Tuesday 12 June 2012

పార్టీల గుండెలో గుబులు


పోలింగు సరళి
జరుగుతున్న ఉప ఎన్నికలలో పోలింగ్ సరళి మందకోడిగా సాగుతోంది. మద్యాహ్నం నుంచి పోలింగ్ వేగం పుంజుకోవచ్చని భావిస్తున్నారు. ఓటుకు నోటు అంటూ డబ్బలు కుమ్మరిస్తున్న పార్టీలకు గెలుపు పై వారి వారి భయాలు వారికి ఉన్నాయి. ఓడిన వారూ పైకి ఏడిస్తే, గెలిచిన వాడు కుమిలి కుమిలి ఏడవ్వాలి. పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకునే మార్గాలపై అన్వేషణ సాగిస్తారు. 




ఫలితాలపై పార్టీలలో గుబులు
ఏది ఏమైనా ఈ ఎన్నికలు అధికార పక్షానికి మరియు వై.యస్.ఆర్ పార్టీకి చావో రేవో తేలుస్తాయి. ఎవరు గెలిచినా ఎవరూ ఓడినా ఓడిన వారి పని ఇక అయిపోయినట్టే. కాంగ్రెస్ ఓడితే ఆస్థానంలోకి వై.యస్.ఆర్ కాంగ్రెస్ ఆక్రమిస్తుంది. ఇప్పుడే యం.ఎల్.ఎ లు  ఎప్పుడెప్పుడు జంపు అవుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈ జంపింగ్ కార్యక్రమం ఫలితాలు వెలువడిన వెంటనే మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి పదవికి లేదా బొత్స పదవికి , చిరంజీవికి ఇస్తామన్న కేంద్ర మంత్రి పదవికి ఈ ఎన్నికల ఫలితాలు లింకు ఏర్పడి ఉంది. అలాగే గొంతుల వరకు అవినీతి, అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ కు ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే పార్టీ పరంగా మానసిక బలం పెరుగుతుంది. ఫలితాలు అనుకూలించకపోతే రాజకీయంగా పార్టీ పతనం చెందడం ప్రారంభిస్తుంది. తెలుగుదేశం పార్టీది అయిదే వింత సమస్య . ఫలితాలు అనుకూలిస్తే 2014 పై ఆశలు చిగురిస్తాయి. లేదంటే ఎన్టీఆర్  కుటుంబ సభ్యుల ప్రవేశం (బాలయ్య) త్వరగా జరుగుతుంది. అంతే గాక రాబోయే 2014 ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను, నాయకులను అట్టి పెట్టుకోవడం పెద్ద సమస్య.  తెలంగాణాలో అయితే బి.జె.పి. , టి.ఆర్.యస్ ల మధ్య ఆధిపత్య పోరుకు కూడా వేదికగా నిలిచిన ఈ ఎన్నికల ఫలితాల   అన్ని పార్టీల గుండెల్లో గుబులు రేపుతోందని చెప్పక తప్పదు. 

1 comment:

  1. ఈ ఎలక్షన్ లో కనీసం 4 సీట్లు సాధించక పొతే తెలుగు దేశం పార్టీ చరిత్ర లోకి కలిసిపోతుంది. కాంగ్రెస్స్ జాతీయ పార్టీ ,దానికి రెండు సార్లు ఓడిన పెద్దగా పోయేది ఏమి ఉండదు. అది కాక గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్స్ అధికారం లో ఉంది. ఎటు చూసుకున్నా సరిగా పెర్ఫారం చెయ్యక పొతే tdp కే అసలయిన దెబ్బ

    ReplyDelete