Friday 1 June 2012

న్యాయమూర్తి కే సోకిన అవినీతి గాలి



తలుచుకుంటేనే కంపరం పుట్టేవిధంగా సి.బి.ఐ న్యాయమూర్తిగా ఉన్న పట్టాభిరామ్ డబ్బులు తీసుకుని గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం అనేది అవినీతి విషపు నాగు వేళ్ళూనుకున్న విషయాన్ని నిర్ధారిస్తోంది. గనులు తవ్వుకుని కోట్లు గడించిన అహంకారంతో న్యాయవ్యవస్థనే కబళించపూనడం నిజంగా దురదృష్టకరం. మెలుకువగా ఉన్న సి.బి.ఐ ఎంతో చాకచక్యంగా ఈ కేసును పరిశోధన చేసి హైకోర్టు ద్వారా పూర్తి విచారణకు అనుమతి పొందడం మెచ్చదగిన విషయం. ఈ విషయంలో న్యాయ మంత్రి ఏరాసు ప్రతాప్ పేరు వినపడుతుండడంతో అవినీతికి , రాజకీయానికి ఉన్న లంకె చెప్పకనే చెబుతున్నది. వ్యవస్థలను నాశనం చేసే తాము కోట్లు గడించేందుకు ఎంతకైనా దిగజారే ఈ నాయకులను ఉరితీసినా పాపం లేదు. వీరి ఆస్తులను ఉన్న ఫలంగా జప్తుచేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పని చేయడానికి భయపడాల్సిన అవసరం ఉంది. ఇవ్వన్ని చూస్తుంటే పాపం గాలి జనార్థన్ తమ్ముడు మన జగన్ బెయిల్ పై పెట్టుకున్న ఆశలు అడుగంటి పోయినట్టు కనిపిస్తోంది. 

2 comments:

  1. కోర్టులతో సంబంధం ఉండే న్యాయవాదులే కాదు , అటెండర్ లు క్లర్కులకు కూడా ఇలాంటి వ్యవహారాలు తెలుసు .కావాలంటే తెలిసిన న్యాయవాది ఉంటే అడిగి చూడండి .గుండెలు తీసిన బంటు లాంటి నాయకులు ఈ వార్త చూసి ఆశ్చర్య పోవడమే ఆశ్చర్యం

    ReplyDelete
  2. cbi meeda nammaka poyindi.... ippudu judiciary meeda..... yevarini nammalo yevarini nammakudado teleedu. vedavalu innocent ayipotunnaru ee game lo

    ReplyDelete