Thursday 7 June 2012

జగన్ కు ఎందుకింత ధీమా ..


సాధారణంగా మనపై ఎవరయినా ఏదైనా ఆరోపణలు చేస్తుంటే మనం తల్లడిల్లిపోతాం. మన తప్పులేదని నిరూపించుకోవాలని తపించిపోతాం. తప్పుచేయకపోతే ఆ తప్పు వేరే వారు చెబుతూ ఉంటే ఎంత నరకమో వేరే చెప్పనక్కరలేదు. అయితే ఇక్కడ జగన్ అవినీతికి పాల్పడినాడని లోకం కోడై కూస్తున్నా.. ఆయన, ఆయన పార్టీ ఆ విషయాన్ని ఖండించకపోగా ఎదుటి వారిలో ఎవరు నీతిమంతులో చెప్పాలని అంటున్నారు. ఇదే విచిత్రం మాట తప్పని, మడమ తిప్పని వారు ఇలా అడ్డగోలుగా రాజ్యాంగం పై ప్రమాణం చేసిన దాన్ని మరిచి తరతరాలకు సరిపోయేటట్టు వెనుకవేసుకోవడం, నమ్ముకున్న వారిని జైలు పాలు చేయడం ఏ నాయకత్వం క్రిందికి వస్తుందో ఆలోచించాలి. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు అవినీతి కేసులలో జైలు కెళ్ళినా ప్రక్క ధీమాగా ఉన్నట్టు నవ్వులు, దండాలు పెడుతున్నారు. లోకం ఏవగించుకుంటున్నా.. తుడుచుకుపోతున్నావారిని మనం ఏమనుకోవాలి. సంక్షేమాల ముసుగేసుకుని, కన్నీటి సెంటిమెంటుతో సెంటికొట్టుకున్నా అవినీతి కంపు వదలిపెట్టేటు లేదు మరి. ఈ ఎన్నికలలో ప్రజలు ఓడిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. అధికారం , ధనం తప్ప ప్రజల బాగోగులు పట్టని వారు నియంతలై పోతారు. ఈ రాష్ట్రాన్ని ఓటరు మహాశయుడు కాపాడుకుంటాడో లేదో వేచి చూడాలి. 

5 comments:

  1. Geliste meeru tala ekkada pettukuntaru

    ReplyDelete
  2. meereppuDuu aemee tappu chaeyalaedaa?

    ReplyDelete
  3. Ramjee and kiranmai laanti vaallu unnantha kaalam saamaanyudi aavedana boodidalo posina pannire brother....

    ReplyDelete
  4. అవినీతి పరులు ఎన్నికలలో గెలిచినా హీరోలు కాలేరు. నియంతలపై కూడా కొన్ని ప్రాంతాలలో అభిమానం ఉండొచ్చు. జనం అభిమానాన్ని అండగా దోచేసే వారు గెలిచినారా ఓడినారా కాదు ఇక్కడ ముఖ్యం . మనకున్న విలువల పట్ల మనం ఎంత అంకితభావంతో ఉన్నామో తెలియాలి. సమాజంలో మార్పు తప్పని సరిగా వస్తుంది. అసలు అరెస్టు చేసే ధైర్యం ఉందా , అగ్ని గుండం అయిపోతుంది అన్న దగ్గర నుండి ఇప్పుడు జైలులో పడేస్తే అయ్యోమని జాలి చూపే వారే లేరని గుర్తించాలి

    ReplyDelete
  5. @ ఈ ఎన్నికలలో ప్రజలు ఓడిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి....జగన్ పార్టీ ఓడే ప్రసక్తే లేదు...ఇలాంటి పరిస్తితి ఊహించే...అది కాంగ్రెస్స్కు...వైఎస్సార్...జనాలకు కావలసినన్ని స్కీమ్ లుపెట్టారు...వాటిని మనం సమర్ధించక పోవచ్చు గానీ జనాలు మెచ్చుకున్నారు... ..జనాలు బిస్కెట్లు బాగా తిని ఉన్నారు...అవి ఇప్పుడు ఓట్ల రూపం దాల్చనున్నాయ్...జగనన్న ధీమాకు కారణం వైఎస్స్ పధకాలే.....అవి పంచలేక కిరణ్ పంచె ఊడిపోతోంది....

    వైఎస్స్ కు ప్రజల్లో ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉంది...ఆయన్ను బ్రష్టు పట్టించారు...లేకుంటె ఆయన శాశ్వతంగా హీరోగా అందరివాడయ్యేవాడే....

    ReplyDelete