Wednesday 22 February 2012

కిరణ్ కు చెంప పెట్టు


సమాచార చట్టం స్పూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ తోసిపుచ్చుతూ తన ప్రతాపం చూపెట్టారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వారితో నింపవలసిన సమాచార కమీషనర్లను పూర్తిగా రాజకీయకోణంలో పదవులు కట్టబెట్టడం ఇదే తొలిసారి. కిరణ్ మొండిగా తిరిగి వారినే నియమించినా గవర్మరు చేసేది ఏమీలేక సంతకం చేసినా ఇప్పటికే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది తప్పుడు నిర్ణయమనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ విషయంలో కిరణ్ , చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ఇది వరకే ఈ నియామకాలపై తన అసమ్మతి నోట్ వ్రాసి బయటపడ్డారనే చెప్పాలి. కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, ఎవరినీ పరిగణలోనికి తీసుకోకుండా ఇలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిగిలిన నాయకులు మండి పడుతున్నారు.

No comments:

Post a Comment