Friday 8 June 2012

పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరకాల పోరు


తెలంగాణా సెంటిమెంటుకోసం పరకాల స్థానంలో కాంగ్రెస్ శానససభ్యురాలిగా ఉండిన కొండా సురేఖ రాజీనామా చేయడంతో పరకాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తెలంగాణాలో జరుగుతున్న ఒకే ఒక స్థానమైన పరకాల వివిధ పార్టీల బలబలాలను తేల్చనుంది. కాంగ్రెస్ తరపున శాసనసభ్యురాలిగా ఉండి రాజీనామా చేసినా మారిన రాజకీయ పరిస్థితులలో కొండా సురేఖ వై.యస్ ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పాలమూరు విజయం తరువాత బి.జె.పి కూడా పరకాల స్థానం ఎలాగయినా కైవసం చేసుకోవాలని శక్తి వంచన లేకుండా కష్టపడుతోంది. అయితే బి.జె.పి గెలిస్తే తెలంగాణాలో తన ఉనికి కే ప్రమాదం అవుతుందన్న అభద్రతా భావంతో ఉన్న టి.యస్.ఆర్ పార్టీ ఎలాగయినా ఈ ఎన్నికలు గెలిచి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నది. ఈ పార్టీకి జే.ఎ,సి కూడా మద్ధతు ప్రకటించింది. ఇక తెలుగుదేశం పార్టీ కి ప్రచారం నిర్వహించుకుంటున్నా గెలుపు పై ఎలాంటి ఆశలు లేవనే చెప్పాలి. పరకాల పోరులో బి.జె.పి, టి.ఆర్.యస్ లు నువ్వా నేనా అన్నంతగా పోటీ పడుతున్నాయి. దీని వల్ల తెలంగాణా సెంటిమెంటు ఓటు చీలితే అది వై.యస్ .ఆర్ పార్టీకి గాని తెలుగు దేశం పార్టీకి గాని లాభించే అవకాశం ఉంది. ఇక్కడి నుండి గెలువడం కొండా సురేఖకు  ఆమె పార్టీకి తప్పని సరి. ఎందుకంటే తెలంగాణాలో తమ పార్టీ మనుగడకు అది అవసరం అని భావిస్తుండడంతో నేడు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలైన విజయలక్ష్మీ కూడా తన కూతురు షర్నిలతో కలసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అవినీతి కేసులలో జగన్ జైలు పాలుకావడంతో వీరి ప్రచారం సెంటిమెంటును పండిస్తుందని ఆ పార్టీ వారు భావిస్తున్నారు. అలాగే బి.జె.పి గెలుపు పై ఆశాభావంతో ఉంది. తమది జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణా తమ వల్ల సాధ్యమవుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. టి.ఆర్.యస్ పాలమూరు లో అపజయంతో డీలా పడిపోయింది. ఎలాగయినా పరకాలలో గెలిచి తమ సత్తా చాటాలని ఉవ్విలూరుతున్నారు. తెలుగు దేశం అసలు గెలుపై ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా ప్రచారం మాత్రం పోటా పోటీ గా చేసుకుపోతున్నది. మొత్తానికి అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. చూద్దాం పరకాల ఓటరు ఎలాంటి తీర్పు నిస్తాడో మరి. 

2 comments:

  1. ప్రతిష్టాకరమైనవి ఎన్నికలే గానీ ప్రజలు కాకపోవటం మన ప్రజాసామ్యంలొ విచారకరమైన విషయం. ఆ ప్రతిష్ట కూడా రాజకీయ పార్టిలకేగానీ ప్రజలెవ్వరికి సంబంధించినది కాదు. అనవసర ప్రతిష్టలకి పోయి ఇలా ఎన్నికల పేరుతో ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్న మన పనికి మాలిన రాజకీయ పార్టీలకి బుద్ధి ఎప్పటికి వస్తుంది....? ఈ ఎన్నికలన్నీ ప్రజల కోసమే అని, అహంకారంతో కళ్ళు మూసుకొని పోయిన రాజకీయనాయకులకి ఎవరు చెపుతారు....??ఎన్నికలంటే బెట్లు కట్టుకొనే క్రికెట్టు మాచ్‌లు కాదని ప్రొద్దున్నే టివీలలో కనపడే "మేధావి ప్రజలకి" ఎవరు చెపుతారు.....??

    ReplyDelete
  2. Winner: TRS (30,000 votes majority)
    Second: BJP
    Third: YSRCP (just manages to retain deposit)
    Fourth: Congress (loses deposit)
    Fifth: TDP (loses deposit)

    Joker in the pack: MCPI (< 500 votes)

    ReplyDelete