Wednesday 6 June 2012

సి.బి.ఐ కి తోడుగా రంగంలోకీ ఈడి.



జగన్ అక్రమాస్తుల వ్యవహారాన్ని విచారిస్తున్న సి.బి.ఐ కస్టడి ముగియగానే జగన్ ను ఈడి విచారించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నది. ఈ డి ప్రవేశంతోనే జగన్ ఆస్తులను ఆటాట్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే సానుభూతి ఓట్లపై ఆధారపడిన జగన్ మరింత లోతు కష్టాలలోకి దిగిపోనున్నారు. ఈడి పూర్తిగా విదేశాలనుండి అక్రమంగా తరలి వచ్చిన సొమ్ము, హవాలా మార్గంలో తెచ్చిన సొమ్ములను ఇప్పటికే గుర్తించినట్టు చెబుతున్నారు. జనంలో ఏదో సానుభూతి ఉందనుకుని అవినీతి కేసులలో ఇరుక్కున్న వారు ఆలోచించడం మన దేశంలోనే తొలిసారిగా విడ్డూరంగా ఉంది. జనం ఇంత వరకు అవినీతిని ఎప్పుడూ అందలం ఎక్కించరు. ఇలాంటి అవినీతి వల్లే కదా కరుణానిధి ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది. రాజశేఖర్ రెడ్డి తమకు ఏదో చేశాడని భ్రమించిన జనానికి మెల్ల మెల్లగా అర్థం అవుతోంది. అక్రమాలు చేయడం అదే హీరోయిజం అనుకోవడం చాలా తప్పు. అవినీతికి జనం వ్యతిరేకంగా జనం ఓట్లు వేసినప్పుడే రాబోయే కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చినా అవినీతి చేయడానికే జంకుతారు. లేదా అవినీతికే ఓట్లు వేస్తే తమకు అవినీతికి లైనెస్సు ఇచ్చినట్టు అంతా దోచేస్తారు కాబట్టి ఈడి ప్రవేశంతో నయినా ఓటర్లలో మార్పురావాలని సగటు మనిషి కోరుకుంటున్నాడు.

5 comments:

  1. సగటు మనిషి అంటే పచ్చ వర్గామేనా నీటి రాజకీయం గారు. పాపం మీ కడుపాత్రం సూత్తుంటే బలే ముచ్చటేస్తుంది. జూన్ 15 న ఒక మాంచి పోస్టు రాయండి. సదివి పెడతాము.

    ReplyDelete
  2. "జనం ఇంత వరకు అవినీతిని ఎప్పుడూ అందలం ఎక్కించరు." చెప్పలేమండి.
    మొన్నీమధ్య మా అమ్మ దగ్గర పనిమనిషి-లక్ష్మి అన్న మాటలు విన్నప్పుడు, ఇలాంటి వారు ఎందరో ఉండి ఉండొచ్చు అనుకున్నాను. లక్ష్మి కి "ఇందిరమ్మ పధకం" కింద ఇల్లు మంజూరు అయ్యి ఆ ఇంట్లో నివసిస్తుంది. తను ఆరు నూరైనా, నూరు ఆరైనా జగన్/YSR తనకి దైవం తో సమానం అంటుంది.ఇలాంటి వారి చాలా మంది Ssupport ఉంది జగన్ కి. Big picture వాళ్ళు అర్ధం చేసుకోలేరు కదా!

    ReplyDelete
  3. ఒకప్పుడే మేలు ఉంటే నీతైనా ఉండేది అవినీతైనా ఉండేది.
    ఇప్పుడు అవినీతి మాత్రమే

    ReplyDelete
  4. >>. ఈడి పూర్తిగా విదేశాలనుండి అక్రమంగా తరలి వచ్చిన సొమ్ము, హవాలా మార్గంలో తెచ్చిన సొమ్ములను ఇప్పటికే గుర్తించినట్టు చెబుతున్నారు.

    ఎవరికి? మీకా?

    ReplyDelete
  5. swiss bank ki ed ki sambhadham ledantaru.

    ReplyDelete