Thursday 13 October 2011

సంపాదన కోల్పోతున్న సామాన్యులు !


తెలంగాణాలో ఉదృతంగా జరుగుతున్నా సకల జనుల సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించి చేస్తున్న సమ్మె వల్ల సామాన్యుల పరిస్తితి అడ కత్తెరలో పోక చెక్కలా తయారయింది . రెక్కాడితే కాని డొక్కాడని బడుగు వర్గాలు ఈ సమ్మె పట్ల తమ ఆర్థిక పరిస్తితి దెబ్బ తిందని , తమను ఆదుకోవాలని అంటున్నారు. బహిరంగంగా మాట్లాడాలని వున్నా వారిని వేధింపుల బయం వెంటాడుతోంది. ఇప్పటికే ఖమ్మం లో సామాన్యస్తితిలో ఆర్.టి. సి. బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణా కావాలనుకునే కోట్లాది మందిలో తాము ఒకరమని  తమ సమ్మె వల్ల రోజూ రాబడి పోతోందని, కుటుంబ పోషణ  మరింత భారమిందని అంటున్నారు .. ఎదిఎమైనా సుధీర్గ సమ్మె వల్ల కేంద్రంలో కదలిక వచ్చింది. అయితే  ఎ నిర్ణయం వెలువడుతుందో తెలియదు .. ఈ సమయంలో సమ్మె విరమిస్తే అసలుకే ఎసరు వస్తుందని కొన్ని రోజులలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోక 
తప్పదని ఉద్యమ నాయకులు అంటున్నారు.  అయితే సమ్మె కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలని అనుకున్నా మాట్లాడలేని స్తితి నెలకొంది .  

1 comment:

  1. ఇలా చెప్పి సమ్మెని లిక్విడేట్ చెయ్యడం మంచిది అంటావా? ఉద్యమం బలంగా ఉన్న ఈ సమయంలో ఉద్యమాన్ని లిక్విడేట్ చేస్తే చరిత్రలో ఇక ఎన్నడూ తెలంగాణా రాదు. ప్రజా ఉద్యమాలని మీరు అర్థం చేసుకున్నది ఇదేనా?

    ReplyDelete