Wednesday 16 November 2011

చంద్ర బాబు పై సి.బి.ఐ కేసుతో జగన్ కు కష్టకాలం ...



వై. ఎస్. ఆర్ పార్టి తరపున విజయమ్మ చంద్ర బాబు అక్రమ ఆస్తుల విషయమై వేసిన పిటిషన్ పై సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం విదితమే . అయితే ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కాంగ్రెస్ ఇక జగన్ పై అరెస్ట్ వేటు వేయనుంది. ఇన్నాళ్ళు జగన్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు అనే సెంటిమెంట్ ఎక్కడ వ్యతిరేకంగా పనిచేస్తే జగన్ కు ప్లుస్ అవుతుందని భావించిన కాంగ్రెస్ సి.బి.ఐ ద్వారా ఇక జగన్ అరెస్ట్ కు సిద్ధం అవుతున్నట్టు భావిస్తున్నారు . ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జగన్ అరెస్ట్ కాగానే, చంద్ర బాబు పై విచారణ వేగం పెంచి కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడతో పాటు వచ్చే ఎన్నికలలో లబ్ది పాడాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చంద్ర బాబు లాంటి నాయకుడిపైననే విచారణ జరుగుతుందంటే .. జగన్ విషయం కూడా తమకు ఎలాంటి సెంటిమెంట్ వర్క్ కాదని కాంగ్రెస్ నమ్ముతోంది. ఒక వేళ జగన్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశం మ్యాచ్ పిక్సింగ్ జరిగింది  అనుకుంటే చంద్ర బాబు నిర్దోషిగా బయట పడుతాడు. జగన్ గాలి జానార్ధాన్ రెడ్డి లా జైలు పాలు అవుతాడని కొన్ని వర్గాలు అంటున్నాయి. రాబోయే మూడు నెలలలోనే చంద్ర బాబు భవిష్యత్తు తేలనుంది. అయితే చంద్ర బాబు సుప్రేం కోర్ట్ నుండి స్టే తెచ్చుకొనే అవకాశాలు వున్నాయి. ఏది జరిగినా , ఎటు నుండి వెళ్లినా తన వైపు వున్నా ఎం. ఎల్. ఏ లు కూడా కాంగేస్స్ లో చేరిపోతే జగన్ ఒంటరిగా మిగలడం , జైలు పాలు కావడం తప్పదేమో.. కాంగ్రెస్ పాచికలు ఎప్పుడూ అంతగా ఎవ్వరికీ అర్థం కావు.

2 comments:

  1. కాంగ్రెస్సు పాచికలు ఇప్పటివా...మొదటినుండీ అదేకదా చరిత్ర. పదవులకోసం.. దేశాన్ని విచ్చిన్నం చేయటం, రాష్ట్రాలని విభజించటం. అధికారం లేని చోట శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ఆలోచనలను అక్కడి ప్రజలకి కల్పించి, అధికారంలో వున్న పార్టీలను ఇబ్బందులకి గురిచేయ్యటం. ప్రజాసామ్యం సాక్షిగా ఇతర పార్టీలను.... కుదిరితే కబ్జా చెయ్యటం, కుదరకపోతే విచ్చిన్నం చేయ్యటం...ఇలా ఒకటేమిటి కాంగ్రెస్సు అధికారంకోసం తమ పెద్ద నాయకులనే త్యాగం చేసిన పార్టీ. నిజమే, కాంగ్రెస్సు పాచికలు కాంగ్రెస్సు వారికే అర్ధం కావు!!! సామాన్యులకేమి అర్ధం అవుతాయి???

    ReplyDelete
  2. inni rojulu TDP cpngress milakat antoo voodara kottina YSRCP ippudu enduku chankalu guddukontundo...ippudu daaka vaagindi thappu aninaa cheppi...guddukovachu kadaa.......

    ReplyDelete