Friday 8 June 2012

అవినీతిని ఎంతవరకు సహించవచ్చు...



మనం అవినీతి సమాజంలో నివసిస్తున్నాం. ఎవరినయినా అవినీతి పరుడివి అంటే వెంటనే నీవు పెద్ద నీతి పరుడివా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న సమాజంలో బతుకుతున్నాం. బతుకడం కోసం చిన్న చిన్న స్థాయిలలో అవినీతి ఉందంటే కడుపాకలి అని సరిపెట్టుకోవచ్చు. కాని ప్రసుత్తం జరిగిన లేదా జరుగుతున్న అవినీతి మొత్తం సమాజాన్నే కలుషితం చేసే విధంగా ఉంది.  బతుకడం కోసం కొందరు మహిళలు శరీరాలు అమ్నుకొంటున్నారని అనుకుందాం అది తప్పని సరైన స్థితిలో వారుచేస్తున్నవిగా అర్థం చేసుకుని పునరావాసం కల్పించడమో లేక చూసిచూడనట్లు ఉండడమో జరుగుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన తారా చౌదరి లాంటి వారు అంతకు మించి పోయారు. పడుపు వృత్తితో పాటు బ్లాక్ మెయిల్ చేయడం, అమ్మాయిలను అడ్డదారులు త్రొక్కించడం లాంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అయినా చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆ అమ్మాయిని ఈ రంగంలో ఉపయోగించుకున్నారనే విషయాన్ని చర్చించుకుని యోవగించుకున్నారు. టి.వి ఛానళ్లు తారా చౌదరిని పదే పదే చూపుతుంటే ఎగబడి చూసిన జనమూ ఉన్నారు. ఆమెను అరెస్టు చేసినప్పుడు ఎలాంటి భయం లేకుండా పెద్ద ఘనకార్యం చేసినట్టుగానే  పోజులు ఇచ్చింది. ఇదే విధంగా  అవినీతి చిన్న స్థాయిలో ఉండి బతుకడానికి చేస్తున్నదయిచే కొంత వరకు క్షమించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఉండి, ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన అధికారాన్ని అమ్ముకుని కోట్లు కూడేసుకున్న పెద్ద మనుషులకు తారా చౌదరికి పెద్ద తేడాలు లేవు. దీని పై అడ్డంగా వాదించే వారు అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే . మనకు తోచిన స్థాయిలో మనం అవినీతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే అదే పెద్ద ఉద్యమంగా మారగలదు. అన్న హజారే ఈ విషయమై చేసిన ఉద్యమం జాతి యావత్తు ఒక్క తాటిపై నిలిపింది. అవినీతికి వ్యతిరేకంగా ఎవరయినా మాట్లాడితే వారు చేయలేదా , వీరు చేయలేదా అని ప్రశ్నించకుండా అవినీతిని రూపుమాపేందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం. అది రాజకీయమైనా ఇంకో స్థలమయినా చివరికి ఆ భారం పడేది సామాన్యులపైననే అని వివరిద్దాం. 

3 comments:

  1. /అవినీతి చిన్న స్థాయిలో ఉండి బతుకడానికి చేస్తున్నదయిచే కొంత వరకు క్షమించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు/
    !!!
    ఎంత స్థాయి వరకూ మీరు అర్థం చేసుకుంటారు? ఎంత అవినీతి మీకు acceptable? inflation ఈ లిమిట్ డిసైడ్ చేయడంలో పరిగణన లోకి తీసుకుంటారా? మీకు ఇంత % పడేస్తే ఆ లిమిట్ ఎంత మేరకు పెంచగలరు?
    ఈ డేటా ఇవ్వండి లెక్కేసి స్పందించగలం.

    ReplyDelete
  2. ఇక్కడ అవినీతిని ఎంతవరకు సహించవచ్చు అంటే బతుకడానికి, ఆకలి తీరడం కోసమయితే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అలా అని ప్రోత్సహించమని కాదు దానికేదో లిమిట్ పెట్టమని కాదు. అందరం తప్పులు చేస్తున్నామనుకుంటే అసలు చట్టాలు అవసరం ఏముంటుంది. సమాజం కొన్ని నియమాలతో, కట్టుబాట్లతో లేకుంటే తిరిగి అటవిక సమాజం ఆవిర్భవిస్తుంది. గుడ్డి అభిమానాన్ని ప్రక్కన పెట్టి అవినీతి ఎవరు చేసినా ముఖ్యంగా రాజకీయనాయకులు నిలదీయడం మరచిన నాడు పౌరులుగా మనం విఫలమయునట్టేనని నా అభిప్రాయం

    ReplyDelete
    Replies
    1. ఆకలై చేసే దొంగతనం, అవినీతి ఒక్కటే కాదు. ఒక పనిచేయించుకోవడం కోసం వుద్యోగి, ప్రజాప్రతినిధికి వివిధ రూపాల్లో లబ్ధి కలిగించడాన్ని అవినీతి అంటారని మనకు తెలిసిందే.
      కేవలం అప్పటికి కడుపునిడటానికి ఓ బ్రెడ్డుముక్క దొంగతనం చేస్తామంటే అది తప్పే, కాని క్షమార్హమైన తప్పు అవుతుంది. ఆ ఆకలి మితిమీరి బంధు,మిత్రు,సపరివార సమేతంగా 10జన్మలకు సరిపడంతా ఆకలి తీర్చుకుంటానంటే?!! ఆ ఆకలికి అడ్డుకట్ట వేయాల్సిందే, అవసరమైతే జీర్ణకోశాన్ని శస్త్రచికిత్స చేసైనా తొలగించాల్సిందే.

      That's all your honour :)

      మంచి ఆలోచింపచేసే టాపిక్స్ రాస్తున్నారు. వర్డ్ వెరిఫికేషన్ అనే ముళ్ళకంచె తీసివేస్తే ఇంకా నలుగురి అభిప్రాయాలు వినే అవకాశం వుంటుంది.

      Delete