Monday 11 June 2012

నిరాహార దీక్ష చేస్తానని జడ్జీనే బెదిరించిన జగన్


రోజూలా కాకుండా తనను కోర్టుకు అందరి ఖైదీల్లా సాధారణ పోలీసు వ్యానులో తీసుకువచ్చినందులకు జగన్ సహనం కోల్పోయాడు. తనను అవమానిస్తున్నారని తాను యం.పి నని, ఒక పార్టీకి అధ్యక్షుడినని తన భద్రత గాలికొదిలి ఇలా సాధారణ ఖైదీలా తీసుకురావడం పై జగన్ జైలులో జడ్జీకి ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా తనకు పూర్వపు సౌకర్యాలు కల్పించకుంటే తాను నిరహారదీక్ష చేపడుతానని కూడా జడ్జీని బెదిరించారు. వెంటనే జడ్జీ ఆదేశాలతో జగన్ బుల్లెట్ ప్రూప్ వాహనాన్ని సిద్దంచేయక తప్పింది కాదు సి.బి.ఐ .కి . ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడు ఈ విధంగా తన సౌకర్యాల కోసం గళం ఎత్తడం , కోర్టులో ఏకంగా జడ్జీని ఒక రకంగా బెదిరించడాన్ని జగన్ వైఖరికి నిదర్శనంగా ప్రత్యర్థ పార్టీలు చెబుతున్నాయి. కోర్టులు కూడా ఖైదీల బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు గురయితే ఇంక చేసేది ఏముంది. ఇదే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఖైదీలు ఎవరయినా సౌకర్యాలు అడిగితే సమకూర్చగలరా అని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల ముందు జగన్ తనను సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు చేయడం కూడా ఎత్తుగడలో భాగమని కొందరు అంటున్నారు.

11 comments:

  1. బయట తిప్పేటప్పుడు మేళతాళాలతో, భాజా భజంత్రీలతో వూరేగింపుగా తీసుకుపోవడానికి CBIకి ఏం రోగమొచ్చింది? తీసుకుపోవాల్సిందే. లోపలొచ్చాక కావాలంటే బత్కమ్మ అడిచినా ఎవరూ అడగరు. :)

    ReplyDelete
  2. ఇక్కడ కొన్ని మౌళికమైన విషయాలు చర్చించాలి.

    ౧. తానొక M.P నని జగన్ గుర్తుచేస్తున్నాడు.
    జ. చట్టసభలో సభ్యుడైనా ప్రస్తుతం నిందితుడు. నిందుతులకు చట్టప్రకారం లభించే సౌకర్యాలు తప్ప చట్టసభలో సభ్యులుగా యెటువంటి ప్రత్యేకస్థాయి ఉండవలసిన పనిలేదు.

    ౨. తానొక రాజకీయ పక్షానికి అధ్యక్షుడనని జగన్ గుర్తుచేస్తున్నాడు.
    జ. అయితే పలుకుబడి గల వ్యక్తులకు ఒక మంచి సౌకర్యం కావాలన్న మాట. వారొక రాజకీయ పార్టీ పెట్టుకుని, దానికి అద్యక్షులో కార్యదర్శులో అయితే చాలు. ఆనక యెలాంటి నేరాలు చేసినా ఒక రాజకీయ పార్టీ నాయకుని హోదా లభించుతుందన్న మాట. ఇదేగా జగన్ చెప్పేది? ఇదెంత అసమంజసం మైన వాదనో తెలియటం లేదా?

    ౩. తనకు భద్రత కరవౌతోందని జగన్ ఆగ్రహిస్తున్నాడు.
    జ. నిందుతులకు యెలాంటి భద్రత కల్పించాలనేది పోలీసుశాఖ నిర్ణయిస్తుంది. నిందితులు కాదు. వారిలో యెవరైనా మరింత భద్రతను కోరుకుంటే విజ్ఞాపన చేసుకోవచ్చును. ఆగ్రహించటనికి జగనెవరు?

    ౪. నిరాహారదీక్ష చేస్తానని జగన్ జడ్జిగారినే బెదిరించాడు.
    జ. ఇది క్షంతవ్యం కాదు. న్యాయమూర్తిపైన బెదిరింపులు చేసినందుకు అతడిని ప్రాసిక్యూట్ చేయాలి.
    నిందితులకు పోలీసులకు గాని, వారు వినకుంటే న్యాయస్థానానికి గాని విజ్ఞాపన చేసుకొనే హక్కు ఉంటుంది. బెదిరింపు చర్యలు దుష్ప్రవర్తన క్రిందకే లెక్కించబడతాయి.

    ౫. జగన్ ప్రజాజీవితంలో ఉన్న నాయకుడు!
    జ. అలాగా? ముందు చెప్పినట్లు యెవరైనా ఒక రాజకీయపార్టీ పెట్టి లేదా రాజకీయపార్టీలో చేరి నాయకుడై పోవచ్చు నన్నమాట. ఆ తరువాత గనుక పోలీసువారి ఆతిధ్యం లభిస్తే కొత్తపెళ్ళికొడుకులాగా సకల రాజమర్యాదలూ అంది తీరవలసినదేనన్నమాట. ఇది అసందర్భంగా లేదా? ఒక నిందుతుడు నిందితుడే కేవలం. నిందుతుల రాజకీయ పరపతులతోనూ, ఆర్థిక స్థోమతుతోనూ న్యాయవ్యవస్థకు, పోలీసు వ్యవస్థకూ పనిలేదు ముమ్మాటికీ.

    ReplyDelete
  3. శ్యామలీయం gaaru,

    'మౌళికమైన' OR మౌలికమైన?!

    ReplyDelete
    Replies
    1. నాదే పొరబాటు. మౌలిక అన్నదే సరయిన ప్రయోగం. మౌళిక తప్పు. అది రసాయనశాస్త్రపరిభాషలోని పదం.

      Delete
  4. శ్యామలీయనం గారు,మీరు వయసులో నే పెద్దగా కనపడుతున్నారు , కానీ మీ కామెంటు చూస్తె మీ ఆలోచనలు ద్వేషం తో నిండిన మర గుజ్జు మాటలు కన్నా హీనంగా ఉన్నాయి . మీరు ఏమి చదువుకున్నారో తెలియదు కానీ మీ జ్ఞానం చూస్తె చాలా జాలి వేస్తుంది. నా సమాధానాలు చూడండి.

    //చట్టసభలో సభ్యులుగా యెటువంటి ప్రత్యేకస్థాయి ఉండవలసిన పనిలేదు.//

    ఏ చట్టము ప్రకారం చెప్తే మహా సంతోషిస్తాము . జగన్ చట్ట సభ ప్రతినిధి. అతనిని 'ప్రత్యెక తరగతికి' చెందిన అండర్ ట్రయల్ గా కోర్టు గుర్తించినది. కనుక అతనికి ప్రత్యెక వసతి నిందితునికి కలగవలిసిన సౌకార్యాలు అన్నీ ఇవ్వవలిసిందే. అతను ఒక దివంగత ముఖ్యమంత్రి కుమారుడు . ప్రభుత్వము అతనికి Z కాటగిరి ,బుల్లెట్ ప్రూఫ్ కారు సమకూర్చింది. నిందితుని ప్రాణాలు కాపాడే భాద్యత సిబిఐ, జైళ్ళ శాఖ దే . జైలు లో ఉన్నా, జిల్లాలో ఉన్నాసరే అతనికి రక్షణ కల్పించ వలిసిందే.

    //ఒక రాజకీయ పార్టీ నాయకుని హోదా లభించుతుందన్న మాట. ఇదేగా జగన్ చెప్పేది? ఇదెంత అసమంజసం మైన వాదనో తెలియటం లేదా?//

    ఓహో ,మీకు అలా అర్ధం అయ్యిందా? మీ జ్ఞానానికి అంత కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యకుడదేమో. రేపు అధికారం లో ఉన్న వాళ్ళు ప్రతి పక్షాల మీద కేసు పెట్టి నిందితులు అని చెప్పి ఎటువంటి రక్షణ లేకుండా రోడ్ మీద వదిలేద్దాము. రాజకీయ పార్టీ అధ్యక్షుడికి తన ప్రత్యర్దులనుండి తనకు ముప్పు ఉంటుంది అని చెప్పుకుంటే కూడా తప్పేనా?

    // నిందుతులకు యెలాంటి భద్రత కల్పించాలనేది పోలీసుశాఖ నిర్ణయిస్తుంది. నిందితులు కాదు.//

    అతను అడిగింది కూడా అదే. ప్రభుత్వము అతనికి Z కాటగిరి ,బుల్లెట్ ప్రూఫ్ కారు సమకూర్చింది. అదే సమకూర్చమని చెప్పాడు.

    //ఇది క్షంతవ్యం కాదు. న్యాయమూర్తిపైన బెదిరింపులు చేసినందుకు అతడిని ప్రాసిక్యూట్ చేయాలి.//

    దున్న ఈనింది అంటే దూడని కట్టెయ్యమని చెప్పాడు అంటా ఎనకటికి ఎవడో.అలా ఉంది మీ ఇద్దరి సంభాషణ. అసలు జడ్జి ని బెదిరిస్తే జడ్జి ఊరుకుంటాడా? బెదిరిపోయి బుల్లెట్ ప్రూఫ్ కారు అమర్చాడా? మీ లాంటి జ్ఞాన వంతులని చూస్తె నా దేశం ఇలా ఎందుకు తగల బడింది అని అర్ధం అవుతుంది.

    // నిందుతుల రాజకీయ పరపతులతోనూ, ఆర్థిక స్థోమతుతోనూ న్యాయవ్యవస్థకు, పోలీసు వ్యవస్థకూ పనిలేదు ముమ్మాటికీ.//

    కర్రక్టే. నిందితుని ప్రాణ రక్షణ గురించి అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తికి తన హోదాని అనుసరించి నేర నిరూపరణ జరగక ముందు తన కి కావాల్సిన కనీస రక్షణ పొందే హక్కు ఉంది . ఒక విషయం అడుగుతా సూటిగా చెప్పండి. రేపు కోర్టులో జగన్ నిర్దోషి అని తేలింది అనుకోండి, సరైన రక్షణ సమకూర్చక పొతే అతనికి నష్టం ఇప్పుడు జరిగితే దానికి భాద్యత ఎవరు వహిస్తారు.

    ద్వేషం యాసిడ్ లాంటిది. అది మొదట తను నిలువ ఉన్న పాత్రను దహిస్తుంది. మీకు ఒక వర్గామన్నా , ఒక వ్యక్తి అన్న విపరీతమయిన ద్వేషం లాగా ఉంది. నలుగురికి ఆదర్శం గా ఉండి మార్గం చూపించాల్సిన మీరు 26 సంవత్సరాల యువకుడి చేత చెప్పించుకోవడం అంత బాగుండదు అనుకుంటా. ఒక సారి ఆలోచించండి. గుడ్డి ద్వేషం తో విషం కక్కకుండా మీ జ్ఞానాన్ని (ఎమన్నా ఉంటె) సమాజ బాగు కొరకు ఉపయోగించండి.

    తప్పుగా మాట్లాడితే మీ లాంటి పెద్దల ముందు క్షంతవ్యుడను.

    ReplyDelete
  5. ",మీరు వయసులో నే పెద్దగా కనపడుతున్నారు , కానీ మీ కామెంటు చూస్తె మీ ఆలోచనలు ద్వేషం తో నిండిన మర గుజ్జు మాటలు కన్నా హీనంగా ఉన్నాయి . మీరు ఏమి చదువుకున్నారో తెలియదు కానీ మీ జ్ఞానం చూస్తె చాలా జాలి వేస్తుంది. "

    ఇది అధికప్రసంగం, తలతిరుగుడు, కొవ్వెక్కి వాగడం. ఇక నీ వ్యాఖ్య చదవాల్సిన అవసరం లేదు. మడిచి చంచల్‌గూడ జైల్లో పెట్టుకో.

    ReplyDelete
  6. బెదిరించడమంటే ఏమిటో కొంచెం వివరించండి సార్! చంపేస్తానన్నాడా? బాంబులో, లేక ఇతర మారణాయుధాలేమైనా చూపించాడా? జగన్ కు వ్యతిరేకంగా రోజూ పేజీల కొద్దీ వార్తలు, కథనాలు, కార్టూన్లు వండివార్చే క్రమంలో తన విశ్వసనీయతను సాంతం కోల్పోయిన ఈనాడు పత్రిక కూడా ఈ వార్తలో "బెదిరింపు" అనే మాటను వాడనే లేదు. "తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమేనని న్యాయమూర్తికి తెలిపారు." అని మాత్రమే రాసింది. మీరేమో 'జడ్జీని బెదిరించారు' అని ఎక్కడో చదివి మీ కళ్లతో చూసొచ్చినట్లు సదరు న్యాయమూర్తి బెదిరిపోయి, బ్లాక్ మెయిలుకు లొంగిపోయి చట్టాన్ని అతిక్రమించి జగన్ కు అనుకూలంగా వ్యవహరించినట్లు రాసేశారు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యమంటారు మీలాంటోళ్ళే. కాస్త మీ బుద్ధిని వాడండి సార్! చిరాకేస్తుంది మీలాంటోళ్ళ విషపు రాతలు చూసి చూసి.

    ReplyDelete
    Replies
    1. ఫలానది చేయక పోతే .. నిరాహార దీక్ష చేస్తా అని జడ్జితో అనడాన్ని బెదిరించడం అనవచ్చు. కాని ఓ ఫ్యాక్షన్ లీడరుగా ఓ ఉద్యోగిని బెదిరించడం లాంటిది కాదు. జడ్జి as per rules పాటించమని అధికారులకు చెప్పడం, బెదిరిపోవడం కిందికి రాదు.
      జగన్ నిరాహార దీక్ష మొదలెడితే, కెసిఆర్ విషయంలో లాగా ఏ చిదంబరమో ఏదైనా ప్యాకేజి ప్రకటిస్తాడేమో. బంగారమ్మనే ఆరెంజ్ జ్యూస్ పంపిస్తుందేమో, ప్రయత్నిస్తే ప్రచారం బాగా వస్తుంది.

      Delete
  7. వ్యాఖ్య వ్రాసే వారు తమ పేరు కూడా ప్రస్తావించటం ఉచితమని భావిస్తాను.
    నేను ఏమి చదువుకున్నానంటే యేమి చెబుతాను? అది యీ చర్చకు అవసరమా? నేను న్యాయవాదిని మాత్రం కాను. నిందితులకు చట్టప్రాకారం లభించే సౌకర్యాలు లభించాలనే నేనూ చెప్పాను - మరొకసారి పరిశీలించండి. తనకు ముప్పు ఉందని చెప్పుకోవచ్చును, అదనపు భద్రతనూ కోరవచ్చును - కాని బెదిరించటం లాంటివి చేయరాదు కదా. ఒకవేళ బెదిరించటం కాకపోతే మంచిదే కాని అతడి మాటలలో అభ్యర్థన ధ్వనించటంలేదని నాకనిపించింది.

    నాకు ఒక వర్గంపట్లనో వ్యక్తిపట్లనో రాగద్వేషాలు ఉండవలసిన పని లేదు. లేవు. నమ్మండి, మానండి , మీ యిష్టం.

    నా జ్ఞానాన్ని గురించి ప్రసక్తి అవసరమా? మీకు నచ్చని విధంగా మాట్లాడే వాళ్ళు అజ్ఞానులంటే యెలా?
    పోనీలెండి, నేనొక జ్ఞానినన్న భ్రమ నాకేమీ లేదు.

    జ్ఞానవంతుడనని భావించుకుంటున్న మీకు చెప్పదగిన వాడనో కానో తెలియదు. ఒక్క మాట. "వాగ్భూషణం భూషణం" అన్న సూక్తి మరువకండి. మీరు చక్కగా వాదిస్తున్నారు. ఆవేశం తగ్గించుకొని సంయమనంతో మాట్లాడితే మీ వాక్కు మరింత శోభిస్తుంది. స్వస్తి.

    ReplyDelete
  8. బెదిరించడమంటే కొడతామనో లేదా బాంబులు వేస్తామనో కాదు కదా.. నాక్కావలసినది ఇవ్వకుంటే నేనిది చేస్తా అని మారాము చేసినా మనం బెదిరింపు క్రిందకే వస్తుంది. తనకు కావలసిన విధంగా ఎదుటివారిని ఒప్పించేందుకు ప్రయోగించే ఇలాంటి వాటిని బెదిరింపనే అంటున్నాము కదా.

    ReplyDelete
  9. మన్నించాలి.
    ఈ టపా శీర్షిక "నిరాహార దీక్ష చేస్తానని జడ్జీనే బెదిరించిన జగన్"
    అటువంటప్పుడు, ఒకరు నాతో "మీరేమో 'జడ్జీని బెదిరించారు' అని ఎక్కడో చదివి మీ కళ్లతో చూసొచ్చినట్లు" అని అనటం అనవసరం కదా? పైగా టపాలో స్పష్టంగా "తాను నిరహారదీక్ష చేపడుతానని కూడా జడ్జీని బెదిరించారు" అని ఉండి కదా? ఈ "బెదిరింపు" అనే దానిని నేను నిరసిస్తే ఒక అజ్ఞాతగారు చిందులు వేయటం బాగోలేదు.

    ReplyDelete