Wednesday 15 February 2012

ఎవరు ఎవరితో ఫిక్శింగ్


రాష్ట్ర్రరాజకీయాలు ఇదివరలో లేనంత చిక్కులుగా చికాకుగా ఉన్నాయి. వై.యస్.ఆర్ పార్టీ వారు ఆరోపించినట్టు కాంగ్రెస్ , తెలుగుదేశం లు ఒకటై మూడో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నాయా ... లేక పోతే తెలుగుదేశం ఆరోపించినట్టు కె.సి.ఆర్ ( టి.ఆర్.యస్.) తో కాంగ్రెస్ , వై.యస్.ఆర్ పార్టీలు కుమ్ముక్కయ్యాయా.. లేకపోతే జగన్ కాంగ్రెస్ లోకి ఎప్పటికైనా వెలుతాడని ఇందంతా ఓ నాటకమని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి కిరణ్ జగన్ ను పలెత్తు మాట అనకుండా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కమ్యునిస్టు పార్టీలు తాము ఏమి తక్కవ తిన్నామా అని మాకు తెలుగుదేశంతో పాటు వై.యస్.ఆర్ పార్టీ ఒకటేనని గత ఎన్నికలలో ప్రజారాజ్యంతో కలసి పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవని నిష్టూరమాడుతోంది. ఇంతకి ఎవరి ఎవరి ప్రక్క, ఎవరు అధికార పక్షం, ఎవరు ప్రతి పక్షం అంతా గందరగోళంగా ఉంది.

No comments:

Post a Comment