇదివరకే విడుదల చేసిన మైనింగ్ మాపియా బుక్ లోని కాపీ నే ఫొటోస్టాట్ తీసి మాపైననే ఆరోపణలు చేయడం దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు వుందని అన్నారు. పైగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి కోర్ట్ ఆదేశాల మేరకు జి.ఓ ఇచ్చామని  జి.ఓ ఇచ్చినప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆ కంపెనీలో లేరని
సాక్ష్యాలతో బయట పేట్టే సరికి జగన్ చేసిన ఆరోపణలు తుస్సుమన్నాయి. ఒక విషయం పై ఆరోపణ చేస్తున్నప్పుడు అన్ని చూసుకొని ఆరోపణ చేయాలి. విషయం పై అవగాహన వుండాలని జగన్ ఇక నైన నేర్చుకుంటాడని ఆశిద్దాం .

Thursday 3 November 2011

పదవిపై చిగురిస్తున్న చిరంజీవి ఆశలు ...






ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసిన తరువాత  రాష్ట్ర స్థాయి ముఖ్య నేతగా గుర్తింపు సంపాదించుకుంటున్న తిరుపతి ఎం. ఎల్ . ఎ . చిరంజీవి కి పదవి లబిస్తుందనే ఆశలు మళ్లీ చిగురించాయి. తెలంగాణా సమస్య తగ్గు ముఖం పట్టడం, జగన్ కేసులలో ఉక్కిరి బిక్కిరి కావడంతో .. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన మాటను ఆదిస్థానం నిలబెట్టుకుంటుందని ఆయన విధేయత ప్రకటిస్తున్నారు . చిరంజీవికి జన బలం వుందని నమ్ముతున్న కాంగ్రెస్ ఆదిస్థానం ఆయనకు మంచి పదవినే ఇవ్వనున్నట్టు తెలిసిది. అయితే చిరంజీవిని నమ్ముకొని కాంగ్రెస్ లో చేరిన వారికి మొండి చెయ్యే అని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టి పేరుతొ మార్పు ప్రజలకు అందలేదు కాని చిరంజీవికి మాత్రం ఉపయోగ పడుతోంది. రాష్ట్ర మంత్రిగా ఇచ్చిన చేస్తానని కూడా చిరంజీవి అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి లక్ష్యం చేరుకోవాలంటే రాష్ట్రంలో ఏదో ఒక పదవి అన్దాలిసిన అవసరం వుందని ఆయన అభిమానులు అంటున్నారు.

రైతు పోరుబాట గా చంద్రబాబు పాదయాత్ర




 
ఎక్కడ పోగొట్టుకున్నామో .. అక్కడే వెతకాలని సామెత . చంద్ర బాబు అదే చేస్తునారు. తెలుగు దేశం అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు బుధవారం అనంత పురం జిల్లా నుండి రైతు పోరుబాట పేరుతొ పాద యాత్ర మొదలు పెట్టారు.  దూరమైనా రైతులకు దగ్గరవుతూ పార్టి ప్రతిస్తా కోసం చేప్పటిన ఈ పాదయాత్ర  అప్పుడే అధికారపక్షం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి . రైతుకు గిట్టు బాటు ధర తో పాటు వివిధ అంశాలపై గతంలోనే చంద్ర బాబు నిరాహార దీక్ష చేప్పట్టిన విషయం విదితమే. అయితే ఇటీవల వర్షాలు కురవక కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ వర్షంతో పంటలు పడి కొన్ని ప్రాంతాలలో రైతులు రాష్ట్ర వ్యాపితంగా నష్టపోయారు. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టి కి మొదటి నుండి అండగా వున్న అనంతపురం ను ఎంపిక చేసుకోవడం విశేషం . అనంతపురం  దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుపొందింది. ఈ పాద యాత్రలో భాగంగా చంద్ర బాబు రోజుకి 15 కి.మీ దూరం నడుస్తునారు. ఈ విధంగా 20 రోజుల పాటు జరిగే సుదీర్గ యాత్ర రైతులలో ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంచవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

గాలి కేసులో జగన్ ను విచారించనున్న సి. బి.ఐ

అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన గాలి జనార్ధన రెడ్డి కేసు విచారణలో భాగంగా వై.ఎస్. ఆర్ పార్టి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని సి.బి. ఐ. విచారించనుంది. రెడ్ గోల్డ్, ఆర్.ఆర్. గ్లోబల్ సంస్థల పెట్టుబడులు సాక్షిలో వున్నాయని , గాలి అక్రమ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయా లేవా అని విచారించనున్నట్టు తెలిసింది. జగన్ ను ఈ నెల 4 వ తేది హైదరాబాద్ లోని కోటి సి.బి.ఐ. అపిస్ కు రావాలని ఆదేశాలు ఇచ్చింది.  అయితే రాజకీయ వర్గాల అభిప్రాయం మేరకు జగన్ ను గాలి కేసులో విచారణ నిమిత్తం సి.బి.ఐ తన ముందుకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే అక్రమ ఆస్తులు కలిగి వున్నా కేసులో విచారణ ఎదుర్కొటున్న జగన్ కు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. జగన్ కేసులో విచారణ మందకొడిగా సాగుతోందని , జగన్ కాంగ్రెస్ తో కుమ్ముక్కు అయ్యారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సి.బి. ఐ. గట్టి నిర్ణయం తీసుకొండానే చెప్పాలి .

Tuesday 1 November 2011

కోమటిరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష

 
తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామాచేసి పోరాడుతున్న కాంగ్రెస్ నల్గొండ నాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణా వచ్చే వరకు తన దీక్ష ఆగదని మరో సారి అన్నారు.  తెలంగాణా కు చెందినా వివిధ పార్టీల నాయకులు సంఘీభావం  తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా దీక్ష చెప్పట్టడం విశేషం . రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స చివరి నిమిషం వరకు నిరాహార దీక్షను వాయిదా వేసుకోమని కోరినా కోమటిరెడ్డి వినలేదని తెలిసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా ఉద్యమాన్ని ప్రతిష్ట పరిచి తెలంగాణా సాధనకోసం ఆయన పూనుకున్నట్టు అంటున్నారు. అయితే జగన్ వై. ఎస్. ఆర్. పార్టీ సహాయ సహకారాలతోనే కోమటి రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీ కి బేస్ కోసం ఇప్పటినుండి కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వున్నాయి. ఆయన నిరాహార డిక్ష ఎలాంటి పలితాలు ఇస్తుందో వేచి చూడాలి