Monday 24 October 2011

కిరణ్ కు కలసి వస్తోన్న కాలం ..



ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో నిలదొక్కుకుంటున్నారని చెప్పవచ్చు. రోశయ్య స్థానంలో ఆయన పదవిలోకి వచ్చినప్పుడు అంతగా ఎవరూ ఆయనను ఆ పదవిలో ఆయన కుదురుకుంటాడని చెప్పలేని పరిస్తితి అయితే కాలం ఆయనకు కలసి వస్తోంది. ఒక్కొక్క సమస్య చిక్కు ముడిలా వున్నా ఓపికతో ఆయన ఆ ముడులను విప్పుతూ ఢిల్లీ పెద్దల దృష్టిలో మార్కులు కొట్టేస్తున్నారు. ఆయన సి. ఎం ఐన తరువాత తోలి సమస్య జగన్ మోహన్ రెడ్డి నుండి పోటీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ పార్టీలో చాల బలంగా కనిపించారు తన దయ దాక్ష్యనం వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో ఆధికారంలో వుందని ప్రకటించారు కూడా. కాని కాలం జరిగిన కొలది ఆయన కాంగ్రెస్ నుండి వైదొలగి కొత్త పార్టీ పెట్టారు . కాంగ్రెస్ ఎం. ఎల్ ఎ లను ఎక్కువ మందిని తన వైపు ఆకర్షించి ప్రభుత్వాని కూలగోదతారని భావించారు . అయితే అలా జరుగలేదు సరికాద జగన్ పై హై కోర్ట్ ఆదేశాల మేరకు  సి.బి. ఐ కేసులు నమోదు చేస్తి విచారణ ప్రారంభించింది. ఇప్పుడు జగన్ తనను తానూ కాపాడుకునే పరిస్తిలో వున్నారు.

మంత్రి వర్గ విస్తరణ, శాఖల కేటాయింపులపై ఎన్నడూ లేనంత అసంతృప్తి పెల్లుబికింది. అధిష్టానం అండదండలతో ఆ గండం గట్టేక్కగాలిగారు.

అలాగే తొమ్మిది ఏండ్లు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పని చేసిన చంద్ర బాబు నుండి సమస్యలు ఎదురైనాయి. ఆయన రైతుల కోసం చెప్పటిన నిరాహార దీక్ష సంచలనం అయింది . అయితే ఓపికతో కిరణ్ ఆ సమస్యను ఎదుర్కొని ఎలాంటి ఇబ్బంది పడలేదు. అలాగే తెలుగు దేశం పార్టీ స్పీకర్ ఎన్నికకు పట్టుపడితే తెలివిగా తనకు కావలసిన వ్యక్తిని ఎంపిక చేసుకొని పై చేయి సాధించారు .

ఇకపోతే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా వుండిన చిరంజీవి సహాయం తీసుకొని ప్రభుత్వం నిలబెట్టుకొని ఆయనను , ఆయన పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకున్నారు . చిరంజీవి నుండి ప్రస్తుతం పోటీ లేదు. ఆయనకు ఏ పదవి దక్కలేదు సరి కదా ఆయన కోరుకున్న108  నిర్వహణకు కిరణ్ అంగీకరించలేదు. చిరంజీవి నుండి వచ్చే ఎన్నికల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు.

రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడిగా ఎన్నికైన బొత్స ఆరంబంలో సభలు సమావేశాలు పెట్టి కిరణ్ ను డామినేట్ చేయడానికి ప్రయత్నించారు . అయితే ఆయన వేగానికి తెలంగాణా రూపంలో బ్రేక్ పడింది . ఆయన పాత్ర పార్టీ వరకే పరిమితం అయింది.  అయితే బొత్స ఇంకా పట్టు వదలకుండా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు.

రోశయ్యను ముప్పు తిప్పలు పెట్టిన తెలంగాణా సమస్య కిరణ్ కుమార్ రెడ్డి కి కూడా తల నొప్పులు తీసుకు వచ్చింది . సకల జనుల సమ్మె పేరుతొ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె పాటించారు. సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పతి ఆగిపోయి రాష్టంలో కరెంట్ కస్టాలు మొదలు అయ్యాయి. అలాగే ఆర్.టి. సి. సమ్మె తో ప్రయాణికులు ఇబ్బంది పడ్డాడు . దాదాపు నెలరోజులుగా సాగుతున్న సమ్మె ఒక్కొక్క సమ్మె విరమణ చేయించడంలో సఫలీక్రుతుడైనట్టే . తెలంగాణా వాదులు చేప్పట్టిన రైల్ రోకోను సమర్ధవంతంగా ఎదుర్కొని సమ్మె ఉదృతంగా ఉన్నప్పుడే రాష్ట్ర పరిస్తితులకు, సామాన్యుల కష్టాలకు కే.సి.ఆర్., కోందండరామ్ కారణమని చెప్పా గలిగారు . 

నిన్నటికి నిన్న ఎం. ల్.సి. పోస్ట్ కు డి.ఎస్. ను ఎంపిక చేసి ఢిల్లీ లో తన పలుకుబడి చాటుకున్నారు. బొత్స చేసిన సిపార్సులు బుట్ట దాఖలు అయ్యాయి.  ఏది ఏమైనా కిరణ్ కు కాలం కలసి వచ్చింది.. ఇప్పుడు ఆయన మెల్లగా మంత్రి వర్గం మళ్ళి విస్తరించే అవకాశం వుంది

No comments:

Post a Comment