Monday 7 November 2011

తుస్సుమన్న జగన్ ఎత్తుగడ !

గాలి జనార్ధన్ రెడ్డి కేసులో తనను విచారిస్తారని జగన్ ఏనాడు ఊహించలేదు . ఉన్నట్టుండి సి. బి. ఐ. నుండి పిలుపు రావడంతో తన పైన ఎక్కడ గాలి అవినీతి మారక పడుతుందేమో నని ఆయన తెలివిగా సి.బి.ఐ. ఆఫీసు నుండి బయటకు రాగానే చంద్ర బాబు పై విరుచుకు పడ్డారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి చంద్ర బాబు తను ముఖ్య మంత్రిగా వున్నప్పుర్డు 2002 లోనే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని దీంట్లో తన తండ్రి పాత్ర లేదని , తనను సి.బి. ఐ. సాక్షిగానే పిలిచిందని , ఏ కేసులో చంద్రబాబు ను ఎందుకు విచారించరని   సి.బి.ఐ ని ప్రశ్నించినట్టు తెలిపారు. దీంతో జగన్ ను సి.బి. ఐ విచారించిన వార్తల కన్నా చంద్ర బాబు ఇచ్చిన జి. ఓ పై ఆయనను ఎందుకు విచారించకూడదో  అన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత  పెరిగింది.
అయితే రాజకీయాలలో అన్ని రకాలు చూసిన చంద్ర బాబు తాము ఇదివరకే విడుదల చేసిన మైనింగ్ మాపియా బుక్ లోని కాపీ నే ఫొటోస్టాట్ తీసి మాపైననే ఆరోపణలు చేయడం దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు వుందని అన్నారు. పైగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి కోర్ట్ ఆదేశాల మేరకు జి.ఓ ఇచ్చామని  జి.ఓ ఇచ్చినప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆ కంపెనీలో లేరని
సాక్ష్యాలతో బయట పేట్టే సరికి జగన్ చేసిన ఆరోపణలు తుస్సుమన్నాయి. ఒక విషయం పై ఆరోపణ చేస్తున్నప్పుడు అన్ని చూసుకొని ఆరోపణ చేయాలి. విషయం పై అవగాహన వుండాలని జగన్ ఇక నైన నేర్చుకుంటాడని ఆశిద్దాం .

No comments:

Post a Comment